E-Paper
Advertisement

ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ నుంచి 12 టైటిల్స్ వరకు… UConn బాస్కెట్‌బాల్ సామ్రాజ్యంగా ఎలా మారింది?

ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ నుంచి 12 టైటిల్స్ వరకు… UConn బాస్కెట్‌బాల్ సామ్రాజ్యంగా ఎలా మారింది?
Advertisement

Basketball Documentary on OTT: ఒకప్పుడు వరుస ఓటములతో సతమతమైన కాలేజీ బాస్కెట్‌బాల్ టీమ్… ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైన మహిళల బాస్కెట్‌బాల్ ప్రోగ్రామ్‌గా ఎలా మారింది ? ఆ మార్పు వెనుక ఉన్న కోచ్ తన ప్లేయర్లను ఎంత కఠినంగా తీర్చిదిద్దాడు ? ఓటమి భయాన్ని విజయానికి ఆయుధంగా మార్చి ఏకంగా 12 నేషనల్ ఛాంపియన్‌షిప్స్ సాధించిన UConn Huskies ప్రయాణమే ‘The Dynasty: UConn Huskies’. నాలుగు దశాబ్దాల చరిత్రను మూడు ఎపిసోడ్లలో చూపించే ఈ డాక్యుమెంటరీలో విజయాలతో పాటు కోచ్ జెనో ఆరియెమ్మా కఠినమైన కోచింగ్, ప్లేయర్లపై ఒత్తిడి, ప్రత్యర్థులతో పోటీ, విజయానికి చెల్లించిన మూల్యం కూడా కనిపిస్తాయి. మరి ఈ ఇన్స్పైరింగ్ స్పోర్ట్స్ డాక్యుమెంటరీ సిరీస్ ఏ ఓటీటీలో అందుబాటులో ఉందో తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే…

1985లో యూకాన్ మహిళల బాస్కెట్‌బాల్ ప్రోగ్రామ్‌కు పెద్దగా గుర్తింపు లేదు. అప్పటి వరకు టీమ్‌కు ఒకే ఒక్క విన్నింగ్ సీజన్ ఉండగా, జెనో ఆరియెమ్మా కోచ్‌గా బాధ్యతలు చేపట్టడంతో అసలు మార్పు మొదలవుతుంది. ఓటమిని అంగీకరించని మైండ్‌సెట్, క్రమశిక్షణ, కష్టపడే తత్వంతో ఆయన జట్టును పూర్తిగా మార్చడం ప్రారంభిస్తాడు. ప్లేయర్లలోని బలహీనతలను బయటకు తీసి, మరింత కష్టపడేలా చేయడం ఆరియెమ్మా కోచింగ్‌లో కీలకంగా మారుతుంది.

Advertisement

మొదటి ఎపిసోడ్ ‘Fear of Failure’లో ఈ విధానం ప్రధానంగా కనిపిస్తుంది. రిబెక్కా లోబో వంటి ప్లేయర్లు పెద్ద వేదికపై తమ ప్రతిభను నిరూపించుకునే స్థాయికి ఎదగడం యూకాన్ మార్పులో కీలక ఘట్టంగా నిలుస్తుంది. తర్వాతి సంవత్సరాల్లో స్యూ బర్డ్, డయానా టారసీ, స్విన్ క్యాష్, మాయా మూర్, బ్రెన్నా స్టీవర్ట్ వంటి స్టార్ ప్లేయర్లు యూకాన్లో భాగమవుతారు. ఒక్కో తరం మారినా విజయాల పరంపర మాత్రం కొనసాగుతుంది. చివరకు యూకాన్ ఏకంగా 12 NCAA నేషనల్ ఛాంపియన్‌షిప్స్ సాధించి చరిత్రలో అత్యంత విజయవంతమైన కాలేజీ బాస్కెట్‌బాల్ ప్రోగ్రామ్‌లలో ఒకటిగా నిలుస్తుంది.

అయితే ఈ విజయాల వెనుక ఒత్తిడి కూడా పెరుగుతుంది. ప్రతి సీజన్‌లో గెలవాల్సిందే అనే అంచనాలు ప్లేయర్లపై ప్రభావం చూపుతాయి. రెండో ఎపిసోడ్‌లో Tennesseeతో యూకాన్కు ఉన్న తీవ్రమైన పోటీ, కోచ్ పాట్ సమిట్‌తో ఆరియెమ్మా రైవల్రీ ప్రత్యేకంగా కనిపిస్తుంది. కథ 2024-25 సీజన్‌కు చేరుకున్నప్పుడు పైజ్ బ్యూకర్స్ తన కాలేజీ కెరీర్‌ను నేషనల్ టైటిల్‌తో ముగించాలని లక్ష్యంగా పెట్టుకుంటుంది. అయితే ఒక దశలో బ్యూకర్స్, ఆరియెమ్మా మధ్య విభేదాలు తలెత్తడంతో పరిస్థితి క్లిష్టంగా మారుతుంది.

Advertisement

ఆ తర్వాత టీమ్ ఎలా తిరిగి పుంజుకుంది? చివరకు 2025 నేషనల్ ఛాంపియన్‌షిప్‌ను ఎలా గెలుచుకుంది? అనేదే సిరీస్‌లో కీలకమైన భాగం. ఈ సిరీస్ కేవలం ట్రోఫీలు, రికార్డుల గురించి కాదు. విజయం కోసం ఒక కోచ్ తన ప్లేయర్లను ఎంత దూరం నెట్టగలడు ? నిరంతరం గెలవాలనే ఒత్తిడి ఒక జట్టుపై ఎలాంటి ప్రభావం చూపుతుంది ? అనే ప్రశ్నలకు సమాధానం కూడా.

తెలుగులో ఎలా చూడాలంటే ?

మూడు ఎపిసోడ్ల ఈ స్పోర్ట్స్ డాక్యుమెంటరీ సిరీస్… ఆగస్టు 21 నుంచి Apple TVలో స్ట్రీమింగ్ అవుతోంది. ఒక్కో ఎపిసోడ్ సుమారు 38 నుంచి 47 నిమిషాల నిడివితో ఉంటుంది. ఒరిజినల్ ఆడియో ఇంగ్లీష్ కాగా, Apple TV ఇండియా లిస్టింగ్ ప్రకారం తెలుగు సబ్‌టైటిల్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. బాస్కెట్‌బాల్‌పై ఆసక్తి ఉన్నవారితో పాటు, ఒక సాధారణ టీమ్ ప్రపంచ స్థాయి స్పోర్ట్స్ డైనస్టీగా ఎలా మారిందో తెలుసుకోవాలనుకునే వారికి ఈ స్పోర్ట్స్ డాక్యుమెంటరీ పర్ఫెక్ట్ ఛాయిస్.

Read Also: కోట్ల ఆస్తి, విలాసవంతమైన కుటుంబం… కట్ చేస్తే షాకింగ్ ట్విస్ట్… మెంటలెక్కించే సైకలాజికల్ థ్రిల్లర్

Tags

Related News

ఏడేళ్లుగా కనిపించని ప్రేయసి… ఆమె ఆచూకీ చెప్పే మాంత్రిక జీవులతో ప్రయోగం… ఓటీటీలోకి వచ్చిన వింత సిరీస్

బంగారం కోసం సముద్రంలో ప్రాణాంతక వేట… నిధి కోసం నిలువునా ముంచేసే కన్నింగ్ గాళ్ళు… ఊపిరి బిగబట్టి చూడాల్సిన అడ్వెంచర్ థ్రిల్లర్

చిన్ననాటి స్నేహితుల ముసుగులో ద్రోహం… ప్రపంచాన్ని కాపాడేందుకు ప్రాణాలకు తెగించే ఏజెంట్… జాన్ సీనా యాక్షన్ అడ్వెంచర్

దెయ్యాలనే బంధువులుగా భావించే వింత మనిషి… నవ్విస్తూ, ప్రేమలో ముంచెత్తే మలయాళం ఫాంటసీ మూవీ ఓటీటీలోకి

పోలీసులకు హింట్ ఇచ్చి మరీ చంపే కిల్లర్… ట్విస్టుల మీద ట్విస్టులు… సీజన్ 2 రచ్చ షురూ

గ్రామ దేవత ప్రతిరూపంగా భావించే దున్నపోతు… బలిచ్చే రోజే మిస్సింగ్… రవితేజ సోదరుడి కొడుకు మూవీ స్ట్రీమింగ్

దొంగతనాలు చేసే అమ్మాయికి సీక్రెట్ స్పై మిషన్… టార్గెట్ కొడుకుతోనే ప్రేమలో… క్రేజీ కొరియన్ థ్రిల్లర్

అంగారకుడిపై మనుషుల శరీరాలను ఆక్రమించే దుష్టశక్తులు… హాలీవుడ్ హర్రర్ థ్రిల్లర్ నెట్‌ఫ్లిక్స్‌లో

Big Stories

Advertisement
×