Prestige Kingfisher Towers : భారతదేశంలో పలు బ్యాంకుల నుంచి వేల కోట్ల రూపాయలు తీసుకొని చెల్లించకుండా పరారీ అయినా బిజినెస్ మెన్ విజయ్ మాల్యా ఇటీవల ఓ పాడ్ కాస్ట్ లో తన జీవితం గురించి వెల్లడించిన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా తాను దొంగను కాదని.. తాను తీసుకున్న అప్పుల కంటే రెండున్నర రెట్లు ఎక్కువగా తన ఆస్తుల నుంచి రికవరీ చేసారని చెప్పుకొచ్చారు. దీనికి ప్రధాన మంత్రి, కేంద్ర మంత్రి చెప్పినటువంటి విషయాలే సాక్ష్యమని తెలిపారు. ఎంటర్ ప్రెన్యూర్ రాజ్ షామానితో ఇటీవల జరిపిన పాడ్ కాస్ట్ లో విజయ్ మాల్యా సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా కర్ణాటక రాజధాని బెంగళూరులో ఉన్న కింగ్ ఫిషర్ టవర్స్ గురించి, దాని నిర్మాణం గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
Also Read : Vijay Mallya – RCB: కోహ్లీ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. విజయ్ మాల్యా చేతిలోకి మళ్ళీ RCB?
బెంగళూరు కబ్బన్ పార్కు పక్కన మరియు బెంగళూరు సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్ నడిబొడ్డున ఉన్న కింగ్ ఫిషర్ టవర్ పై ఉన్న తన ఐకానిక్ పెంట్ హౌస్ గురించి కీలక విషయాలను వెల్లడించారు. వాస్తవానికి అది ఒక బంగ్లా అని.. అక్కడ తన తండ్రి నివసించారని.. తాను పెరిగిన బంగ్లా అది అని తెలిపారు. కింగ్ ఫిషర్ టవర్స్ ప్రస్తుతం ఉన్న స్థలంలో ఆ బంగ్లా ఉండేదని మాల్యా గుర్తు చేసుకున్నారు. ఆ బంగ్లాను భారీ టవర్స్ గా మార్చాలని అనుకున్నట్టు చెప్పారు. ప్రెస్టీజ్ గ్రూపర్ చైర్మన్ ఇర్పాన్ రజాక్.. ఆ విలువైనటువంటి స్థలాన్ని ఓ లగ్జరీ నివాస ప్రాజెక్ట్ గా అభివృద్ధి చేయడానికి తనను సంప్రదించాడు. అందుకు ఓ ప్రతిపాదనను కూడా తీసుకొచ్చారని తెలిపారు విజయ్ మాల్యా. అయితే తన కుటుంబానికి చెందిన ఆ బంగ్లాను 34 అంతస్తుల కింగ్ ఫిషర్ టవర్స్ పై ఉంచగలిగితే తాను ఈ ప్రాజెక్ట్ కి అంగీకరిస్తానని ఇర్ఫాన్ రజాక్ తో చాలా సరదాగా, జోక్ గా చెప్పానని గుర్తు చేసుకున్నారు.
అయితే ఆ ప్రాజెక్ట్ కి ఇర్పాన్ రజాక్ అంగీకరించడంతో తాను ఆశ్చర్యపోయినట్టు వెల్లడించారు. తాను ఏ విధంగా అయితే అనుకున్నానో సరిగ్గా ఇర్ఫాన్ అలా చేశారని చెప్పుకొచ్చారు. నగరం నడిబొడ్డున ఉన్న ప్రముఖ స్థలంలో ఓ ప్రాపర్టీని డెవలప్ చేయడం ద్వారా కంపెనీ అవకాశాలు గణనీయంగా పెరుగుతాయని.. అందుకు కింగ్ ఫిషర్ టవర్స్ ప్రాజెక్ట్ తో ముందుకు వెళ్లాలనే నిర్ణయం బిజినెస్ ప్రయోజనాలతో ప్రారంభమైందని తెలిపారు. ప్రస్తుతం ఆ పెంట్ హౌస్ ఇంకా అసంపూర్తిగానే ఉందని వెల్లడించాడు. UBHL లిక్విడేషన్ ప్రక్రియలో చిక్కుకుందని తెలిపారు. ఈ UBHL న్యాయపరమైన అడ్డంకులను పరిస్కరించడానికి తాను చాలా కృషి చేస్తున్నానని వెల్లడించారు. కబ్బన్ పార్క్.. చిన్న స్వామి స్టేడియం పక్కనే ఉన్నాయి. ఈ భవనంతో సంబంధం ఉన్న వ్యక్తుల కారణంగా ఈ పెంట్ హౌస్ బెంగళూరు ఓ నిర్మాణ, రియల్ ఎస్టేట్ అద్భుతంగా మిగిలిపోయింది. విజయ్ మాల్యా ఆకాశ బంగ్లాతో పాటు.. కింగ్ ఫిషర్ టవర్స్ లో ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారయణమూర్తి, జెరోధా కి చెందిన నిఖిల్ కామత్ వంటి ఇతర ప్రముఖులు కూడా నివసిస్తున్నట్టు సమాచారం.
?igsh=MTN4ejlwb29zdWpkdQ==