Gundeninda GudiGantalu Today episode july 13th: నిన్నటి ఎపిసోడ్ లో.. రవి శృతిలో ఎక్కడ సురేంద్ర ఇంట్లోనే ఉండిపోతారు అని ప్రభావతి టెన్షన్ పడుతూ ఉంటుంది. అలా చేయడంవల్ల తనకు ఆస్తి రాదని ఎలాగైనా శృతిని తన దారిలోకి తీసుకురావాలని అనుకుంటుంది. శృతి కి ఫోన్ చేస్తుంది.. శృతి నేను బాలు ఉండగా ఆ ఇంట్లోకి చచ్చిన రాను అని సమాధానం చెబుతుంది. ప్రభావతి ఎంత సద్ది చెప్పాలని చూసినా శృతి మాత్రం నేను రానంటే రాను కావాలంటే వీడియో కాల్ చేస్తాను మాట్లాడండి అని అంటుంది. ఆ శోభ సురేంద్ర పక్క ప్లాన్ తోనే రవి శృతిని అక్కడికి తీసుకెళ్లిపోయారు ఇంకా పంపిస్తారని నమ్మకాలు నాకైతే లేవని కామాక్షి అంటుంది. ఆ మాటతో దిగులు పెట్టుకున్న ప్రభావతి రవి కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. రవి పేరుతో కొరియర్ వస్తుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ప్రోమో విషయానికొస్తే.. రవికోసం ప్రభావతి ఎదురుచూస్తుంది. రవి పేరు వినగానే కిందకు వస్తుంది. ప్రభావతి రవి వచ్చాడా ఏడి ఎక్కడ అని వెతుకుతుంది. రవి కాదమ్మా రవి పేరుతో కొరియర్ వచ్చింది అని మనోజ్ అంటాడు. ఈ బాలు గాడి వల్లే నా కుటుంబం రెండు ముక్కలైంది అని ప్రభావతి రెచ్చిపోతుంది. మీనాని దొంగ అన్నప్పుడు నువ్వు ఇంత బాధ పడలేదే. ఇంటి కోడలి దొంగ అంటే నువ్వు ఇలా ఒప్పుకుంటావా అని బాలు అంటాడు. మొత్తానికి బాలు, ప్రభావతిల మధ్య పెద్ద వార్ జరుగుతుంది.
మనోజ్ కూల్‌గా వాడు ఇక రాడేమో అమ్మా.. వాడు రావాలంటే శ్రుతి రావాలి కదా.. శ్రుతి రావాలంటే మన బాలుతో శ్రుతి వాళ్ల నాన్నకు క్షమాపణ చెప్పిస్తే సరిపోతుంది కదా.. అప్పుడు వాళ్లు రావచ్చేమో అని సలహా ఇస్తాడు. దాంతో ప్రభావతి సీరియస్ అవుతుంది. ఖచ్చితంగా క్షమాపణలు చెప్పాల్సిందే అని అంటుంది. వయసు పెరిగితే సరిపోదు బుద్ధి కూడా పెరగాలి. వాడి వైపు తగ్గట్లు వాడి చేశాడా అని బాలు ఇంకా రెచ్చిపోయి మాట్లాడుతాడు.
నన్నే అంటున్నారని ప్రభావతి కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఒక కొడుకు ఇది ఒక కొడుకు అది అంటూ నువ్వు తేడాలు చూపించడం వల్లే వాళ్ల మధ్య ప్రేమలు లేకుండా పోయాయని క్లాస్ పీకుతాడు.. అందర్నీ సమానంగా చూస్తే ఇలాంటి బాధలు వచ్చేవి కాదు కదా వీళ్ళ మధ్యలో వీళ్ళకే గొడవలు జరిగేవి కాదు కదా అని సత్యం అంటాడు. ఏ రోజైనా కన్నతల్లిగా వాడి మీద ప్రేమ చూపించావా..? ఎంతసేపు వాడిని అక్కడికి రాకూడదు ఇక్కడికి రాకూడదు అని కండిషన్స్ పెడతావే.. కానీ వాడు నీ కొడుకు అన్న సంగతి నువ్వు ఎందుకు మర్చిపోయావు అని సత్యం అంటాడు..
Also Read :గుడ్డిగా నమ్మి దారుణంగా మోసపోయిన అనసూయ.. ఏం జరిగిందంటే..?
ఆ తర్వాత రోహిణి మ్యాటర్ మర్చిపోయిందని అనుకుంటుంది. కానీ తర్వాత రోజు రోహిణిని పిలిచి ఈ విషయాన్ని గట్టిగా ఆడుతుంది. రోహిణీకి ప్రభావతి మరో మాస్ వార్నింగ్ ఇచ్చింది. అది ఫైనల్ వార్నింగ్‌లానే ఉంది. ఏడి మీ నాన్నా? ఆయన ఎక్కిన విమానం ఇంకా ఆకాశంలో పక్షిలా తిరుగుతూనే ఉందా? నన్ను వెర్రిదాన్ని చేద్దాం అనుకుంటున్నావా? నువ్వు ఏం చెప్పినా నమ్ముతూనే ఉంటాను అనుకుంటున్నావా? మా మనోజ్ గాడికి అత్తగారి ఇల్లు అనేది ఒకటి ఉందా? నీకు పుట్టిళ్లు అనేది ఉందా లేదా? పోనీ మీ నాన్న గురించి అడగటం మానెయ్యాలా? మీ నాన్న ఎట్టి పరిస్థితుల్లోనూ రావాలి. లేదంటే నీ స్థానమేంటో నీకు తెలిసేలా చేస్తాను.. నీ బతుకు ఏమవుతుందో ఆలోచించుకో’ అని మాస్ వార్నింగ్ ఇస్తోంది ప్రభావతి. రోహిణి నిజం చెప్తుందా? లేదా ఇంట్లోంచి వెళ్ళిపోతుందా? లేదా వేరే ఏదైన జరుగుతుందా? అనేది సోమవారం ఎపిసోడ్ లోనే చూడాలి..