E-Paper
Advertisement

మాస్క్‌లు వేసుకుని ప్రాణాలు తీసే కిల్లర్లు… ఈసారి తాడోపేడో తేల్చుకోవాల్సిందే… ఇంటెన్స్ సైకో థ్రిల్లర్

మాస్క్‌లు వేసుకుని ప్రాణాలు తీసే కిల్లర్లు… ఈసారి తాడోపేడో తేల్చుకోవాల్సిందే… ఇంటెన్స్ సైకో థ్రిల్లర్
Advertisement

Horror Thriller on OTT : హారర్ సినిమాల్లో మాస్క్‌లు వేసుకుని అమాయకులపై దాడి చేసే కిల్లర్లను చూస్తేనే ఒళ్లు గగుర్పొడుస్తుంది. అలాంటిది ఎక్కడ చూసినా వాళ్లే కనిపిస్తూ, ఎప్పుడు ఎటు నుంచి వచ్చి దాడి చేస్తారో తెలియని పరిస్థితి ఎదురైతే… ‘ది స్ట్రేంజర్స్’ (The Strangers) ఫ్రాంచైజీ గురించి తెలిసిన వారికి ఈ భయం కొత్తేమీ కాదు. ముఖాలు కనిపించకుండా వింత మాస్క్‌లు ధరించి, కనికరం లేకుండా హత్యలు చేసే ఆ కిల్లర్లు మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సిరీస్‌లో మూడో భాగంగా వచ్చిన ‘ది స్ట్రేంజర్స్: చాప్టర్ 3’ (The Strangers Chapter 3) మరింత క్రూరమైన సర్వైవల్ ఎలిమెంట్స్ తో ఆకట్టుకుంటోంది. మరి ఈ సినిమాను ఏ ఓటీటీలో చూడవచ్చు ? తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే…

గత రెండు భాగాల్లో జరిగిన దాడుల నుంచి ప్రాణాలతో బయట పడిన మాయ కథ ఇక్కడి నుంచి కొనసాగుతుంది. రెండో భాగం చివర్లో పిన్ – అప్ గర్ల్ ను చంపిన మాయ, స్కేర్‌క్రో తన ఫ్రెండ్ మృతదేహం దగ్గర ఏడవడం చూస్తుంది. దీంతో ఈ కిల్లర్లు కలిసి హత్యలు చేసే వ్యక్తులు మాత్రమే కాదని, వాళ్ల మధ్య కూడా బలమైన అనుబంధాలు ఉన్నాయని ఆమెకు అర్థమవుతుంది. అయినా అక్కడి నుంచి తప్పించుకుని ప్రాణాలు కాపాడుకోవాలనే ప్రయత్నం చేస్తుంది. ఓ చర్చిలో తలదాచుకున్న మాయకు స్కేర్‌ క్రో ఎదురవుతాడు. ఆ తర్వాత పోలీస్ షెరీఫ్ రాటర్ దగ్గర నుంచి తప్పించుకోవడానికి అతడి వాహనాన్ని తీసుకుని పారిపోతుంది. కానీ దారిలో ప్రమాదానికి గురవుతుంది. ఇదే అదనుగా భావించిన స్కేర్‌ క్రో, డాల్‌ ఫేస్ ఆమెను పట్టుకుని తమ రహస్య స్థావరానికి తీసుకెళ్తారు.

Advertisement

అక్కడ మాయకు అసలు నరకం మొదలవుతుంది. పిన్-అప్ గర్ల్ స్థానాన్ని భర్తీ చేయాలని భావించిన స్కేర్‌ క్రో, ఆమె ముఖానికి ఉండే మాస్క్‌ ను మాయకు వేయించి తమ గ్యాంగ్‌ లో ఒకరిగా మార్చాలని ప్రయత్నిస్తాడు. అంతేకాదు కిల్లర్ల గతానికి సంబంధించిన ఫ్లాష్‌ బ్యాక్‌ ల ద్వారా వాళ్ల మధ్య ఉన్న సంబంధాలు, చిన్నప్పటి నుంచి పెరిగిన హింసాత్మక స్వభావం, షెరీఫ్ రాటర్‌ తో ఉన్న రహస్య బంధం బయటపడతాయి. తన కొడుకు గ్రెగరీ చేసిన హత్యలను కప్పిపుచ్చుతూ షెరీఫ్ అతడికి సహాయం చేస్తుంటాడనే విషయం కూడా తెలుస్తుంది.

ఇదిలా ఉంటే, మాయ కనిపించకపోవడంతో ఆమె సోదరి డెబ్బీ, ఆమె భర్త హోవార్డ్ ఆమె కోసం వెనస్ పట్టణానికి వస్తారు. కానీ వాళ్లు కూడా కిల్లర్ల వలలో చిక్కుకుంటారు. తన కళ్ల ముందే కుటుంబ సభ్యులపై దాడులు జరగడంతో మాయలో భయం క్రమంగా కోపంగా మారుతుంది. చివరకు తప్పించుకునే ప్రయత్నం మాత్రమే కాకుండా, తనను వెంటాడుతున్న వాళ్లను అంతం చేయాలని నిర్ణయించుకుంటుంది. మరి స్కేర్‌ క్రో వెనుక ఉన్న అసలు వ్యక్తి ఎవరు ? మాయ తన సోదరిని కాపాడుకోగలిగిందా ? షెరీఫ్ రాటర్‌ కు కిల్లర్లతో ఉన్న సంబంధం ఎలా బయటపడింది ? ఇంతకాలం అందరినీ భయపెట్టిన మాస్క్ గ్యాంగ్‌ కు మాయ ఎలా ఎదురు తిరిగింది ? చివరికి ఈ భయంకరమైన వేటకు ముగింపు ఎలా పలికిందనేదే క్లైమాక్స్.

Advertisement

Also Read : పద్ధతిగా జరిగే పిల్లల బర్త్ డే పార్టీ… పెద్దల మధ్య చిచ్చుపెట్టే బహుమతి… ఈ రచ్చ తెలుగులోనూ స్ట్రీమింగ్

తెలుగులోనూ స్ట్రీమింగ్

‘ది స్ట్రేంజర్స్ చాప్టర్ 3’ అక్టోబర్ 30 నుంచి లయన్స్‌ గేట్ ప్లే (Lionsgate Play)లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇంగ్లీష్‌తో పాటు తెలుగు, తమిళం, హిందీ భాషల్లోనూ అందుబాటులో ఉంది. మాయ పాత్రలో మడెలైన్ పెట్ష్ (Madelaine Petsch), గ్రెగరీగా గాబ్రియేల్ బాసో (Gabriel Basso), షెల్లీగా ఈమా హోర్వత్ (Ema Horvath), షెరీఫ్ రాటర్‌గా రిచర్డ్ బ్రేక్ (Richard Brake) నటించారు. ఈ చిత్రానికి రెన్నీ హార్లిన్ (Renny Harlin) దర్శకత్వం వహించారు. మాస్క్ కిల్లర్లు, రక్తపాతం, ఉత్కంఠభరితమైన ఛేజింగ్‌ లు, చివరి వరకు టెన్షన్ కలిగించే హారర్ సినిమాలు ఇష్టపడే వారికి ఈ మూవీ నచ్చవచ్చు. ముఖ్యంగా ‘ది స్ట్రేంజర్స్’ గత భాగాలు చూసినవారు ఈ మూడో భాగాన్ని కూడా ఓసారి ట్రై చేయొచ్చు.

Related News

ఒకే నగరంలో ఇద్దరు సీరియల్ కిల్లర్లు… పోలీసులకే చుక్కలు చూపించే కొత్త సైకో… కిరాక్ క్లైమాక్స్

జూన్‌లో మగవాళ్లకు మృత్యుగండం… ఏడేళ్లకోసారి తిరగబెట్టే శాపం… ఈ తమిళ క్రైమ్ థ్రిల్లర్‌ ను ఇంకా చూడలేదా ?

గంటకు 50 రెట్లు జీతం ఇస్తామంటూ జాబ్ ఆఫర్… ఒక్కో షిఫ్ట్‌లో ఊచకోత… క్రేజీ కొరియన్ హారర్ థ్రిల్లర్‌ తెలుగులో

పద్ధతిగా జరిగే పిల్లల బర్త్ డే పార్టీ… పెద్దల మధ్య చిచ్చుపెట్టే బహుమతి… ఈ రచ్చ తెలుగులోనూ స్ట్రీమింగ్

వామ్మో… పోలీసులే దొంగలు భయ్యా… దిమ్మతిరిగే హీస్ట్ థ్రిల్లర్

గ్యాంగ్‌స్టర్లుగా కీర్తి సురేష్, రాధికా ఆప్టే… తెలుగులోనూ డార్క్ గ్యాంగ్‌స్టర్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ షురూ

తాగుడు అలవాటుతో ఊరంతా రచ్చ… తండ్రీకొడుకుల మధ్య జరిగే ఈ గోల చూస్తే నవ్వు ఆగదు

Big Stories

Advertisement
×