OTT Movie : సైకో కిల్లర్స్ ఎలా ఉంటారు? అంటే ఈ ప్రశ్నకు సమాధనం చెప్పడం కష్టమే. ఎందుకంటే ఇప్పటిదాకా ఎన్నో సినిమాల్లో ఎన్నో రకాల మనస్తత్వం ఉన్న సైకోలను చూశాం మనం. కానీ ఇప్పుడు చెప్పుకోబోయే సైకో మాత్రం బాబోయ్ ఇదేం అరాచకం అనిపించేలా చేయడం పక్కా. మరి ఈ సైకో ఏం చేశాడు? ఆ కిల్లర్ మూవీ ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది? అనే వివరాల్లోకి వెళ్తే…
మనోరమా మ్యాక్స్ లో స్ట్రీమింగ్
ఈ మూవీ పేరు “John Luther”. 2022లో విడుదలైన ఈ మలయాళ క్రైమ్ థ్రిల్లర్ సినిమా అభిజిత్ జోసెఫ్ దర్శకత్వంలో తెరకెక్కగా, జయసూర్య సీఐ జాన్ లూథర్ పాత్రలో నటించారు. ఈ చిత్రం ప్రస్తుతం మనోరమా మ్యాక్స్ (Manorama Max)లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇది మున్నార్ లో జరిగే ఒక గ్రిప్పింగ్ థ్రిల్లర్. ఇందులో జాన్ లూథర్ వినికిడి సమస్యను ఒక కీలక అంశంగా చూపిస్తూ, సీరియల్ కిల్లర్ కేసును పరిష్కరించే ఇంట్రెస్టింగ్ కథనం ఉంటుంది. సిద్ధిఖ్ (ప్రసాద్), దీపక్ పరంబోల్, అత్మీయ రాజన్, దృశ్య రఘునాథ్ ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు. ఈ మూవీ తెలుగు డబ్బింగ్ వెర్షన్ కూడా అందుబాటులో ఉంది.
కథలోకి వెళ్తే…
మున్నార్ పోలీస్ స్టేషన్‌లో సీఐ జాన్ లూథర్ (జయసూర్య) ఒక హిట్-అండ్-రన్ కేసును దర్యాప్తు చేస్తాడు. ఈ యాక్సిడెంట్ లో టీచర్ ప్రకాశన్ (ప్రమోద్ వెల్లియనాడ్) మరణిస్తాడు. కానీ రైడర్ మిస్ అవుతాడు. అదే సమయంలో ఒక స్కూల్ బాయ్, మరొక మహిళ, గీత కూడా మిస్ అవుతారు. జాన్ ఈ కేసుల మధ్య సంబంధం ఉందని భావిస్తాడు. ఈ క్రమంలోనే ఒక హై-ప్రొఫైల్ కేసు దర్యాప్తులో జరిగిన ఒక గొడవలో జాన్ గాయపడతాడు. దీనివల్ల అతను ఒక చెవిలో పూర్తిగా వినికిడిని కోల్పోతాడు. మరొక చెవిలో 20% వినికిడి సామర్థ్యం మాత్రమే ఉంటుంది.
హియరింగ్ ఎయిడ్ ఉపయోగించి, జాన్ తిరిగి డ్యూటీలో చేరతాడు. ఒక పికప్ ట్రక్ క్లూ ద్వారా, అతను వెంకట్ (ఎలాంగో కుమారవేల్) అనే డ్రైవర్ ను గుర్తిస్తాడు. అతను ఒక మాజీ మెడికల్ స్టూడెంట్, సీరియల్ కిల్లర్‌గా మారిన వ్యక్తి. వెంకట్ అంకుల్ ప్రసాద్ (సిద్ధిఖ్) వెంకట్ కు ఉన్న మానసిక సమస్యల గురించి వెల్లడిస్తాడు. అతను శస్త్రచికిత్సలు చేయడానికి డెడ్ బాడీలను ఉపయోగించాడని తెలుస్తుంది. జాన్, తన వినికిడి సమస్యతో సంబంధం లేకుండా వెంకిట్‌ను పట్టుకోవడానికి శాయశక్తులా ప్రయత్నిస్తాడు. ఒక ఉత్కంఠభరితమైన ఛేజ్‌లో కేసును పరిష్కరిస్తాడు. ఇంతకీ వెంకట్ ఎందుకు అందరినీ చంపుతున్నాడు? చంపాక ఏం చేస్తున్నాడు? హీరో అతన్ని ఎలా పట్టుకున్నాడు? చివరికి ఏం జరిగింది? అన్నది తెరపై చూడాల్సిన కథ.
Read Also : ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న సరికొత్త మలయాళ మర్డర్ మిస్టరీ… క్రైమ్ తో పాటే కామెడీ కూడా…