E-Paper
Advertisement

MG డబుల్ ధమాకా.. EV, PHEVతో కొత్త టోమాహాక్ SUVలు లాంచ్!

MG డబుల్ ధమాకా.. EV, PHEVతో కొత్త టోమాహాక్ SUVలు లాంచ్!
Advertisement

MG Tomahawk EV and PHEV Launched: ఇండియన్ ఆటోమొబైల్ మార్కెట్లో ఎలక్ట్రిక్, హైబ్రిడ్ వెహికల్స్ కు రోజు రోజుకు డిమాండ్ విపరీతంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా ఒకేసారి రెండు కొత్త మోడళ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. అందులో ఒకటి ఎంజీ హెక్టర్ టోమాహాక్ EV కాగా, మరొకటి ఎంజీ హెక్టర్ టోమాహాక్ PHEV. ఒకటి పూర్తిగా బ్యాటరీతో నడిచే ఎలక్ట్రిక్ SUV కాగా, మరొకటి ప్లగ్ ఇన్ హైబ్రిడ్ టెక్నాలజీతో పనిచేసే SUVగా మార్కెట్ కు పరిచయం చేసింది.

రూ.19.49 లక్షలకు హెక్టర్ టోమాహాక్ EV

కొత్త హెక్టర్ టోమాహాక్ EV ప్రారంభ ఎక్స్ షోరూమ్ ధర రూ.19.49 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది. ఈ ఎలక్ట్రిక్ SUVలో 69.2kWh బ్యాటరీ ప్యాక్‌ను అందించారు. పూర్తి ఛార్జ్‌ తో 517 కిలోమీటర్ల వరకు MIDC రేంజ్ ఇస్తుందని కంపెనీ ప్రకటించింది. ఈ SUVని 5 సీట్లతో పాటు 7 సీట్ల కాన్ఫిగరేషన్‌లో కూడా కొనుగోలు చేసే అవకాశం కల్పిస్తోంది. దీంతో చిన్న కుటుంబాలు, పెద్ద కుటుంబాల అవసరాలకు అనుగుణంగా రెండు ఆప్షన్స్ అందుబాటులోకి వచ్చాయి. ఎక్కువ మంది ప్రయాణించే వారికి 7 సీట్ల వెర్షన్ ఉపయోగకరంగా ఉంటుంది.

BaaSతో మరింత తక్కువ ధరకే!  

Advertisement

హెక్టర్ టోమాహాక్ EVలో MG అందిస్తున్న బ్యాటరీ యాజ్ ఎ సర్వీస్ స్కీమ్ కు ఆకట్టుకుంటుంది.  దీని ద్వారా ప్రారంభ ధర మరింత తగ్గుతుంది. బ్యాటరీ ఖర్చును వాహన ధర నుంచి వేరు చేసి, వినియోగానికి అనుగుణంగా బ్యాటరీ ఛార్జీలు చెల్లించే అవకాశం ఉంటుంది. ఎలక్ట్రిక్ కార్లను కొనుగోలు చేయాలనుకుంటున్న వారికి ఈ విధానం బాగా సాయపడుతుంది.

రూ.25.70 లక్షలకు టోమాహాక్ PHEV

ఇక మరోవైపు MG హెక్టర్ టోమాహాక్ PHEVను రూ.25.70 లక్షల ప్రారంభ ఎక్స్ షోరూమ్ ధరతో విడుదల చేసింది. ఇది  దేశంలోని మొట్టమొదటి మెయిన్‌స్ట్రీమ్ ప్లగ్ ఇన్ హైబ్రిడ్ SUVగా గుర్తింపు తెచ్చుకుంది. ఇందులో ఎలక్ట్రిక్ పవర్‌తో పాటు ఫ్యూయల్ ఇంజిన్ కూడా ఉంటుంది. బ్యాటరీని బయట నుంచి ఛార్జ్ చేసుకునే అవకాశం ఉంటుంది. రోజువారీ ప్రయాణాల్లో ఎలక్ట్రిక్ పవర్‌ను ఉపయోగించుకోవచ్చు. ఎక్కువ దూరం ప్రయాణించాల్సి వచ్చినప్పుడు ఫ్యూయల్ ఇంజిన్ సహాయపడుతుంది.

రెండు టెక్నాలజీలు.. రెండు రకాల అవసరాలు!

Advertisement

హెక్టర్ టోమాహాక్ EV పూర్తిగా ఎలక్ట్రిక్ ప్రయాణాన్ని కోరుకునే వారి కోసం రూపొందించబడింది. ఛార్జింగ్ సదుపాయాలు అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో నివసించే వారికి ఇది మంచి ఎంపికగా ఆప్షన్ గా చెప్పుకోవచ్చు. అదే సమయంలో, టోమాహాక్ PHEV ఎలక్ట్రిక్ డ్రైవింగ్ ప్రయోజనాలను కోరుకుంటూనే, ఎక్కువ దూర ప్రయాణాల్లో రేంజ్‌పై ఆందోళన చెందని వారికి ఉపయోగకరంగా ఉండొచ్చు. అంటే రెండు వాహనాలు వేర్వేరు అవసరాలను దృష్టిలో పెట్టుకుని రూపొందించినట్లు కనిపిస్తోంది. ఒకే మోడల్ లో పూర్తి ఎలక్ట్రిక్, ప్లగ్ ఇన్ హైబ్రిడ్ వెర్షన్లను తీసుకురావడం ద్వారా MG భారత మార్కెట్లో తన పరిధిని మరింత విస్తరించుకునే కొత్త వ్యూహం కనిపిస్తోంది.

Read Also: సింగిల్ ఛార్జ్ తో 215 కి.మీ రేంజ్‌.. విన్ ఫాస్ట్ మినీ ఈవీ వచ్చేస్తోంది!

Tags

Related News

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ డ్రైవర్ లేకుండానే నడుస్తుంది.. కొత్త టెక్నాలజీ చూస్తే పిచ్చెక్కాల్సిందే!

మైలేజ్‌లో గ్లాంజా.. బూట్ స్పేస్‌లో ఆల్ట్రోజ్.. ఏ CNG కారు కొంటే బెస్ట్?

హ్యుందాయ్ బేయాన్ N లైన్ వచ్చేసింది.. టర్బో పెట్రోల్‌తో పాటు హైబ్రిడ్ ఆప్షన్ కూడా!

డెంజా D9 ఇండియన్ లాంచ్‌కు రెడీ.. ధర ఎంతో తెలుసా?

కవాసకి వెర్సిస్ 900 వచ్చేసింది, భారత్‌లోకి ఎంట్రీ ఎప్పుడంటే?

భారత్‌ పై విన్‌ఫాస్ట్ ఫుల్ ఫోకస్.. తెలంగాణ, ఏపీలోనూ షోరూమ్‌లు!

కొత్త కలర్, సరికొత్త ఫీచర్లు.. MG విండ్సర్ EV కొత్త ఎడిషన్ వచ్చేసింది!

మహీంద్రా XUV 3XO CNG టీజర్ విడుదల.. అక్టోబర్ 15న ఆవిష్కరణ!

Big Stories

Advertisement
×