Diwali Special Series OTT : ఫ్యామిలీ డ్రామాలు, పెళ్లి హడావుడి బ్యాక్‌డ్రాప్ లో వచ్చే సిరీస్ లకు ఎప్పుడూ ఒక క్రేజీ డిమాండ్ ఉంటుంది. అందులోనూ నెట్‌ఫ్లిక్స్ లో పాపులర్ అయిన ‘హౌ టు రూయిన్ క్రిస్మస్’ (How to Ruin Christmas) ఫ్రాంచైజీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పుడు అదే ‘హౌ టు రూయిన్’ ఫ్రాంచైజీ నుంచి సరికొత్త పండగ ఎడిషన్ మన ముందుకు వచ్చింది. అదే ‘హౌ టు రూయిన్ దీపావళి’ (How to Ruin Diwali). అక్టోబర్ 30న నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజైన ఈ సిరీస్‌లో దీపావళి వేడుకలతో పాటు రెండు కుటుంబాల మధ్య జరిగే గొడవలు, రహస్యాలు, కామెడీ ప్రేక్షకులను అలరిస్తాయి. మరి ఈ కామెడీ సిరీస్ కథ ఏంటో తెలుసుకుందాం పదండి.
ఈ స్టోరీ అంతా ఒక భారతీయ వైద్యుల కుటుంబం, దక్షిణాఫ్రికాకు చెందిన జూలూ కుటుంబం చుట్టూ తిరుగుతుంది. మబాథో అనే యువతి తనకు కాబోయే భర్త వర్షెన్ కుటుంబాన్ని మొదటిసారి కలుసుకోవడానికి వస్తుంది. అక్కడ దీపావళి పండగతో పాటు పెళ్లి వేడుకలు కూడా గ్రాండ్ గా ప్లాన్ చేస్తారు. అయితే కుటుంబ సభ్యులందరితో మంచిగా కలిసిపోవాలని, అందరి మనసులు గెలుచుకోవాలని మబాథో ప్రయత్నిస్తుంది. కానీ ఆమె అనుకున్నదొకటి… అక్కడ జరిగేది మరొకటి. ఈ క్రమంలో కాబోయే మామగారికి సంబంధించిన ఒక రహస్య లవ్ అఫైర్ అనుకోకుండా ఆమెకు తెలిసిపోతుంది. ఆ విషయాన్ని బయట పెట్టడంతో కుటుంబంలో ఒక్కసారిగా కలకలం మొదలవుతుంది.
అప్పటివరకు పండగ మూడ్ లో ఉన్న ఇల్లు కాస్తా గొడవలకు అడ్డాగా మారిపోతుంది. చివరకు దీపావళి వేడుకలనే క్యాన్సిల్ చేసే పరిస్థితి వస్తుంది. దీంతో మబాథో తన వల్లే చెడిపోయిన పరిస్థితులను చక్కదిద్దేందుకు ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలో ఆమె తల్లిదండ్రులు కూడా తమ ప్లాన్ తో రంగంలోకి దిగుతారు. మరి రెండు కుటుంబాల మధ్య గొడవలు ఎలా సద్దుమణిగాయి ? మబాథో తన కాబోయే భర్త కుటుంబంతో మళ్లీ ఎలా కలిసిపోయింది ? చివరకు దీపావళి వేడుకలు జరిగాయా లేదా ? అనేదే ఈ సిరీస్ కథ.
Also Read : ఒకే నగరంలో ఇద్దరు సీరియల్ కిల్లర్లు… పోలీసులకే చుక్కలు చూపించే కొత్త సైకో… కిరాక్ క్లైమాక్స్
ఈ కామెడీ సిరీస్ ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ (Netflix) ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. మొత్తం మూడు ఎపిసోడ్‌లు ఉన్నాయి. ఒరిజినల్ ఇంగ్లీష్‌తో పాటు హిందీ ఆడియోలోనూ అందుబాటులో ఉంది. పండగ నేపథ్యంలో సాగే ఫ్యామిలీ కామెడీని చూడాలనుకునేవారు ఈ సిరీస్‌ను ఒకసారి ట్రై చేయొచ్చు. ఈ సిరీస్‌లోని కామెడీ టైమింగ్, క్యారెక్టర్స్ ప్రేక్షకులను నవ్విస్తాయి. మనకు తెలిసిన భారతీయ కుటుంబ సంప్రదాయాలు, దక్షిణాఫ్రికా జూలూ కుటుంబ ఆచారాలు, రెండు కుటుంబాల మధ్య ఉండే పట్టింపులు, ఈగోలు, పండగ హడావుడిని కామెడీగా చూపించారు.