E-Paper
Advertisement

ఆఫీసులో ఆరేళ్లు ప్రేమ… కట్ చేస్తే కార్పొరేట్ ప్రపంచం నుండి దూరంగా… ఫీల్ గుడ్ వర్క్‌ప్లేస్ రొమాంటిక్ డ్రామా

ఆఫీసులో ఆరేళ్లు ప్రేమ… కట్ చేస్తే కార్పొరేట్ ప్రపంచం నుండి దూరంగా… ఫీల్ గుడ్ వర్క్‌ప్లేస్ రొమాంటిక్ డ్రామా
Advertisement

The Early Spring OTT: ట్రైనీగా జాయిన్ అయిన ఓ అమ్మాయి… మొదటి రోజే తన బాస్ చేతిలో అవమానానికి గురైతే ? అతను ఎంత కఠినంగా ప్రవర్తించినా, తన టాలెంట్‌తో అందరి ప్రశంసలు అందుకుంటే ? అదే బాస్‌తో ప్రేమలో పడి ఏకంగా ఆరేళ్లు కలిసి ఉన్న తర్వాత ఇద్దరి మధ్య అపోహలు వచ్చి విడిపోతే ? ఏళ్ల తర్వాత మళ్లీ కలిసిన ఆ జంట తమ ప్రేమను తిరిగి పొందగలిగిందా ? అనే కథతో తెరకెక్కిన చైనీస్ వర్క్‌ప్లేస్ రొమాంటిక్ డ్రామా ‘ది ఎర్లీ స్ప్రింగ్’ (The Early Spring series). మరి ఈ ఫీల్ గుడ్ డ్రామాను ఏ ఓటీటీలో చూడచ్చు ? తెలుగులో ఉందా లేదా ? అన్న వివరాలపై ఒక లుక్కేద్దాం పదండి.

కథలోకి వెళ్తే…

బీజింగ్‌లోని ఓ ప్రముఖ అడ్వర్టైజింగ్ ఏజెన్సీలోకి షాంగ్ జితావో ట్రైనీగా అడుగు పెడుతుంది. పెద్దగా అనుభవం లేకపోయినా, తన టాలెంట్‌పై నమ్మకంతో ఉద్యోగంలో చేరుతుంది. కానీ మొదటి రోజే ఆమెకు లూవాన్ నియాన్ అనే కఠినమైన సీనియర్ బాస్ ఎదురవుతాడు. జితావో సామర్థ్యాన్ని తక్కువగా అంచనా వేసిన అతను, ఈ ఉద్యోగం ఆమె వల్ల కాదంటూ పరోక్షంగా హెచ్చరిస్తాడు. అయితే జితావో వెనక్కి తగ్గదు.

Advertisement

బాస్ పెట్టే కఠినమైన టాస్కులు, ఆఫీస్ ప్రెజర్, రాజకీయాలను ఎదుర్కొంటూ తనను తాను నిరూపించుకుంటుంది. క్రమంగా కంపెనీలో కీలకమైన ఉద్యోగిగా ఎదుగుతుంది. ఈ ప్రయాణంలో లూవాన్ నియాన్ కూడా ఆమె పట్టుదలను గమనిస్తాడు. మొదట కేవలం బాస్, ఉద్యోగి మధ్య ఉన్న సంబంధం కాస్తా మెల్లగా ప్రేమగా మారుతుంది. అయితే ఇద్దరూ ఒకే సంస్థలో పని చేస్తుండటంతో తమ బంధాన్ని రహస్యంగా ఉంచుకుంటారు. దాదాపు ఆరేళ్ల పాటు వారి ప్రేమ కొనసాగుతుంది.

కానీ కొన్ని అపోహలు, మనస్పర్థలు ఇద్దరి మధ్య దూరాన్ని పెంచుతాయి. చివరకు జితావో ఎవరికీ చెప్పకుండా లూవాన్ జీవితంలో నుంచి వెళ్లిపోతుంది. కొన్నేళ్ల తర్వాత జితావో తన సొంత ఊరికి తిరిగి వస్తుంది. అప్పటికి ఆమె పూర్తిగా మారిపోయి ఉంటుంది. చిన్న రెస్టారెంట్‌తో పాటు సొంత ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీని నడుపుతూ తనకు నచ్చిన జీవితాన్ని గడుపుతుంటుంది. అదే సమయంలో లూవాన్‌తో ఆమెకు అనుకోకుండా మళ్లీ ఎదురు పడుతుంది.

Advertisement

ఒకప్పుడు తన కింద పని చేసిన అమ్మాయి ఇప్పుడు ఎవరి మీద ఆధారపడకుండా తనకంటూ ఓ ప్రపంచాన్ని నిర్మించుకోవడం చూసి లూవాన్ ఆశ్చర్యపోతాడు. గతంలో జరిగిన తప్పులను అర్థం చేసుకున్న ఇద్దరూ తమ మధ్య ఉన్న అపోహలను తొలగించుకునే ప్రయత్నం చేస్తారు. మరి ఈసారి వారి ప్రేమ కథ సక్సెస్ అయిందా? ఆరేళ్ల బంధాన్ని విడదీసిన సమస్యలు పరిష్కారమయ్యాయా? ఇద్దరూ మళ్లీ ఒక్కటయ్యారా? అనేదే ఈ సిరీస్‌లోని ఎమోషనల్ పాయింట్.

Also Read : ఇదేం ఖర్మరా బాబు… షార్క్స్ ఒకవైపు… మాఫియా మరోవైపు… సీట్ ఎడ్జ్ అండర్ వాటర్ సర్వైవల్ థ్రిల్లర్

స్ట్రీమింగ్ ఎక్కడంటే ?

సన్ కియాన్, జింగ్ బోరాన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్, 24 ఎపిసోడ్ల చైనీస్ వర్క్‌ప్లేస్ రొమాంటిక్ డ్రామా. ప్రస్తుతం Netflixలో స్ట్రీమింగ్ అవుతోంది. ఒరిజినల్ ఆడియో చైనీస్‌లో ఉండగా, ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే ప్రస్తుతం తెలుగు ఆడియో మాత్రం అవైలబుల్ గా లేదు. వర్క్‌ప్లేస్ లవ్ స్టోరీస్, బ్రేకప్ తర్వాత రీయూనియన్ కథలు ఇష్టపడే వారికి ఈ సిరీస్ పక్కాగా నచ్చుతుంది.

Tags

Related News

గ్రామంపై భారీ కొండచిలువ దాడి.. దాన్ని చంపేందుకు 3 రోజుల డెడ్‌లైన్… చైనీస్ మాన్‌స్టర్ థ్రిల్లర్ తెలుగులో

గతం మర్చిపోయిన సూపర్ హీరో… పట్టిస్తే భారీ నజరానా… ఈ సిరీస్‌లో ట్విస్టులు మామూలుగా ఉండవు

వందల అడుగుల ఎత్తులో ప్రాణాలతో పోరాటం… ప్రాణాంతక వ్యాధికి మందు కనిపెడితే ఇదా బహుమతి ? ఈ సర్వైవల్ థ్రిల్లర్ నెక్స్ట్ లెవల్

ప్రాణంగా ప్రేమించిన వాడిని పొట్టన పెట్టుకునే వైరస్… కన్నీళ్ళు పెట్టించే ఎమోషనల్ లవ్ స్టోరీ

భూమిని నాశనం చేయాలని దిగివచ్చే దేవుడు… డ్రాగన్ బాల్ ఫ్యాన్స్‌కు కొత్త యానిమే ట్రీట్

ముప్పైల్లో హార్మోన్ల గోల… నవ్వలేక చస్తారు… నెట్‌ఫ్లిక్స్‌లోకి కొత్త స్టాండప్ స్పెషల్

లవర్ కి బ్రేకప్… కట్ చేస్తే మాజీ ప్రియుడితో మళ్లీ కనెక్షన్… ఓటీటీలోకి ఇంట్రెస్టింగ్ లవ్ ట్రయాంగిల్

రేపు ఒక్కరోజే ఓటీటీలోకి 2 సినిమాలు, 1 వెబ్‌సిరీస్, మోస్ట్ అవైటెడ్ రియాలిటీ షో… అన్నీ తెలుగులోనే

Big Stories

Advertisement
×