OTT Movie : టీనేజ్ వయసు వచ్చాక వారికి రకరకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఆ వయసులో వచ్చే ఫీలింగ్స్ ఎక్కువగా డిస్టర్బ్ చేస్తుంటాయి. కొంతమంది అయితే వీటిని ఫేస్ చేయలేక సూసైడ్ చేసుకోవడానికి కూడా వెనకాడరు. అందుకే ఆ సమయంలో పిల్లలకు మంచి గైడెన్స్ ఉండాలి. ఇప్పుడు మనం చెప్పుకునే మూవీలో హీరోయిన్ టీనేజ్ వయసులో ప్రేమ కోసం తపించిపోతుంది. ఆమె ఇష్టపడ్డ వ్యక్తి ఎవరూ కూడా తనతో డేటింగ్ కి ఇష్టపడరు. ఆ తర్వాత జరిగే సన్నివేశాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. ఈ రొమాంటిక్ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…
అమెజాన్ ప్రైమ్ మీడియా (Amazon prime video) లో
ఈ రొమాంటిక్ మూవీ పేరు ‘ది ఎడ్జ్ ఆఫ్ సెవెంటీన్’ (The edge of Seventeen). 2016 లో వచ్చిన ఈ రొమాంటిక్ కామిడీ మూవీకి కెల్లీ ఫ్రీమాన్ దర్శకత్వం వహించారు. ఈ మూవీలో హైలీ స్టెయిన్‌ఫెల్డ్, వుడీ హారెల్‌సన్, కైరా సెడ్‌విక్, హేలీ, రిచర్డ్‌సన్ నటించారు. STXfilms సమర్పణలో నవంబర్ 18, 2016న థియేటర్లలో ఈ మూవీ విడుదలైంది. స్టెయిన్‌ఫెల్డ్ పనితీరుకు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ మూవీ $9 మిలియన్ల బడ్జెట్‌తో $19.4 మిలియన్లకు పైగా వసూలు చేసింది. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ మీడియా (Amazon prime video) లో స్ట్రిమింగ్ అవుతోంది.
స్టోరీ లోకి వెళితే
హీరోయిన్ చిన్నప్పటినుంచి చాలా లోన్లీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఆ సమయంలోనే క్రిష్టన్ అనే అమ్మాయి హీరోయిన్ కి ఫ్రెండ్ అవుతుంది. చిన్నప్పటి నుంచి కాలేజీకి వెళ్లేంత వరకు వీళ్ళు మంచి ఫ్రెండ్స్ గానే ఉంటారు. ఒకరోజు తను సూసైడ్ చేసుకోవాలనుకుంటున్నానని టీచర్ తో చెప్తుంది హీరోయిన్ . దానికి గల కారణం కూడా వివరిస్తూ ఉంటుంది. ఫ్లాష్ బ్యాక్ లోకి స్టోరీ వెళుతుంది. హీరోయిన్ చూడటానికి అందంగా లేనని ఫీల్ అవుతూ ఉంటుంది. కాలేజీలో డారిన్ అనే అతన్ని ఇష్టపడుతుంది. అయితే అతడు మాత్రం హీరోయిన్ ఫ్రెండ్ ని ఇష్టపడతాడు. బెడ్రూంలో వాళ్ళిద్దరిని చూసి తట్టుకోలేక పోతుంది హీరోయిన్. నేను కావాలా, బాయ్ ఫ్రెండ్ కావాలా తేల్చుకోమని చెప్తుంది హీరోయిన్. అప్పుడు నాకు బాయ్ ఫ్రెండ్ కావాలని వెళ్ళిపోతుంది క్రిష్టన్. ఆ తర్వాత మరింత ఒంటరిగా అవుతుంది హీరోయిన్. ఎంత ప్రయత్నించినా ఒక అందమైన బాయ్ ఫ్రెండ్ ను పొందలేక పోతుంది.
హీరోయిన్ ను అదే కాలేజ్లో చదివే కిమ్ అనే వ్యక్తి ఇష్టపడతాడు. అతడు చూడటానికి యావరేజ్ గా ఉండటంతో అతన్ని సరిగ్గా పట్టించుకోదు హీరోయిన్. ఆ తర్వాత నిక్ అనే వ్యక్తిని ఇష్టపడుతుంది. అతనితో డేటింగ్ వెళ్దామని కూడా అడుగుతుంది. అతనితో కోరిక తీర్చుకోవడానికి అందంగా తయ్యారవుతుంది. అయితే అతడు మాత్రం ఆమెతో రొమాన్స్ చేసి వదిలేయాలనుకుంటాడు. వీళ్ళిద్దరూ కారులో ఉండగా రెచ్చిపోవడానికి ప్రయత్నిస్తాడు నిక్. హీరోయిన్ అతన్ని ఆపడానికి ట్రై చేస్తుంది. అప్పుడే అర్థమవుతుంది హీరోయిన్ కి, కేవలం పడక సుఖం కోసమే ఇతడు నా దగ్గరికి వచ్చాడని. ఈ విషయాలన్నీ టీచర్ తో చెప్పి ఏడుస్తుంది. చివరికి హీరోయిన్ పరిస్థితి ఏమవుతుంది? తాను కోరుకున్న జీవితం దొరుకుతుందా? లేకపోతే సూసైడ్ చేసుకుంటుందా? ఈ విషయాలన్నీ తెలుసుకోవాలనుకుంటే, ‘ది ఎడ్జ్ ఆఫ్ సెవెంటీన్’ (The edge of Seventeen) మూవీని చూడండి.