BigTV English
Advertisement

OTT Movie : ఈ ఊర్లో ఫ్యామిలీకో సైకో… అడుగు పెడితే చావును వెతుక్కుంటూ వచ్చినట్టే… ప్రతీ సీన్ క్లైమాక్స్‌లా ఉండే థ్రిల్లర్

OTT Movie : ఈ ఊర్లో ఫ్యామిలీకో సైకో… అడుగు పెడితే చావును వెతుక్కుంటూ వచ్చినట్టే… ప్రతీ సీన్ క్లైమాక్స్‌లా ఉండే థ్రిల్లర్

OTT Movie : సైకలజికల్ థ్రిల్ ను ఇష్టపడే వాళ్లకి కిక్కిచ్చే ఒక హాలీవుడ్ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా ట్విస్టులు, బ్లాక్ మ్యాజిక్ రిచ్యువల్స్ తో ఆడియన్స్ కి గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. రెండవ వరల్డ్ వార్ తరువాత ఒక సైనికుడు ఒక విలేజ్ లో ఎదుర్కునే సంఘటనలతో ఈ మూవీ తిరుగుతుంది. ఈ థ్రిల్లర్ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే


నెట్‌ఫ్లిక్స్‌లో

“ది డెవిల్ ఆల్ ది టైమ్” (The Devil All the Time) ఆంటోనియో కాంపోస్ దర్శకత్వంలో వచ్చిన సైకలాజికల్ థ్రిల్లర్ సినిమా. ఇందులో టామ్ హాలండ్ (ఆర్విన్ రస్సెల్), బిల్ స్కార్స్‌గార్డ్ (విల్లార్డ్ రస్సెల్), రిలే కీఫ్ (సాండీ హెండర్సన్), జాసన్ క్లార్క్ (కార్ల్ హెండర్సన్), సెబాస్టియన్ స్టాన్ (లీ బోడెకర్), రాబర్ట్ ప్యాటిన్సన్ (ప్రెస్టన్ టీగార్డిన్) ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 2020 సెప్టెంబర్ 16న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. 2 గంటల 18 నిమిషాల రన్‌టైమ్ తో IMDbలో 6.5/10 రేటింగ్ పొందింది. ఈ సినిమా ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు డబ్బింగ్ లో కూడా ఉంది.

స్టోరీలోకి వెళ్తే

1945లో సెకండ్ వరల్డ్ వార్ నుంచి తిరిగొచ్చిన విల్లార్డ్ రస్సెల్ అనే సోల్జర్, ఓహయోలోని క్నాకెమ్‌స్టిఫ్ అనే పల్లెటూరులో సెటిల్ అవుతాడు. వార్‌లో జపాన్ సోల్జర్స్ ని క్రూరంగా చంపిన సంఘటనలు అతన్ని బాధపెడతాయి. అతను దేవుడి మీద నమ్మకం పెట్టి, ఫారెస్ట్‌లో ప్రార్థనలు చేస్తుంటాడు. ఆ తరువాత ఛార్లెట్ అనే అమ్మాయిని కలిసి, లవ్‌లో పడి, పెళ్లి చేసుకుంటాడు. వీళ్లకు ఆర్విన్ అనే కొడుకు పుడతాడు. విల్లార్డ్ భార్యకు క్యాన్సర్ సోకడంతో, ఆమెను కాపాడడానికి విపరీతమైన మత విశ్వాసంలో మునిగి, జంతు బలిదానాల వరకు వెళ్తాడు. తన కొడుకు అర్విన్‌కు కూడా ఈ విశ్వాసాలను నేర్పిస్తాడు. కానీ విషాదంగా అర్విన్ అనాథగా మిగిలిపోతాడు.


అర్విన్ తన తల్లిదండ్రుల మరణం తర్వాత అమ్మమ్మ ఎమ్మా వద్ద, సవతి సోదరి లెనోరాతో కలసి పెరుగుతాడు. అర్విన్ ను తన తండ్రి హింసాత్మక వారసత్వం వెంటాడుతుంది. అతను ఒక దుర్మార్గపు మతగురువు, స్థానిక గుండాలతో పోరాడాల్సి వస్తుంది. ఎమ్మా వద్ద పెరిగిన లెనోరా నిష్కల్మషమైన అమ్మాయి. కొత్తగా వచ్చిన ప్రెస్టన్ అనే మతగురువు ఆమెను తన మాయమాటలతో మోసం చేస్తాడు. ప్రెస్టన్ తన మత ప్రభావాన్ని దుర్వినియోగం చేస్తూ, లెనోరాను విషాదంలోకి నెట్టివేస్తాడు. మరో వైపు కార్ల్, సాండీ అనే దంపతులు వరుస హత్యలు చేస్తుంటారు. వీళ్ళు కథలోకి మిగతా పాత్రలతో ముడిపడి, హింసాత్మక సంఘటనలు సృష్టిస్తారు. ఇక క్లైమాక్స్‌లో అన్ని స్టోరీలు ఒక్కటై, ఒక షాకింగ్ ఫైట్‌తో ముగుస్తాయి. చివరికి అర్విన్ తల్లిదండ్రులు ఎలా చనిపోయారు ? లెనోరాను మతగురువు ఎందుకు మోసం చేస్తాడు ? కార్ల్, సాండీ హత్యలు ఎందుకు చేస్తుంటారు ? అనే ప్రశ్నలకు సమాధానాలను, ఈ సినిమాను చూసి తెలుసుకోండి.

Read Also : ప్రేమ పేరుతో సీక్రెట్ వీడియోలు… లేడీ ఆఫీసర్ ను నిండా ముంచే కేటుగాడు… గ్రిప్పింగ్ స్పై థ్రిల్లర్

Related News

Kantara 1 OTT: నెల రోజుల్లోనే ఓటీటీకి వచ్చేస్తోన్న కాంతార 1, ఆ రోజు నుంచే స్ట్రీమింగ్‌

This week OTT Releases : ఈ వారం ఓటీటీలోకి బ్లాక్ బాస్టర్ మూవీస్.. ఆ రెండు మిస్ అవ్వకండి..

OTT Movie : మనుషుల్ని మటన్లా తినే వంశం… ఈ సైకోల ట్రాప్ లో కాలేజ్ స్టూడెంట్స్… ప్యాంట్ తడిపించే సీన్లు

OTT Movie : కళ్ళముందే పార్ట్స్ పార్ట్స్ గా కట్టయ్యే మనుషులు… దెయ్యాల నౌకలో దరిద్రపుగొట్టు సైకో కిల్లర్

OTT Movie : ఇంటిముందు తిష్ట వేసే సైకో… ఒక్కసారి చూస్తే లైఫ్ లాంగ్ మర్చిపోలేని కథ మావా

OTT Movie : ఫ్యామిలీ ఫ్యామిలీ సైకోలే… అమ్మాయి కన్పిస్తే అదే పని… ఒళ్ళు గగుర్పొడిచే రియల్ స్టోరీ

OTT Movie : మనుషుల్ని మాయం చేసే మిస్డ్ కాల్… హర్రర్ మూవీ లవర్స్ ఈ మాస్టర్ పీస్ ను డోంట్ మిస్

OTT Movie : చంద్రుడు అమాంతం భూమిపై పడిపోతే… ఒక్కో సీన్ కు గూస్ బంప్స్ పక్కా… మైండ్ బెండింగ్ సై-ఫై మూవీ

Big Stories

×