E-Paper
Advertisement

వెకేషన్ కోసం ఇళ్లు మార్చుకున్న జంటలు… చివరకు మర్డర్ మిస్టరీలో… గ్రిప్పింగ్ సైకలాజికల్ థ్రిల్లర్ సిరీస్

వెకేషన్ కోసం ఇళ్లు మార్చుకున్న జంటలు… చివరకు మర్డర్ మిస్టరీలో… గ్రిప్పింగ్ సైకలాజికల్ థ్రిల్లర్ సిరీస్
Advertisement

Psychological Crime Thriller OTT : వెకేషన్‌ కు వెళ్లినప్పుడు కొత్త ప్రదేశాలు చూడటం, లగ్జరీ ఇళ్లలో బస చేయడం చాలామందికి ఇష్టం. అందుకోసం కొందరు హోమ్ స్వాపింగ్ పద్ధతిని ఎంచుకుంటారు. అంటే కొంతకాలం పాటు తమ ఇళ్లను మరొకరికి ఇచ్చి, వాళ్ల ఇళ్లలో వీళ్లు ఉండటమన్నమాట. వినడానికి ఇదొక మంచి వెకేషన్ ప్లాన్‌లా అనిపించినా… ఆ ఇళ్లలోనే ఊహించని మర్డర్ బయటపడితే పరిస్థితి ఎలా ఉంటుంది ? ఇలాంటి డార్క్ కాన్సెప్ట్‌ తో తెరకెక్కిన స్వీడిష్ సైకలాజికల్ థ్రిల్లర్ సిరీస్ ‘ఎ కపుల్ ఆఫ్ లైస్’ (A Couple of Lies) ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చింది. ప్రముఖ రచయిత స్టెఫాన్ అన్హెమ్ (Stefan Ahnhem) నవల ఆధారంగా రూపొందిన ఈ నాలుగు ఎపిసోడ్ల సిరీస్ కథలోకి వెళ్దాం పదండి.

కథలోకి వెళ్తే…

సిసిలీ, స్టాక్‌ హోమ్ నగరాల నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. సంపన్న కుటుంబాలకు చెందిన రెండు జంటలు తమ రొటీన్ జీవితంలోని ఒత్తిళ్ల నుంచి బయటపడాలని, కాస్త విలాసవంతమైన వెకేషన్‌ ను ప్లాన్ చేసుకుంటారు. ఇందుకోసం హోమ్ స్వాప్ ఒప్పందం చేసుకుంటారు. దీంతో ఒక జంట సిసిలీలోని అందమైన విల్లాకు వెళ్లగా, మరో జంట స్టాక్‌ హోమ్‌ లోని ఇంటికి చేరుకుంటుంది. మొదట్లో ఇదంతా ఓ సాధారణ వెకేషన్‌ లాగే కనిపిస్తుంది. కానీ కొత్త ఇళ్లలోకి వెళ్లిన తర్వాత వారికి ఎదురయ్యే అనుభవాలు కథను పూర్తిగా మార్చేస్తాయి. ఆ ఇళ్లలో ఏవో తెలియని రహస్యాలు దాగి ఉన్నట్లు ఒక్కొక్కటిగా అనుమానాలు మొదలవుతాయి.

Advertisement

రహస్యంగా అమర్చిన కెమెరాలు, ఒకరి కదలికలను మరొకరు గమనించడం, బయట పడుతున్న సీక్రెట్ ఎఫైర్స్… ఇలా ఒక్కో విషయం వెలుగులోకి వస్తుంది. దీంతో ప్రశాంతంగా గడపాల్సిన సెలవులు కాస్తా భయంకరమైన అనుభవంగా మారిపోతాయి. ఇక్కడి నుంచి అసలుసిసలు మైండ్ గేమ్ మొదలవుతుంది. తమ వ్యక్తిగత జీవితాల్లోని రహస్యాలు బయట పడకుండా ఉండేందుకు ఆ జంటలు ఒకరిపై ఒకరు అబద్ధాలు చెబుతుంటారు. ఓ అబద్ధాన్ని దాచేందుకు మరో అబద్ధం చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. చివరకు తమను తాము కాపాడుకోవాలనే ప్రయత్నంలో హద్దులు దాటి ప్రమాదకరమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఈ వ్యవహారం క్రమంగా హత్యల వరకు వెళ్తుంది. అసలు ఆ ఇళ్లలో కెమెరాలు ఎవరు ఏర్పాటు చేశారు ? రెండు జంటల మధ్య ఉన్న సంబంధాల వెనుక దాగిన నిజాలేంటి ? తమ రహస్యాలను కాపాడుకునేందుకు వాళ్లు ఎంత దూరం వెళ్లారన్నదే మిగతా కథ.

Also Read : ఒకే నగరంలో ఇద్దరు సీరియల్ కిల్లర్లు… పోలీసులకే చుక్కలు చూపించే కొత్త సైకో… కిరాక్ క్లైమాక్స్

ఏ ఓటీటీలో చూడొచ్చు?

Advertisement

ఈ సిరీస్‌లో ఫారెజ్ ఫారెజ్ (Fares Fares), ఫ్రిదా గుస్తావ్సన్ (Frida Gustavsson), ఎమ్మా యాపిల్టన్ (Emma Appleton)తో పాటు జాకబ్ ఆఫ్టెబ్రో (Jakob Oftebro) కూడా కీలక పాత్రల్లో నటించారు. కాస్పర్ బార్ఫోడ్ (Kasper Barfoed) దర్శకత్వం వహించగా, స్టెఫాన్ అన్హెమ్ (Stefan Ahnhem) రాసిన నవల ఆధారంగా కథను రూపొందించారు. ‘ఎ కపుల్ ఆఫ్ లైస్’ ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ (Netflix)లో స్వీడిష్, ఇంగ్లీష్ ఆడియోల్లో స్ట్రీమింగ్ అవుతోంది. నాలుగు ఎపిసోడ్లతో ఉండటంతో ఒకే సిట్టింగ్‌లో పూర్తి చేయొచ్చు.

Tags

Related News

ఒకే నగరంలో ఇద్దరు సీరియల్ కిల్లర్లు… పోలీసులకే చుక్కలు చూపించే కొత్త సైకో… కిరాక్ క్లైమాక్స్

జూన్‌లో మగవాళ్లకు మృత్యుగండం… ఏడేళ్లకోసారి తిరగబెట్టే శాపం… ఈ తమిళ క్రైమ్ థ్రిల్లర్‌ ను ఇంకా చూడలేదా ?

మాస్క్‌లు వేసుకుని ప్రాణాలు తీసే కిల్లర్లు… ఈసారి తాడోపేడో తేల్చుకోవాల్సిందే… ఇంటెన్స్ సైకో థ్రిల్లర్

గంటకు 50 రెట్లు జీతం ఇస్తామంటూ జాబ్ ఆఫర్… ఒక్కో షిఫ్ట్‌లో ఊచకోత… క్రేజీ కొరియన్ హారర్ థ్రిల్లర్‌ తెలుగులో

పద్ధతిగా జరిగే పిల్లల బర్త్ డే పార్టీ… పెద్దల మధ్య చిచ్చుపెట్టే బహుమతి… ఈ రచ్చ తెలుగులోనూ స్ట్రీమింగ్

వామ్మో… పోలీసులే దొంగలు భయ్యా… దిమ్మతిరిగే హీస్ట్ థ్రిల్లర్

గ్యాంగ్‌స్టర్లుగా కీర్తి సురేష్, రాధికా ఆప్టే… తెలుగులోనూ డార్క్ గ్యాంగ్‌స్టర్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ షురూ

Big Stories

Advertisement
×