E-Paper
Advertisement

ఫోన్ వెనుక అతికించుకుంటే చాలు.. మాట్లాడిన ప్రతిమాటను నోట్స్‌గా మార్చే AI డివైజ్!

ఫోన్ వెనుక అతికించుకుంటే చాలు.. మాట్లాడిన ప్రతిమాటను నోట్స్‌గా మార్చే AI డివైజ్!
Advertisement

AI Note Takers: సాధారణంగా ఆఫీస్ మీటింగ్స్ అయిపోయిన తర్వాత ఏం మాట్లాడుకున్నామో గుర్తు తెచ్చుకుని నోట్స్ రాసుకోవడం చాలామందికి పెద్ద పనిగానే ఉంటుంది. ముఖ్యంగా వరుసగా మీటింగ్స్, ఇంటర్వ్యూలు ఉండే వారికి ఇది మరింత కష్టం. ఈ సమస్యకు ఏఐ సాయంతో పరిష్కారం చూపేందుకు ప్రముఖ ఏఐ డివైజ్ సంస్థ Plaud భారత్‌లోకి అడుగుపెట్టింది.

కంపెనీ తమ పాపులర్ డివైజెస్ Note Pro, NotePin Sలను దేశీయ మార్కెట్లో అధికారికంగా విడుదల చేసింది. Plaud Intelligence సాఫ్ట్‌వేర్ సాయంతో పనిచేసే ఇవి మన సంభాషణలను టెక్స్ట్‌గా మార్చడంతో పాటు ముఖ్యమైన అంశాలను సమ్మరీగా సిద్ధం చేస్తాయి.

ధరలు, ఎక్కడ లభిస్తాయంటే..

Advertisement

భారత్‌లో Plaud Note Pro ధర రూ.20,990గా నిర్ణయించారు. NotePin S ధర రూ.19,990గా ఉంది. NotePin S 64GB స్టోరేజ్‌తో బ్లాక్, సిల్వర్, పర్పుల్ రంగుల్లో లభిస్తుంది. Note Pro బ్లాక్, సిల్వర్ కలర్ ఆప్షన్లలో వస్తుంది. వీటిని అమెజాన్, బ్లింకిట్‌తో పాటు ప్లాడ్ అధికారిక వెబ్‌సైట్‌లో కొనుగోలు చేయవచ్చు.

Also Read: వెయిటింగ్ ఈజ్ ఓవర్. Nothing Buds Pro 2 కేస్ డిజైన్, బ్యాటరీ వివరాలు లీక్!

తెలుగుతో సహా 112కి పైగా భాషలు..

Advertisement

భారతీయ వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని ప్లాడ్ భాషల విషయంలోనూ మంచి సపోర్ట్ అందించింది. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, బెంగాలీ వంటి భారతీయ భాషలతో కలిపి మొత్తం 112కి పైగా భాషలను ఇవి సపోర్ట్ చేస్తాయి. రికార్డ్ చేసిన కంటెంట్‌ను మొబైల్, డెస్క్‌టాప్ యాప్స్ ద్వారా యాక్సెస్ చేయవచ్చు. డేటా భద్రత కోసం ISO, GDPR ప్రమాణాలను పాటిస్తున్నట్లు కంపెనీ తెలిపింది.

క్రెడిట్ కార్డ్ సైజులో Note Pro..

చూడటానికి క్రెడిట్ కార్డ్‌లా ఉండే Note Pro కేవలం 2.99 మిమీ మందం, 30 గ్రాముల బరువు కలిగి ఉంటుంది. మ్యాగ్నెటిక్ కేస్‌తో ఫోన్ వెనుక అమర్చుకోవచ్చు. రికార్డింగ్ స్టేటస్ కోసం కలర్ డిస్‌ప్లే, మెరుగైన ఆడియో కోసం నాలుగు మైక్రోఫోన్లు, నాయిస్ క్యాన్సిలేషన్ ఉన్నాయి. ఇందులో 500mAh బ్యాటరీ ఇచ్చారు.

NotePin S.. ఎక్కడైనా ధరించొచ్చు..

NotePin Sను మెడలో లాకెట్‌లా, చొక్కాకు క్లిప్‌లా, చేతికి వాచ్‌లా లేదా పిన్‌లా ధరించవచ్చు. కేవలం 17.4 గ్రాముల బరువున్న ఈ డివైజ్‌లో డిస్‌ప్లే లేకపోయినా LED లైట్ ద్వారా రికార్డింగ్ స్టేటస్ తెలుసుకోవచ్చు. ఇందులో 320mAh బ్యాటరీ ఉంది. ఆఫీస్ మీటింగ్స్, ఇంటర్వ్యూలు ఎక్కువగా నిర్వహించే వారికి.. మాట్లాడిన ప్రతి విషయాన్ని మళ్లీ వెతుక్కునే అవసరం లేకుండా నోట్స్‌గా మార్చుకునే ఈ డివైజెస్ ఎంతవరకు ఉపయోగపడతాయో చూడాలి.

Also Read: యాపిల్ మాస్టర్ ప్లాన్.. ఐఫోన్ కంటే ముందే మార్కెట్‌ను షేక్ చేయబోతున్న కొత్త డివైజ్!

Tags

Related News

డార్క్ మోడ్‌లో ఫోన్ వాడితే ఛార్జింగ్ సేవ్ అవుతుందా? తెలిస్తే షాక్ అవుతారు

ఫోన్ స్విచ్ ఆఫ్ ఉన్నా వాట్సాప్ మెసేజ్ వెళ్తుంది! వాట్సాప్ నుంచి మరో కిర్రాక్ అప్‌డేట్!

రూ.వెయ్యిలోపు బెస్ట్ ఇయర్‌బడ్స్! సేల్‌లో సగం ధరకే..

BSNL నుంచి మరో చౌకైన ప్లాన్.. రూ. 202 కే 32 రోజుల వ్యాలిడిటీ.. అదిరిపోయే బెనిఫిట్స్ మామ!

సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు ఎగిరి గంతేసే న్యూస్! ఇక నుంచి కోడింగ్,ఫైనాన్స్ పనులు చిటికెలో!

ఏఐ బాట్స్ డేంజర్ జోన్..శాస్త్రవేత్తల పరిశోధనలో షాకింగ్ నిజాలు!

జియో ఫైబర్ బంపర్ ఆఫర్..ఏడాది రీఛార్జ్‌పై 4 నెలలు ఫ్రీ ఇంటర్నెట్!

ఇదేందయ్యా ఇదీ..సేల్‌లో చిమ్నీల రేట్లు ఇంత తక్కువగా ఉన్నాయ్!

Big Stories

Advertisement
×