Illu Illalu Pillalu Today Episode july 13 th: నిన్నటి ఎపిసోడ్ లో.. రామరాజు తిరుపతి చెప్పిన మాటల్ని సీరియస్గా తీసుకొని ధీరజ్ తెచ్చిన షర్టుని వేసుకుని బయటికి వస్తాడు. అటు ప్రేమ డాన్స్ క్లాసులు చెప్తూ సేన కంట పడుతుంది. ఏం చేస్తున్నావ్ అమ్మ అని సేన అంటాడు. ఇదంతా నిన్ను కాదు ఆ రామరాజు గాన్ని అనాలి. కోడలు సంపాదనతో పూట గడుపుకుంటున్నాడా? నా చేతిలో అని సేన వెళ్ళిపోతాడు. ధీరజు వాళ్ళ నాన్న షర్టు వేసుకోలేదని బాధపడుతూ ఉంటాడు.. ఎదురుగా వాళ్ళ నాన్న షర్టు వేసుకొని కనిపించడంతో చాలా సంతోషంగా ఫీల్ అవుతాడు. ప్రేమ ఇంటి దగ్గర ఎటువంటి రచ్చ జరగలేదు అని రిలాక్స్ అవుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ప్రోమో విషయానికొస్తే.. కోడలు సంపాదనతో ఇల్లు గడుపుకోవాలి అని చూస్తున్నావా? కూతుర్ని ఎలా పెంచానో తెలుసా? నువ్వు ఇలా చేస్తావని అస్సలు ఊహించలేదు కొంచెమైనా సిగ్గుందా అని సేన రెచ్చిపోయి మాట్లాడుతాడు. రామరాజు కుటుంబ సభ్యులు అందరూ అప్పుడే ఒక్కొక్కరుగా ఇంటికి వచ్చేస్తారు. ఏమైంది ఎందుకు అరుస్తున్నావు అని అంటే.. నా కూతురు చేత జాబ్ చేస్తున్నావా అని సేన అడుగుతాడు. నేను అమ్మాయిని ఎప్పుడో జాబ్ మానేయమని చెప్పాను మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. ఎవరో చెప్పిన మాటలు విని నన్ను అంటున్నారు అని రామరాజు చెప్తాడు. ప్రేమను రామరాజు జాబ్ చేస్తున్నావా అని అడుగుతాడు.. ప్రేమ చేస్తున్నాను అని చెప్తుంది. ఆ తర్వాత మాటలు యుద్ధం జరుగుతుంది.
ఏంట్రా నోటికొచ్చినట్టు వాగుతున్నావ్ అని రామరాజు అంటే.. వాగడం కాదురా.. ముక్కలుగా నరికేయాలన్నంత కోపం వస్తుంది అని అంటాడు సేనాపతి. ‘ఏంట్రా నరుకుతావా? నరుకూ అని ముందుకు వెళ్తాడు రామరాజు. ఒరేయ్ సేనా.. ఎన్నాళ్లురా ఇలా? ఎప్పుడూ ఈ గొడవలేంట్రా.. ఇంత చిన్న విషయానికి అని అంటుంది శారదాంబ. ఏంటీ చిన్న విషయమా? వీళ్లు నా మేనకోడల్ని హింస పెట్టడం చిన్న విషయమా? అని అంటుంది భద్రావతి. ఆ మాటతో వేదవతి కల్పించుకుని.. ‘ఇదిగో అది నీకే కాదు.. నాకూ మేనకోడలే ముందు అది గుర్తుపెట్టుకో.. నీ కన్నా ఎక్కువగా నేనే దాన్ని బాగా చూసుకుంటున్నాను అని వేదవతి అంటుంది.
నా మేన కోడలిని బయటకు పంపించి ఉద్యోగం చేపిస్తున్నారా అని అడుగుతుంది. దానిపై సీరియస్ అయినా రామరాజు.. ఏం మాట్లాడుతున్నావ్.. మతి ఉండే మాట్లాడుతున్నావా? కాలేజ్‌కి వెళ్లి చదువుకుంటున్న పిల్లని పట్టుకుని పని చేస్తుందని అంటావ్ ఏంటీ? అని అంటాడు. ఎహే ఆపరా నీ డ్రామాలు.. నా కూతురు బయటకు వెళ్లి డాన్స్ క్లాస్‌లు చెప్తుంది ఆ విషయం మాకు తెలియదని అనుకుంటున్నావా? కోడలితో పని చేయించుని.. దాని సంపాదనపై బతకడానికి సిగ్గుగా అనిపించడం లేదా? అని అంటాడు సేన..
Also Read :పల్లవికి చుక్కలు చూపించిన అవని.. అక్షయ్ లో మార్పు వస్తుందా?
ఆ తర్వాత నా కూతురు నగలు నీ ఇంట్లోనే ఉన్నాయి అని అంటాడు సేన.. ఏంట్రా నీ బాబు పెద్ద ధర్మరాజు అన్నట్టు మాట్లాడతావ్.. వాడు అంత గొప్పేడే అయితే.. నా కూతుర్ని నగల్ని తన దగ్గర పెట్టుకోడురా.. రోషం పౌరుషం ఉంటే మా అమ్మాయి నగల్ని మాకు ఇచ్చేసేవాడు అని అంటాడు సేనాపతి.. నా మరదలితో నగల్ని నీ ఇంటికి రప్పించుకున్నావ్.. చాలా తెలివిగా ఆ నగల్ని కొట్టేశావ్.. పరాయి వాళ్ల సొమ్ముని కాజేసే నీదీ ఓ బతుకేనా? ఛీ ఛీ అని అంటుంది భద్రావతి.. తండ్రి నీ నాట మాటలు అంటుంటే కొడుకులు సేనపై గొడవ దిగుతారు. ప్రేమ ఎంత చెబుతున్నా కూడా రామరాజు సేన ఇద్దరు తగ్గరు. సేన ఎక్కువగా మాట్లాడడంతో సాగర్ కోపంతో రగిలిపోతాడు. మా నాన్నతో ఎలా మాట్లాడుతున్నారు తెలుసా? మర్యాదగా మాట్లాడండి అని అంటాడు. రామరాజు మాత్రం సాగర్ ను అరుస్తాడు. వాళ్లేంటి నాన్న అలా మాట్లాడుతుంటే, ఇలానే సమాధానం చెప్పాలి అని చందు అంటాడు. చందు కూడా మా నాన్న జోలికి వస్తే మర్యాదగా ఉండదు అని వార్నింగ్ ఇస్తాడు. మధ్యలో ప్రేమ మీరు కుటుంబాలని సర్ది చెప్పలేక ఇబ్బంది పడుతూ ఉంటుంది. చూస్తుంటే ఇరు కుటుంబాల మధ్య మరోసారి పెద్ద యుద్ధమే జరిగేలా కనిపిస్తుంది. అక్కడితో ప్రోమో ఎండ్ అవుతుంది. సోమవారం ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..