Adibatla POCSO: ఆరేళ్ల చిన్నారిపై సవతి తండ్రి రోజుల తరబడిగా లైంగిక దాడులు చేసిన దారుణం వెలుగులోకి వచ్చింది. స్థానికంగా కలకలం సృష్టించిన ఈ సంఘటన ఆదిబట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి.
బాలాపూర్ నివాసి గులామ్ దురానీ అన్వర్ అనే వ్యక్తి కొంతకాలం క్రితం భర్త లేని ఓ మహిళను పెళ్లి చేసుకున్నాడు. అప్పటికే ఆమెకు ఆరో తరగతి చదువుతున్న కూతురు ఉంది. ఆ చిన్నారిపై కన్నేసిన గులామ్ దురానీ భార్య ఇంట్లో లేనపుడు అఘాయిత్యం జరిపాడు. విషయం బయటకు చెబితే మీ అమ్మను చంపేస్తా అని భయపెట్టాడు. దాంతో బాధితురాలు మౌనంగా ఉండిపోయింది.
ఇదే అదనుగా గులామ్ దురానీ ఆ బాలికపై లైంగిక దాడులు కొనసాగిస్తూ వచ్చాడు. రోజురోజుకు నరకం అధికం కావటంతో భరించలేకపోయిన బాధితురాలు తల్లికి విషయాన్ని చెప్పింది. ఈ క్రమంలో చిన్నారిపై గులామ్ దురానీ లైంగిక దాడి చేస్తుండగా ఆమె రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. అనంతరం కూతురితో కలిసి ఆదిబట్ల పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు నిందితునిపై పోక్సో యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేసిన పోలీసులు అతన్ని జైలుకు రిమాండ్ చేశారు.
Also Read: ఇజ్రాయెల్ ఎన్నికల ఫలితాలు విడుదల.. నో మెజారిటీ.. హంగ్ ఏర్పడే ముప్పు?