BigTV English

Pradeep Machiraju: ప్రదీప్ జీవితంలో కష్టాలు..ఇన్నాళ్లకు బయటపడ్డ నిజం..

Pradeep Machiraju: ప్రదీప్ జీవితంలో కష్టాలు..ఇన్నాళ్లకు బయటపడ్డ నిజం..

Pradeep Machiraju: బుల్లితెరపై టాప్ మేల్ యాంకర్లలో ప్రదీప్ మాచిరాజు పేరు మొదటి వరుసలో ఉంటుంది. తన చలాకితనం కామెడీతో ఏ షో చేసిన ప్రేక్షకులను కడుపుబ్బనవిస్తాడు. అందుకే ప్రదీప్ షో అంటే జనాలు చెవులు కోసుకుంటారు. దాదాపు 10 ఏళ్లకు పైగా ప్రదీప్ మాచిరాజు బుల్లితెరపై వరుస షోలతో బిజీగా గడిపారు. ఈమధ్య వెండితెరపై అడుగుపెట్టి హీరోగా పలు సినిమాల్లో నటిస్తూ వస్తున్నాడు. ప్రస్తుతం ఆయన తన రెండో సినిమాతో ప్రేక్షకులను పలకరించేందుకు రెడీ అవుతున్నాడు.. ఈ క్రమంలో ప్రదీప్ గురించి ఓ షాకింగ్ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఏంటి ప్రదీప్ జీవితంలో ఇంత జరిగిందా? అంటూ ఆయన అభిమానులు షాక్ అవుతున్నారు.. యాంకర్ ప్రదీప్ లైఫ్ లో మర్చిపోలేని ఆ సంఘటన ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..


ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రదీప్..

యాంకర్ ప్రదీప్ యాంకరింగ్ తో పాటుగా వరుసగా సినిమాలు చేస్తున్నాడు. గతంలో 30 రోజుల్లో ప్రేమించడం ఎలా? అనే సినిమాలో నటించాడు. ఆ మూవీ పర్వాలేదనే టాక్ ను సొంతం చేసుకుంది. దాంతో హీరోగా ప్రదీప్ సక్సెస్ అయ్యాడు. ఇప్పుడు తన రెండో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ మూవీ ప్రమోషన్లో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు ప్రదీప్.. ఆ ఇంటర్వ్యూ లో భాగంగా తన పర్సనల్ విషయాల గురించి కూడా ఆయన షేర్ చేసుకున్నారు.. ప్రదీప్ మాట్లాడుతూ.. కాలికి గాయం అవ్వడంతో ఒక సర్జరీ అయింది. అది వర్కౌట్ అవ్వలేదు. మళ్ళీ ఇంకో సర్జరీ చేసారు. డాక్టర్లు బాగానే కష్టపడ్డారు. నించొని యాంకరింగ్ చేసే జాబ్ కాబట్టి సర్జరీల తర్వాత చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అన్నారు. ఆ సర్జరీ తర్వాత వర్కౌట్స్ కూడా చేయలేకపోయాను. అందుకే గ్యాప్ వచ్చింది. మొత్తానికి ఆ సర్జరీ నుంచి బయటపడిన తర్వాత బాగా వర్క్ అవుట్ చేశాను దాంతో ఇప్పుడు నాకు బాగానే ఉంది అంటూ ప్రదీప్ అన్నాడు. ఈ సినిమాలో నేను బాగా తిరిగే అబ్బాయిని అందుకే ఈ సినిమా కోసం బాగా ఫిట్గా తయారై పూర్తి చేసి ఇప్పుడిలా వచ్చాను అని ప్రదీప్ అంటాడు. ఆ వీడియో ప్రస్తుతం వైరల్ అవ్వడంతో చాలామంది కామెంట్లు పెడుతున్నారు.


Also Read: సినిమాల పై పవన్ షాకింగ్ నిర్ణయం.. 2025 ఫ్యాన్స్ కు గుర్తుండిపోతుందా..?

అక్కడ అమ్మాయి.. ఇక్కడ అబ్బాయి మూవీ.. 

ప్రదీప్ మాచిరాజు గతంలో 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే సినిమాలో నటించాడు. ఆ మూవీలో ప్రదీప్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఆ తర్వాత తన రెండో సినిమాగా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి మూవీ లో నటించాడు. ఈ మూవీ ప్రస్తుతం ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతుంది. ఈనెలలో రిలీజ్ అవుతుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో ప్రదీప్ ఒక్కడే ప్రమోషన్స్ బాధ్యతల్ని తన భుజాన వేసుకొని బుల్లితెరపై ప్రసారమవుతున్న షోలకు వెళ్తున్నాడు. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి ప్రతి అప్డేట్ మంచి టాక్ ని సొంతం చేసుకున్నాయి. సాంగ్స్ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి ఈ మూవీ ఎలాంటి టాక్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి..

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×