Kayadu Lohar in Nani The Paradise Movie: నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ తెరకెక్కుతోన్న చిత్రం ‘ది ప్యారడైజ్’. దసరా వంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత వీరిద్దరి కాంబో వస్తోన్న చిత్రమిది. దీంతో ఈ మూవీ భారీ అంచనాలు నెలకొన్నాయి. కేవలం అనౌన్స్మెంట్ వీడియోతోనే ఈ మూవీ విపరీతమైన బజ్ పెంచింది. ఇందులో నాని లుక్ అందరి అటెన్షన్ ని క్యాచ్ చేసింది. రెండు జడలు, ఒళ్లంత రక్తం ఇంటెన్స్ లుక్ ఆసక్తిని పెంచుతోంది. మూవీ గ్లింప్స్ చూస్తే శ్రీకాంత్ ఓదెల మూవీని గట్టిగానే ప్లాన్ చేశాడనిపిస్తోంది. ఇప్పటికే యాక్షన్ తో చెలరేగిపోతున్న నాని.. ది ప్యారడైజ్ లోనూ భారీ యాక్షన్ చేయబోతున్నాడని అర్థమైపోతుంది. ఇక ఈ సినిమా అప్డేట్స్ కూడా మూవీపై అంచనాలు పెంచేస్తున్నాయి.
ది ప్యారడైజ్ లో వేశ్యగా హీరోియిన్
ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం నుంచి తాజాగా ఓ షాకింగ్ అప్డేట్ బయటకు వచ్చింది. ది ప్యారడైజ్ కి సంబంధించి ఎన్నో అప్డేట్స్ వస్తున్నాయి. కానీ, హీరోయిన్ ఎవరనేది మాత్రం చెప్పడం లేదు. తాజాగా ఈ చిత్రంలో నాని సరసన నటించేది ఎవరో ఓ లీక్ బయటకు వచ్చింది. ప్రస్తుతం సౌత్ లో సెన్సేషన్ గా మారిన నటి, ఒక్క సినిమాతో తెలుగు, తమిళంలో ఓవర్ నైట్ స్టార్ గా మారిన ఓ తమిళ యంగ్ బ్యూటీ ఇందులో హీరోయిన్ గా ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. హీరోయిన్ మాత్రమే కాదు ఇందులో ఆమె బోల్డ్ రోల్ అని టాక్. తెలుగులో ఆమెకు ఇది తొలి సినిమానే. కానీ, ఆమె ఈ పాత్రను సెలక్ట్ చేసుకోవడంతో ఇండస్ట్రీ వర్గాలు షాక్ అవుతున్నాయి. ఆమె మరెవరో కాదు డ్రాగన్ బ్యూటీ కాయదు లోహర్.
నాని సరసన డ్రాగన్ బ్యూటీ
లవ్ టుడే ఫేమ్ ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించిన డ్రాగన్ తో కాయదు హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది. తెలుగు, తమిళంలో విడుదలైన ఈ చిత్రంతో ఆమె టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఇందులో ఆమె అందం, అభినయానికి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఈ చిత్రం కూడా మంచి విజయం సాధించడంతో ఆమె తెలుగు, తమిళంలో ఆమె ఫుల్ క్రేజీ సంపాదించుకుంది. తొలి సినిమానే భారీ విజయం సాధించడంతో ఓవర్ నైట్ స్టార్ అయిపోతుంది. దీంతో ఆమె అవకాశాలు కూడా క్యూ కడుతున్నాయి. ఈ క్రమంలో కాయదుకు నాని ది ప్యారడైజ్ లో హీరోయిన్ ఆఫర్ వరించింది. దర్శకుడు ఆమెకు పాత్ర వివరించకుండ ఆమె వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. అయితే ఇందులో హీరోయిన్ ది వేశ్య పాత్ర అని సమాచారం. దానికి కాయదు ఒకే చెప్పడం ఇప్పుడు అందరిని షాక్ గురి చేస్తోంది. కెరీర్ బిగినింగ్ లోనే ఈ భామ ఇంత పెద్ద రిస్క్ చేస్తుందని అంతా గుసగుసలాడుకుంటున్నారట.
రిస్క్ చేస్తోన్న కాయదు
కాగా నాని లాంటి స్టార్ హీరో సరసన హీరోయిన్ గా ఛాన్స్ రావడమంటే చిన్న విషయం కాదు. ఇది ఆమెకు భారీ ఆఫర్ అయినప్పుటికి ఇప్పుడిప్పుడే హీరోయిన్ అవకాశాలు అందుకుంటున్న ఆమె వేశ్య పాత్ర చేయడమంటే సాహసమే అనాలి. నాని సినిమా అంటే అందులో ప్రధాన పాత్రలకు ఏదోక ప్రత్యకత ఉంటుంది. తొలి సినిమాతోనే పాన్ ఇండియా హిట్ కొట్టిన శ్రీకాంత్ ఓదెల.. తన సినిమాలోని లీడ్ రోల్స్ విభిన్నంగా ఉంటాయి. దసరా కీర్తి సురేష్ ను డీ గ్లామర్ గా, అంగన్వాడీ టీచర్ గా చూపించాడు. ఇప్పుడు ది ప్యారడైజ్ లో హీరోయిన్ ని వేశ్యగా చూపించబోతున్నాడు. అంటే ఈ రోల్ సినిమాకి కీలకమై ఉంటుందని నాని ఫ్యాన్స్ నమ్ముతున్నారు. అందుకే కాయదు ఈ పాత్రని ఒకే చేసిందని ఆమె అంటున్నారు. మరి ఈ పాత్ర కాయదు లోహర్ కెరీర్ ఎంత ప్లస్ అవుతుందో చూడాలి. అయితే దీనిపై మూవీ టీం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.