OTT Movie : గిఫ్ట్స్ ఇచ్చి పుచ్చుకోవడం అన్నది ప్రేమకు లేదా స్నేహానికి నిదర్శనం. అయితే సాధారణంగా బాగా ఇష్టమైన వాళ్లే ఇలా సర్ప్రైజ్ లతో ఆశ్చర్యపరుస్తూ ఉంటారు. కానీ ఎవరో అజ్ఞాత వ్యక్తి ఇలాంటి గిఫ్ట్స్ పంపిస్తే, అక్కడే మొదలవుతుంది అసలు కథ. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీ లైన్ తో తెరకెక్కిన అదిరిపోయే క్రైమ్ థ్రిల్లర్ ఈరోజు మన మూవీ సజెషన్. ఈ మూవీ ఏ ఓటీటీలో ఉందంటే?
నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్
ఈ అమెరికన్ సైకలాజికల్ థ్రిల్లర్ సినిమా పేరు ‘The Gift’. 2015లో విడుదలైన ఈ మూవీ లాస్ ఏంజిల్స్‌లో కొత్త జీవితాన్ని ప్రారంభించిన ఒక జంటను ఊహించని బహుమతులు ఇస్తూ భయపెట్టే అజ్ఞాత వ్యక్తి కథ. ఊహించని ట్విస్ట్‌లతో ఆకట్టుకునే ఈ మూవీ షాకింగ్ ఎండింగ్ తో థ్రిల్లర్ ప్రియులకు మంచి థ్రిల్ ఇస్తుంది. ఈ మూవీ ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ (Netflix) ఓటీటీలో అందుబాటులో ఉంది.
కథలోకి వెళ్తే…
సైమన్ (జాసన్ బేట్‌మన్), రాబిన్ (రెబెక్కా హాల్) సంతోషంగా ఉండే దంపతులు. రాబిన్ గర్భస్రావం వీళ్ళను డిప్రెషన్ లో పడేస్తుంది. అందుకే దాని నుంచి బయటపడి, కొత్త జీవితం స్టార్ట్ చేయడం కోసం చికాగో నుండి లాస్ ఏంజిల్స్‌లోని సైమన్ స్వస్థలానికి మారతారు. సైమన్ ఒక సెక్యూరిటీ కంపెనీలో కొత్త ఉద్యోగం తెచ్చుకుంటాడు. అలాగే వాళ్ళు ఒక స్టైలిష్ ఇంటిని కొంటారు.
ఒక రోజు షాపింగ్‌లో సైమన్‌కు గోర్డో (జోయెల్ ఎడ్గర్టన్) అనే హైస్కూల్ స్నేహితుడు ఎదురవుతాడు. కానీ సైమన్ అతన్ని గుర్తుపట్టడు. గోర్డో “వీర్డో” అని పిలుచుకునే సిగ్గుపడే వ్యక్తి. వీళ్ళ ఇంటికి వైన్ బాటిల్, కాస్ట్లీ చేపలు వంటి బహుమతులు పంపుతూ, ఊహించని సమయంలో వస్తాడు. సైమన్ అతని ప్రవర్తనను అనుమానిస్తాడు. కానీ రాబిన్ గోర్డో పట్ల సానుభూతి చూపుతుంది. గోర్డో వాళ్ళను తన ఇంటికి డిన్నర్‌కు ఆహ్వానిస్తాడు. అక్కడ అతని జీవితం గురించి అబద్ధం చెప్పినట్లు తెలుస్తుంది.
Read Also : మోటివేషనల్ స్పీకర్ నుంచి పాస్టర్ అవతారం… ఇదేందయ్యా ఇదీ
సైమన్ అతనితో సంబంధం తెంచుకోమని చెప్పగా, గోర్డో ఒక లేఖలో “గతాన్ని మరచిపో” అని రాస్తాడు. మరోవైపు ఇదంతా జరుగుతుండగానే, కుక్క మిస్ అవ్వడం, చేపలు చనిపోవడం వంటివి జరుగుతాయి. రాబిన్ ఇంట్లోకి ఎవరో చూస్తున్నట్లు భయపడుతుంది. ఇక రాబిన్ గర్భవతి అవుతుంది. కానీ అంతలోనే ఓ సమస్య వల్ల సైమన్ ఉద్యోగం కోల్పోతాడు. క్లైమాక్స్‌లో గోర్డో మూడు బహుమతులు పంపుతాడు: వారి ఇంటి కీ, సైమన్ గోర్డోను అవమానించిన ఆడియో, రాబిన్ కు డ్రగ్ ఇచ్చి, మంకీ మాస్క్ ధరించి ఆమెపై దాడి చేసినట్లు ఉన్న వీడియో. ఇంతకీ ఈ గోర్డో ఎవరు? సైమన్ గతంలో చేసిన తప్పేంటి? చివరికి హీరోయిన్ అతని నుంచి తప్పించుకుని బ్రతికిందా లేదా ? అనేది తెరపై చూసి తెలుసుకోవాల్సిందే.