IND Vs PAK : ఆసియా కప్ 2025లో భాగంగా టీమిండియా తొలి మ్యాచ్ లో యూఏఈకి చుక్కలు చూపించిన విషయం తెలిసిందే. అయితే సెప్టెంబర్ 14న పాకిస్తాన్ తో జరిగే మ్యాచ్ పై ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియాలో ఓ పిక్ వైరల్ అవుతోంది. టీమిండియా యూఏఈకి చుక్కలు చూపించడంతో.. ప్యాంట్ లోనే చుచ్చు పోసుకుంటున్నట్టు ఫొటో క్రియేట్ చేశారు. దీంతో అది సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వాస్తవానికి టీమిండియా కీలక బౌలర్లు లేకుండానే బరిలోకి దిగుతుంది. అంతా ఆల్ రౌండర్లతో ఇండియా ఊపు మీద కొనసాగుతోంది. స్పిన్నర్లు ప్రత్యర్థులకు చెమటలు పట్టిస్తున్నారు. యూఏఈ బ్యాటర్లు వాస్తవానికి 100 కి పైగా పరుగులు చేస్తారని తొలి ఓవర్ లో అంతా భావించారు. కానీ చివరికి వాళ్లు కేవలం 13.1 ఓవర్లలో 57 పరుగులకే పరిమితం అయ్యారు. ఇద్దరూ ముగ్గురు బ్యాటర్లు మినహా మిగతా బ్యాటర్లు ఎవ్వరూ కూడా రెండంకెల స్కోరు కూడా చేయలేకపోయారు.
Also Read : IND Vs PAK : UAE కు చుక్కలు చూపించిన టీమిండియా…ప్యాంట్ లోనే పోసుకుంటున్న పాకిస్తాన్
ముఖ్యంగా అంతర్జాతీయ టీ-20లలో భారత్ కి.. ఇతర జట్లకు మధ్య ఉన్న తేడా ఏంటో మరోసారి స్పష్టంగా అర్థం అయింది. వరల్డ్ ఛాంపియన్ టీమిండియా ముందు పసికూనల్లా యుఏఈ జట్టు పూర్తిగా తేలిపోయింది. ఆసియా కప్ టీ-20 టోర్నీలో భారత్ భారీ గెలుపుతో సత్తా చాటింది. భారత బౌలర్ల ధాటికి కేవలం 79 బంతుల్లోనే యూఏఈ ఇన్నింగ్స్ ముగిసింది. 79 బంతుల్లో యూఏఈ 57 పరుగులు చేయగా.. టీమిండియా జట్టు 27 బంతుల్లోనే 60 పరుగులు చేసింది. కుల్దీప్ యాదవ్, శివమ్ దూబెతో కలిసి 7 వికెట్లు పడగొట్టారు. వరుణ్ చక్రవర్తి 2, బుమ్రా 1, అక్షర్ 1 వికెట్ పడగొట్టారు. ఇక అభిమానులు అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సమరంలో ఆదివారం పాకిస్తాన్ తో భారత్ తలపడనుంది.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ ఘన విజయంతో శుభారంభం చేసింది. యూఏఈతో జరిగిన మ్యాచ్ లో భారత్ 9వికెట్ల తేడాతో యూఏఈని చిత్తు చేసింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ కి దిగిన యూఏఈ 13.1 ఓవర్లలో 57 పరుగులకు కుప్పకూలింది. ఓపెనర్లు అలీషాన్ 22, వసీమ్ 19 వీరిద్దరూ మాత్రమే రెండంకల స్కోర్ చేశారు. మిగతా బ్యాటర్లంతా సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యారు. కుల్దీప్ యాదవ్ 4/7, శివమ్ దూబె 3/4 బౌలింగ్ తో చెలరేగారు. అనంతరం బ్యాటింగ్ కి దిగిన భారత్ 4.3 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 60 పరుగులు చేశారు. ఇందులో 4 ఫోర్లు, 5 సిక్సర్లతో మొత్తం 46 పరుగులు వచ్చాయి. అభిషేక్ శర్మ 16 బంతుల్లో 30 పరుగులు చేసి ఔట్ కాగా.. శుబ్ మన్ గిల్ 9 బంతుల్లో 20 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 2 బంతుల్లో 7 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. యూఏఈని చిత్తు గా ఓడించడంతో పాకిస్తాన్ కి భయం పుట్టుకుంది. ఇక ఆదివారం దుబాయ్ వేదికగా టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ రసవత్తరంగా జరుగనుంది.
https://www.facebook.com/share/1BfxM6yPBC/