OTT Movie : భర్త చనిపోయాడు అని ఊరంతా నమ్మించిన ఓ భార్యకు, ఒకరోజు అనుకోకుండా ఊహించని ట్విస్ట్ ఎదురవుతుంది. భర్త కాని భర్తతో ఆమె చేసిన పని తెలిస్తే దిమ్మ తిరగాల్సిందే. ఇలాంటి ఉత్కంఠభరితమైన కథతో రూపొందిన ఈ మూవీ ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది? అనే విషయాన్ని తెలుసుకుందాం పదండి.
అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్
ఈ మూవీ పేరు “దెలివు” (Thelivu). 2019లో విడుదలైన ఈ మలయాళ క్రైమ్ ఫ్యామిలీ డ్రామాకు ఎం.ఎ. నిషాద్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా 2019 అక్టోబర్ 18న థియేటర్లలో విడుదలై, తర్వాత డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలో అందుబాటులోకి వచ్చింది. కేరళలోని మన్రో దీవిలో చిత్రీకరించిన ఈ చిత్రంలో ఒక అనాథ యువతి జీవితంలో సంఘటనలు ఆమెను ఒక క్రైమ్‌లో చిక్కుకునేలా చేయడం, తన భర్తతో కలిసి న్యాయం కోసం ఎలా పోరాడింది? అనేది చూపించారు. ఆషా శరత్, లాల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాలో రెంజి పనిక్కర్, నెడుముడి వేణు, మీరా నాయర్, సునీల్ సుగాత, సుధీర్ కరమణ, మణియన్‌పిళ్ల రాజు, జాయ్ మాథ్యూ కీలక పాత్రలు పోషించారు. ఈ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)లో స్ట్రీమింగ్ కి అందుబాటులో ఉంది.
కథలోకి వెళ్తే…
కథ గౌరి (ఆషా శరత్) అనే అనాథ యువతి చుట్టూ తిరుగుతుంది. ఆమె ట్రక్ డ్రైవర్ ఖలీద్ (లాల్) ను వివాహం చేసుకుని, ఒక అనాథాశ్రమంలో సంరక్షకురాలిగా పని చేస్తుంది. అయితే ఆమె జీవితం ఒక దారుణ సంఘటనతో తలకిందులవుతుంది. అనాథాశ్రమ యజమాని ఒక యువతిని అత్యాచారం చేయడానికి ప్రయత్నించడం చూసిన గౌరి, అతన్ని అనుకోకుండా చంపేస్తుంది. ఈ సంఘటన గౌరి, ఖలీద్ జీవితాలను రాత్రికి రాత్రే మార్చేస్తుంది. ఈ జంట కోర్టు, కేసుల నుండి తప్పించుకోవడానికి మన్రో దీవికి పారిపోతారు. కానీ అక్కడ కూడా వాళ్ళు ప్రమాదంలో చిక్కుకుంటారు.
పోలీసు అధికారులు (రెంజి పనిక్కర్, మీరా నాయర్) ఈ కేసు విషయమై దర్యాప్తు ప్రారంభిస్తారు. ఇది కథను ఒక పజిల్‌లా మారుస్తుంది. గౌరి, ఖలీద్ గతం, గౌరి ఒక భయపడే స్త్రీ నుండి చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకునే ధైర్యవంతురాలైన మహిళగా మారడం వంటి సీన్స్ సినిమాలో హై పాయింట్స్. ఆషా శరత్ నటన అద్భుతంగా ఉంటుంది. ఇక ఖలీద్‌గా లాల్, తన భార్యకు మద్దతుగా నిలబడే భర్తగా బాగా నటించాడు. క్లైమాక్స్‌లో ఒక భావోద్వేగమైన ట్విస్ట్‌తో కథ ముగుస్తుంది. ఆ ట్విస్ట్ ఏంటి? ఇంతకీ ఈ భార్యాభర్తల గతం ఏంటి? ఆ కేసు నుంచి ఈ దంపతులు ఎలా బయట పడ్డారు ? హీరోయిన్ అతన్ని చంపడం వెనకున్న కారణం అదేనా? అనే ప్రశ్నలకు సమాధానం కావాలంటే ఈ సినిమాను చూడాల్సిందే.
Read Also : వరుసగా పిల్లలు మిస్సింగ్… సోల్ ఈటర్ పేరుతో సైకో అరాచకం… నరాలు కట్ అయ్యే సస్పెన్స్