OTT Movie : ఓటిటిలో ఎన్నో రకాల భాషలో సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి. అయితే వీటిలో మరాఠీ సినిమాలకు కూడా ఒక మంచి స్థానం ఉంది. ఈ ఇండస్ట్రీ నుంచి కూడా మంచి కథలను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ స్టోరీ కొంచెం డిఫరెంట్ గానే ఉంటుంది. ఇందులో పైకి మంచిగా కనిపించే ఒక టీనేజ్ అబ్బాయికి, లోపల చాలా సైకో లక్షణాలు ఉంటాయి. అతడు అమ్మాయిలను చెడు దృష్టి తో చూస్తుంటాడు. ఇతని వల్ల పక్క వాళ్ళు ఇబ్బంది పడుతుంటారు. ఈ మూవీ చివరి వరకు ఆసక్తికరంగా సాగిపోతుంది. దీని పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే …
జీ 5 (ZEE5) లో
ఈ మరాఠీ సైకలాజికల్ డ్రామా మూవీ పేరు ‘మంఝా’ (Manjha). 2017 లో విడుదలైన ఈ మూవీకి జతిన్ వాగ్లే దర్శకత్వం వహించారు. ఇండియా స్టోరీస్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై త్రిలోక్ మల్హోత్రా, KR హరీష్ దీనిని నిర్మించారు. ఇది 21 జూలై 2017 న విడుదలైంది. ప్రస్తుతం జీ 5 (ZEE5) ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీలోకి వెళితే
సమీధ అనే ఒక ఒక మహిళ ఇప్పుడు తన కొడుకుతో సింగిల్ గా ఉంటోంది. ఆమె తన భర్త నుండి విడాకులు తీసుకుంటుంది. అతనికి అన్ని చెడు అలవాట్లు ఉండటంతో, ఈ నిర్ణయం తీసుకుంటుంది. ఆమెకు జైదీప్ అనే టీనేజ్ వయసు ఉన్న ఒక కొడుకు ఉంటాడు. తన కొడుకుతో కలిసి లోనావాలా అనే ప్రాంతంలో, కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి వస్తుంది. తన స్నేహితురాలు వీణ నడిపే హోటల్‌లో ఉద్యోగం పొందుతుంది. జైదీప్‌ను చదువుకోవడానికి ఒక బోర్డింగ్ స్కూల్‌లో చేర్పిస్తుంది. అక్కడ జైదీప్ స్కూల్ లో విక్కీ అనే యువకుడితో స్నేహం చేస్తాడు. విక్కీ మొదట అమాయకంగా, అతనికి సహాయం చేస్తున్నట్లు కనిపిస్తాడు. కానీ అతడు మానసికంగా, హింసాత్మక స్వభావం కలిగి ఉంటాడు. అమ్మాయిల పిచ్చి కూడా ఉంటుంది. ఒక రోజు విక్కీ, జైదీప్‌ను ఒక యువతిపై దాడి చేయమని ఒత్తిడి చేస్తాడు. దాడి చేయడమే కాకుండా, బలాత్కారం కూడా చేయమని చెప్తాడు. అతని ప్రవర్తనకి జైదీప్ భయంతో వనికిపోతాడు.
ఆ తరువాత సమీధకు కూడా ఈ విషయం తెలిసిపోతుంది. కొడుకును కాపాడడానికి, విక్కీ ప్రమాదకరమైన చర్యలను బయటపెట్టడానికి సమీధ ప్రయత్నిస్తుంది. అయితే వీణ మీద కూడా విక్కీ దాడి చేసి, బలాత్కారం చేయాలనుకుంటున్నాడాని తెలుసుకుంటుంది.ఇది ఆధారాలతో బయట పెట్టాలి అనుకుంటుంది సమీధ. విక్కీ ని పట్టుకోవడానికి అందరూ ప్రయత్నిస్తుంటారు. అయితే విక్కీ మాత్రం సమీధను తాళ్లతో బంధించి, తన కోరికను తీర్చుకోవాలని ప్రయత్నిస్తాడు. చివరికి విక్కీ సమీధ పై అఘాయిత్యం చేస్తాడా ? అతన్ని ఆధారాలతో పట్టుకుంటారా ? ఎందుకు విక్కీ అల ప్రవర్తిస్తున్నాడు ? ఈ విషయాలను, ఈ మరాఠీ సైకలాజికల్ డ్రామా సినిమాను చూసి తెలుసుకోండి.
Read Also : మొక్కజొన్న తోటలో మారణ హోమం … సైకోలుగా మారే పిల్లలు … గూస్ బంప్స్ తెప్పించే హారర్ థ్రిల్లర్