OTT Movie : రియల్ లైఫ్ లో యాక్షన్ సీన్స్ ను చూడడం చాలా అరుదు. అందుకే సినిమాలోనైనా చూసి తరిద్దాం అనుకునేవాళ్లు ఎంతోమంది ఉంటారు. అందుకే థియేటర్లలో ఈలలు, గోలలతో బిగ్ స్క్రీన్ పేలిపోయేంత రచ్చ చేస్తుంటారు మూవీ లవర్స్. అయితే ఇదంతా మన సినిమాల వరకే. బోర్డర్ దాటి సినిమాలు చూడాలంటే ఓటీటీనే ఆప్షన్. ఇందులో రియల్ లైఫ్ లో జరిగిన యాక్షన్ డ్రామా ఆధారంగా రూపొందిన ఓ కొరియన్ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. యాక్షన్ మూవీ లవర్స్ మిస్ అవ్వకుండా చూడాల్సిన ఈ మూవీ ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది? కథ ఏంటి? అనే విషయంలోకి వెళ్తే…
నెట్ ఫ్లిక్స్ (Netflix)లో స్ట్రీమింగ్
ఈ మూవీ పేరు “The Drug King”. 2018లో విడుదలైన దక్షిణ కొరియా సినిమా ఇది. 1970లలో బుసాన్‌లో జరిగిన నిజమైన కథ ఆధారంగా రూపొందిన క్రైమ్ డ్రామా, యాక్షన్ థ్రిల్లర్ ఇది. ఈ సినిమా ఒక సాధారణ స్మగ్లర్ ఎలా డ్రగ్ లార్డ్‌గా మారి, తన జీవితంలో అధికారం, సంపదను సాధిస్తాడనే విషయం నుంచి, చివరకు అతని ఆశలు అతన్ని ఎలా నాశనం చేస్తాయో కూడా చూపించారు. ఈ చిత్రంలో హాస్యం, హింస, కుటుంబ జీవితంలో సంఘర్షణలను చూపిస్తూనే, డ్రగ్ వ్యాపారం వంటి చీకటి ప్రపంచాన్ని కళ్ళముందుకు తీసుకొచ్చారు.
కథలోకి వెళ్తే…
లీ డూ-సామ్ బుసాన్‌లో ఒక చిన్న స్థాయి స్మగ్లర్. బంగారం, లగ్జరీ వాచ్‌లను అక్రమంగా రవాణా చేస్తూ జీవిస్తాడు. అతనిది భార్య, ఇద్దరు పిల్లలు, ముగ్గురు చెల్లెళ్లు ఉన్న కుటుంబం. కానీ అతని ఆదాయం కుటుంబాన్ని పోషించడానికి ఏమాత్రం సరిపోదు. ఒక రోజు అతను ఒక డ్రగ్ గ్యాంగ్ కు సహాయం చేసి, మాదకద్రవ్యాల వ్యాపారంలోకి అడుగు పెడతాడు. తన తెలివితేటలు, ఆశయాలతో ఊహించనంత త్వరగా డ్రగ్ వ్యాపారంలో మంచి స్థాయికి ఎదుగుతాడు.
కిమ్ జంగ్-ఆ (బే డూనా) అనే మహిళ సహాయంతో అతను రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలతో సంబంధాలు ఏర్పరచుకుని, జపాన్‌కు “మేడ్ ఇన్ కొరియా” అనే క్రాంక్ (మెథాంఫెటమైన్) డ్రగ్‌ను ఎగుమతి చేస్తాడు. లీ డూ-సామ్ తన పేరును లీ హ్వాంగ్-సూన్‌గా మార్చుకుని, సమాజంలో గౌరవనీయ వ్యక్తిగా, ఓవర్ నైట్ డ్రగ్ లార్డ్‌గా డబుల్ లైఫ్ గడుపుతాడు. కానీ అతని జీవితం క్రమంగా చితికిపోతుంది. అతని భార్య అతన్ని విడిచి పెడుతుంది. అతను కిమ్ జంగ్-ఆతో సంబంధం పెట్టుకుంటాడు.
అదే సమయంలో కిమ్ ఇన్-గూ అనే ప్రాసిక్యూటర్ అతని డ్రగ్ సామ్రాజ్యాన్ని నాశనం చేయడానికి ప్రయత్నిస్తాడు. లీ డూ-సామ్ తన సామ్రాజ్యాన్ని కాపాడుకోవడానికి హింస, మోసాలకు పాల్పడతాడు. కానీ అతని ఆశలు, డ్రగ్ వాడకం అతన్ని పతనం వైపు నడిపిస్తాయి. చివరకు లీ సామ్రాజ్యం ఎలా కుప్పకూలింది? వెళ్ళిపోయిన భార్య తిరిగి వచ్చిందా లేదా ? అసలు అతను చేసిన తప్పు ఏంటి? ఓవర్ నైట్ డ్రగ్ లార్డ్ అయిన లీ ఎలాంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వచ్చింది? క్లైమాక్స్ ట్విస్ట్ ఏంటి? అన్నది తెరపై చూడాల్సిందే.
Read Also : మనుషుల్ని చంపేసి బ్రెయిన్ తినేసే సైకో కిల్లర్… ఎందుకింత ఘోరమైన పని చేస్తున్నాడో తెలిస్తే దిమాక్ ఖరాబ్