E-Paper
Advertisement

తెలుగు ఒక్క ముక్క కూడా రాదు.. కానీ ఇరుముడిలో మాత్రం ఇరగదీసింది!

తెలుగు ఒక్క ముక్క కూడా రాదు.. కానీ ఇరుముడిలో మాత్రం ఇరగదీసింది!
Advertisement

Baby Nakshatra Background: బేబీ నక్షత్ర.. ఎక్కడ చూసినా ఈ పేరే ఇపుడు మారుమ్రోగిపోతుంది.ఇరుముడి సినిమాలో రవితేజకి కూతురిగా నటించిన నక్షత్ర చేసిన నటనకి ఫిదా అయిపోయారు ఆడియన్స్. మానేమ్మ అనే క్యారక్టర్ లో నక్షత్ర ఒకరకంగా ఇచ్చిపడేసిందనే చెప్పాలి.

ఇక ఇరుముడి సినిమా చూసిన వాళ్ళంతా ఇంత బాగా చేసిన ఈ పాప ఎవరై ఉంటారా అంటూ ఆరాలు తీయడం మొదలెట్టారు.ఇక సినిమా థియేటర్లలో ఒక రేంజ్ లో వసూళ్ళ వర్షం కురిపిస్తుండగా మరో వైపు మూవీ టీమ్ ప్రమోషన్స్ లో మరింత జోరు చూపిస్తుంది.ఈ క్రమంలోనే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న బేబీ నక్షత్ర.. పలు ఆసక్తికరమైన సంఘటనలని చెప్పుకొచ్చింది.మరి అవేంటో మనం చూసేద్దాం.

శివ రాజ్ కుమార్ సినిమా డాడ్ లో నటిస్తుండగా

Advertisement

ఇంటర్వ్యూలో బేబీ నక్షత్ర మాట్లాడుతూ తనది కేరళ అని,అందుకే తాను మలయాళం సినిమాలు ఎక్కువగా చూస్తానని, తనకు తెలుగు అసలేమాత్రం తెలీదని తెలిపింది. తనకి నటన అంటే ఇష్టమని ,అందుకే ఇంస్టాలో రీల్స్ బాగా చేసేదాన్ని అని తెలిపింది.ఇక తాను కన్నడ శివ రాజ్ కుమార్ సినిమా డాడ్ లో నటిస్తుండగా శివ నిర్వాణ టీమ్ నుండి తనకి కాల్ వచ్చిందని, ఇంస్టా లో రీల్స్ చూసి వాళ్ళు తనని అప్రోచ్ అయ్యారని, అలా ఇరుముడి సినిమాలో అవకాశం వచ్చిందని తెలిపింది.

డైలాగులు చాలా పెద్దగా ఉండటం వల్ల

సినిమా విషయానికి వస్తే తాను మలయాళీ అవడం వల్ల తనకి తెలుగు సరిగ్గా రాదని, కానీ ఇరుముడి సినిమాకి చాలా పెద్ద పెద్ద డైలాగులు ఇచ్చారని, వాటిని మలయాళంలోకి మార్చుకుని, ఆ డైలాగ్స్ ని నేర్చుకుని సినిమాలో నటించానని చెప్పుకొచ్చింది. అయితే మొదట్లో డైలాగులు చాలా పెద్దగా ఉండటం వల్ల నేర్చుకుంటానా లేదా అని చాలా భయపడ్డానని కానీ రవితేజ, శివ నిర్వాణలతో పాటు యూనిట్ మొత్తం చాలా ఎంకరేజ్ చేశారని గుర్తుచేసుకుంది.

Advertisement

also read :తండ్రి మొదటి కారు కోసం విష్ణు మంచు ఇంత చేశాడా?

అయితే తనకి తెలుగు పూర్తిగా రాకపోయినా కొద్ది కొద్దిగా అర్థమవుతుందని అంటూనే అమ్మ, నాన్న, తిన్నావా వంటి పదాలని పలికి నవ్వులు పూయించింది. ఇక తెలుగులో ఇలానే అమ్మ అనే పదం మలయాళం లో కూడా అలాగే ఉంటుందని తెలిపింది.

సినిమాలో స్వంతంగా డబ్బింగ్

ఇక తనకి నాన్నగా నటించిన రవితేజ తనని సొంత కూతురిలా చూసుకున్నాడని, తనకి తెలుగు రాకపోవడంతో తనతో ఇంగ్లీష్ లోనే మాట్లాడేవాడని, ఇక తన తల్లిపాత్రలో నటించిన ప్రియా శంకర్ కూడా తనని ఎంతో ప్రోత్సహించింది అని గుర్తుచేసుకుంది.ఇక ఈ సినిమాలో తనే స్వంతంగా డబ్బింగ్ చెప్పుకుందట కూడా.ఇక ఇరుముడి సినిమాలో ఎన్ని సీన్లు ఉన్నా నీళ్ళలో ఆడుకునే సీన్ చాలా ఇష్టమైన సీన్ అని, తనకి నీళ్ళల్లో ఆడుకోవడం అంటే చాలా కాబట్టే ఆ సీన్ ని అంతలా ఎంజాయ్ చేయగలిగానని చెప్పుకొచ్చింది.

ఇక సినిమాలో ఆడియన్స్ ని ఎమోషనల్ చేస్తున్నక్లైమాక్స్ గురించి మాట్లాడుతూ షూటింగ్ చేసేటప్పుడు అసలు ఏడవలేదని,కానీ సినిమా చూసేటప్పుడు మాత్రం తన కంటి నుండి నీళ్ళు వచ్చాయని తెలిపింది.

తెలుగు హీరోలు తెలీదు 

ఇక తెలుగు సినిమాలు చూడకపోవడంతో ఇక్కడి హీరోల గురించి పెద్దగా తెలీదని కాని మలయాళం సినిమాలు విపరీతంగా చూస్తానని పేర్కొంది. ఇక ప్రస్తుతం తాను ఏడో తరగతి చదువుతున్నానని,తనతో తన తల్లి అలాగే తన మేనమామ కూడా షూటింగ్ కి వస్తాడని తెలిపింది.ఇక ఈ సినిమాతో పాటు మరో తెలుగులో సినిమాలో నటించినప్పటికీ అది ఎప్పుడు రిలీజ్ అవుతుందో మాత్రం తనకి తెలీదని వాపోయింది.

also read :కొమరం కన్నీళ్ల వెనుక ఇంత కథ ఉందా !

ఏది ఏమైనా చిన్నప్పుడే తండ్రిని కోల్పోయిన నక్షత్ర చిన్న వయసులోనే మంచి మంచి పాత్రలని దక్కించుకుని స్టార్ స్టేటస్ దక్కించుకోవడం మెచ్చుకోతగ్గ విషయం. చూడాలి మరి మానేమ్మగా అలరించిన  నక్షత్ర ముందు ముందు ఇంకెన్ని సినిమాల్లో తళుక్కుమంటుందో !

Tags

Related News

తండ్రి మొదటి కారు కోసం విష్ణు మంచు ఇంత చేశాడా?

అయ్యప్ప భక్తుడిగా మారిన డేవిడ్ వార్నర్..

మళ్లీ వివాదంలో చిక్కుకున్న శ్రీకాంత్ అయ్యంగర్!

ఇండస్ట్రీలో విషాదం.. కన్నుమూసిన ఐరన్ లేడీ!

టాక్సిక్‌కు టికెట్ రేట్లు పెంచేశారు.. ఎంతంటే?

మల్లె పూల పల్లకి వెనుక ఇంత కథ ఉందా?

‘ఇరుముడి’ థియేటర్లపై ఎగ్జిబిటర్ల ఆవేదన.. న్యాయమేనా?

Big Stories

Advertisement
×