OTT Movie : 2018లో జీ5 ప్లాట్‌ఫారమ్‌లో విడుదలై, ప్రేక్షకుల మనసులు కదిలించిన ‘రంగ్‌బాజ్’ ఫ్రాంచైజీ మళ్లీ తిరిగి వచ్చింది. ఈసారి వెబ్ సిరీస్‌గా కాకుండా, పూర్తి సినిమాగా రిలీజ్ అయింది. ‘రంగ్‌బాజ్: ది బిహార్ చాప్టర్’ (Rangbaaz : the bihar chapter) అనే ఈ కొత్త చాప్టర్, 2022లో వచ్చిన బిహార్ ఎపిసోడ్‌లను ఆధారంగా చేసుకుని, ఫీచర్ ఫిల్మ్ ఫార్మాట్‌లో రూపొందింది. డైరెక్టర్ సచిన్ పాఠక్ రూపొందించిన ఈ సినిమా, 2025 అక్టోబర్ 31 నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. రాజకీయాలు, క్రైమ్, పవర్ స్ట్రగుల్స్ మిక్స్‌తో ఈ సినిమా అలరిస్తోంది. రియల్ స్టోరీ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా, యాక్షన్ థ్రిల్లర్ అభిమానులకు మస్ట్ వాచ్ సినిమా. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.
‘రంగ్‌బాజ్’ ఫ్రాంచైజీ 2018లో ఉత్తరప్రదేశ్ చాప్టర్‌తో స్టార్ట్ అయింది, ఆ తర్వాత రాజస్థాన్, బిహార్ చాప్టర్‌లు వెబ్ సిరీస్‌గా వచ్చాయి. అయితే 2022లో వచ్చిన ‘ది బిహార్ చాప్టర్’ వెబ్ సిరీస్, బిహార్ రాజకీయాలు, గ్యాంగ్‌స్టర్ లైఫ్‌ను గ్రిట్టీగా చూపించి హిట్ అయింది. ఇప్పుడు ఆ సిరీస్‌ను స్టాండ్ అలోన్ ఫీచర్ ఫిల్మ్‌గా మార్చి, మరింత కంపాక్ట్, ఇంటెన్స్ కథగా రూపొందించారు. కారణం? వెబ్ సిరీస్ ఫార్మాట్‌లోనే ఫ్యాన్స్ డిమాండ్ పెరిగింది. కానీ సినిమా ఫార్మాట్‌లో మరింత బిగ్ స్క్రీన్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వాలని ప్రొడ్యూసర్ అజయ్ రాయ్ డిసైడ్ అయ్యారు. ఇది ఫ్రాంచైజీని ఓటీటీలో మరింత పవర్ ఫుల్ చేస్తుంది. సినిమా రన్ టైమ్ సుమారు 120 నిమిషాల నిడివితో హై-ఇంటెన్సిటీ యాక్షన్ సీక్వెన్స్‌లు, ఎమోషనల్ డెప్త్‌తో ఉంటుంది. ఇందులో ఆకాంక్ష సింగ్, విజయ్ మౌర్య, రాజేష్ తైలాంగ్, ప్రశాంత్ నారాయణన్, గీతాంజలి కులకర్ణి కీలక పాత్రల్లో నటించగా, హరూన్ షా అలీ బేగ్ అనే టైటిల్ రోల్‌ను వినీత్ కుమార్ సింగ్ పోషించారు.
Read Also : భర్త బట్టల్లో మరో అమ్మాయి వెంట్రుకలు… ఆ భార్య ఇచ్చే షాక్‌కు ఫ్యూజులు ఔట్
బిహార్ రాజకీయాల డార్క్ సైడ్సినిమా హారూన్ షా అలీ బేగ్ జీవితం చుట్టూ తిరుగుతుంది. ‘సాహెబ్’ అని పిలవబడే ఈ గ్యాంగ్‌స్టర్, స్ట్రీట్ లెవల్ నుంచి రాజకీయాల్లో పవర్‌ఫుల్ ఫిగర్‌గా మారతాడు. ఇది మూహమ్మద్ షాహాబుద్దీన్ లైఫ్ (సివాన్ మాజీ MP) ఆధారంగా రూపొందింది. ఇది క్రైమ్, పవర్, బెట్రయల్ మిక్స్‌తో, సినిమా బిహార్ రాజకీయాల డార్క్ సైడ్‌ను గ్రిట్టీగా పోర్ట్రే చేస్తుంది. ట్రైలర్‌లో ఇంటెన్స్ డైలాగ్స్, యాక్షన్ సీన్స్ చూస్తేనే థ్రిల్ వస్తుంది. మరోవైపు సీనియర్ ఇన్‌స్పెక్టర్ ప్రశాంత్ నారాయణన్, ఇన్ని సంవత్సరాలుగా హరూన్ చేసిన నేరాల వివరాలను వివరిస్తూ కనిపిస్తాడు. అయినప్పటికీ అతన్ని అరెస్టు చేయడానికి సరైన ఆధారాలు ఒక్కటి కూడా అతని వద్ద ఉండవు. హరూన్ రాజకీయ నాయకుడిగా మారిన తర్వాత గ్యాంగ్‌స్టర్ గా ప్రత్యర్థులను ఎలా ఎదుర్కొంటాడో, ప్రజలలో భయాన్ని ఎలా సృష్టిస్తాడో ఈ చిత్రం కళ్ళకి కట్టినట్లు చూపిస్తుంది.