IND vs NZ Finals: ఛాంపియన్ ట్రోఫీ 2025.. టోర్నమెంట్ లో ( Champions Trophy 2025 ) భాగంగా ఇవాళ ఫైనల్ మ్యాచ్ జరగబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఫైనల్ మ్యాచ్ నేపథ్యంలో… న్యూజిలాండ్ వర్సెస్ టీమిండియా మధ్య మ్యాచ్ ( India vs New Zealand) జరగనుంది. దుబాయ్ లోని ( Dubai ) అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా… టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య మ్యాచ్ జరగబోతోంది. సెమీ ఫైనల్లో ఆస్ట్రేలియాను ఓడించి… ఫైనల్ కు టీమిండియా చేరుకుంది. అటు పాకిస్తాన్ లో సౌత్ ఆఫ్రికా ను ఓడించి ఫైనల్ కు దూసుకు వచ్చింది న్యూజిలాండ్. దీంతో ఈ రెండు జట్లు ఫైనల్ మ్యాచ్ లో ఇవాళ తలపడబోతున్నాయి.
Also Read: Memes on CT 2025 Final: టీమిండియా ఓడిపోవాలని కుట్రలు… అన్ని జట్లు ఏకమై ?
మ్యాచ్ టైమింగ్స్, ఉచితంగా ఎలా చూడాలి ?
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ లో ( Champions Trophy 2025 Final ) భాగంగా ఇవాళ జరిగే న్యూజిలాండ్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య మ్యాచ్… మధ్యాహ్నం రెండున్నర గంటలకు ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్ కు సంబంధించిన టాస్ ప్రక్రియ… మధ్యాహ్నం రెండు గంటలకు ఉంటుంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన జట్టు… బ్యాటింగ్ తీసుకుంటే బెటర్ అని అంటున్నారు క్రికెట్ విశ్లేషకులు. ఇక టీమ్ ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య మ్యాచ్… ఉచితంగానే చూడవచ్చు. జియో హాట్ స్టార్ వేదికగా… టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య మ్యాచ్ ఉచితంగానే చూడవచ్చు. జియో నెట్వర్క్ కలిగి ఉన్న వారందరికీ…. టీమ్ ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య ఫైనల్ మ్యాచ్ ఉచితంగా చూసే అవకాశం కల్పించారు. స్టార్ స్పోర్ట్స్ తో పాటు స్పోర్ట్స్ 18 లో కూడా ఈ మ్యాచ్ లు చూడవచ్చు.
విరాట్ కోహ్లీ డౌటే ?
ఇవాళ జరిగే న్యూజిలాండ్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య మ్యాచ్… కు విరాట్ కోహ్లీ దూరం అవుతాడని అంటున్నారు. నిన్న ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో విరాట్ కోహ్లీ మోకాలికి గాయం అయిందని ప్రచారం జరుగుతోంది. దీంతో… నిన్న కోహ్లీ ప్రాక్టీసే చేయలేదట. అయితే… విరాట్ కోహ్లీ గాయం పెద్దదేమీ కాదంటున్నారు కొందరు. మరి తుది జట్టులో విరాట్ కోహ్లీ ఉంటాడా ? లేదా ? అనేది చూడాలి.
Also Read: Virat Kohli Injury: తీవ్ర గాయం..టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ ఫైనల్ మ్యాచ్ కు కోహ్లీ దూరం !
IND vs NZ ప్లేయింగ్ XI అంచనా
టీమిండియా : రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, KL రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, మహమ్మద్ షమీ, వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్ సింగ్.
న్యూజిలాండ్ : విల్ యంగ్, డెవాన్ కాన్వే, కేన్ విలియమ్సన్ (కెప్టెన్), రాచిన్ రవీంద్ర, టామ్ లాథమ్ (వికెట్ కీపర్), గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్‌మన్, మిచెల్ సాంట్నర్, మైఖేల్ బ్రేస్‌వెల్, కైల్ జామిసన్, జాకబ్ డఫీ.