OTT Movie : సైకో కిల్లర్ లు చాలా రకాలుగా ఉంటారు. వాళ్లు ఎప్పుడు ఏం చేస్తారు అనేది తెలుసుకోవడం చాలా కష్టం. మానసికంగా, శారీరకంగా హింసించే ఈ సైకోలు, మనుషుల ప్రాణాలను కూడా తీస్తూ ఉంటారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే హాలీవుడ్ మూవీలో ఒక సైకో పేషెంట్లను చంపుతూ ఉంటాడు. ఇది నిజంగా జరిగిన ఒక సంఘటన ఆధారంగా తెరకెక్కించారు. రికార్డుల ప్రకారం 29 మందిని చూపించారు కానీ, 400 పైగానే ఈ సైకో చంపినట్లు చెప్తారు. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…
నెట్ఫ్లిక్స్ (Netflix) లో
మీ హాలీవుడ్ సైకో థ్రిల్లర్ మూవీ పేరు ‘ది గుడ్ నర్స్’ (The good nurse). 2022 లో వచ్చిన ఈ అమెరికన్ థ్రిల్లర్ సైకో మూవీకి టోబియాస్ లిండ్‌హోమ్ దర్శకత్వం వహించారు. ఈ మూవీలో నమ్డి అసోముఘ, కిమ్ డికెన్స్, నోహ్ ఎమెరిచ్ నటించారు. ఈ మూవీ విమర్శకుల నుండి ప్రశంసలు అందుకుంది. గోల్డెన్ గ్లోబ్ అవార్డ్, బ్రిటీష్ అకాడమీ ఫిల్మ్ అవార్డ్, స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్ అవార్డుకు నామినేట్ అయిన రెడ్‌మైన్ నటనకు ప్రశంసలు లభించాయి. ఈ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ నెట్ఫ్లిక్స్ (Netflix) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీ లోకి వెళితే
హీరోయిన్ ఒక హాస్పిటల్లో నర్సుగా పనిచేస్తుంది. ఆ హాస్పిటల్లో ఒక వృద్ధురాలు అనారోగ్యంతో జాయిన్ అవుతుంది. పగలు హీరోయిన్ ఆమెను బాగానే చూసుకుంటుంది. రాత్రి ఆ వృద్ధురాలిని చూసుకోవడానికి చార్లీ అనే మేల్ నర్సిని అపాయింట్ చేస్తారు హాస్పిటల్ మేనేజ్మెంట్. వీళ్ళిద్దరూ ఒకరికి ఒకరు హెల్ప్ చేసుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే హీరోయిన్ హార్ట్ ప్రాబ్లమ్ తో ఒకసారి కళ్ళు తిరిగి పడిపోతుంది. చార్లీ ఆమెకు ఆ సమయంలో హెల్ప్ చేస్తాడు. ఆ మరుసటి రోజు ఆ వృద్ధురాలు చనిపోయి ఉంటుంది. ఆమె మృతి అనుమానస్పదంగా ఉందని, డిటెక్టివ్ అక్కడికి వస్తాడు. హీరోయిన్ ఆ వృద్ధురాలికి డోస్ ఎక్కువగా ఇవ్వడం వల్లే చనిపోయిందని తెలుసుకుంటుంది. హాస్పిటల్ మేనేజ్మెంట్ కి కూడా ఈ విషయం తెలుస్తుంది. అయితే హాస్పిటల్ పరువు పోతుందని, నిజాలు దాస్తుంది మేనేజ్మెంట్. ఆ తర్వాత కొద్ది రోజులకే మరొక పేషెంట్ చనిపోతుంది. చార్లీ మీద అనుమానంతో, ఇద్దరికీ కామన్ గా ఉండే ఒక ఫ్రెండ్ ని చార్లీ గురించి అడిగి తెలుసుకుంటుంది.
చార్లీ ఏ హాస్పిటల్లో ఉంటే అక్కడ చాలామంది చనిపోయారని ఆమె హీరోయిన్ కి చెబుతుంది. అప్పుడు హీరోయిన్ అతడు చేసే పనులను అబ్జర్వ్ చేస్తుంది. పేషంట్ కి సెలైన్లో ఇన్సులిన్ ఎక్కువ ఇస్తూ ఉంటాడు చార్లీ. సెలైన్ కి ఒక హోల్ కూడా పడి ఉంటుంది. ఆ తర్వాత ఈ విషయం పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తుంది హీరోయిన్. పోలీసులదగ్గర ఆ సైకో తప్పు చేశానని ఒప్పుకోడు. ఆ తర్వాత హీరోయిన్ అక్కడికి వచ్చి నిజాలు చెప్పిస్తుంది. అతడే ఈ హత్యలు చేసినట్టు ఒప్పుకుంటాడు. 29 మందిని చంపినట్టు ఆధారాలు దొరుకుతాయి కానీ, దాదాపు 400 మందిని చంపినట్టు తెలుసుకుంటారు. ఇతనికి కోర్ట్ జీవిత కాలం జైలులో ఉండే విధంగా శిక్ష విధిస్తుంది. చివరికి ఇతడు ఎందుకు హత్యలు చేస్తున్నాడు అనేది తెలుసుకోవాలనుకుంటే ఈ మూవీని మిస్ కాకుండా చూడండి.