BigTV English

Gold In Odisha : జాక్ పాట్ కొట్టిన స్టేట్ – లెక్కలేనంత బంగారం గనులు గుర్తింపు

Gold In Odisha : జాక్ పాట్ కొట్టిన స్టేట్ – లెక్కలేనంత బంగారం గనులు గుర్తింపు

Gold In Odisha : ఇటీవల కాలంలో ఖనిజాన్వేషలో సరికొత్త విషయాలు ఆశ్చర్యపరుస్తున్నాయి. దేశంలోని వివిధ ప్రాంతాల్లో అద్భుత ఖనిజ సంపద వెలుగు చూస్తోంది. అలా.. ఒడిసాలోని దేవ్‌ఘర్ జిల్లాలోని అడసా-రాంపల్లి ప్రాంతంలో రాగి ఖనిజం కోసం జి-2 స్థాయి అన్వేషణను చేపట్టగా సంచలన విషయం వెలుగు చూసింది. రాగి కోసం ప్రయత్నిస్తే ఏకంగా బంగారం బయటపడింది. అదీ మాములుగా కాదు.. భారీ స్థాయిలో బంగారం నిల్వలున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ విషయాన్ని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్‌ఐ) నిర్ధరించినట్లుగా ఒడిస్సా ఉక్కు & గనుల శాఖ మంత్రి బిభూతి భూషణ్ జెనా ఆ రాష్ట్ర అసెంబ్లీలో ప్రకటించారు.


ఒడిస్సాలో వివిధ విలువైన ఖనిజ నిక్షేపాలున్నాయి. దేశంలోని ఎక్కువ ఖనిజ సంపదన ఉన్న రాష్ట్రాల్లో ఒడిస్సా ముందు వరుసలో నిలుస్తోంది. అలాంటి రాష్ట్రంలో ఇప్పుడు బంగారు నిక్షేపాలు వెలుగు చూడడంతో ఆ రాష్ట్ర స్థితి గతులు భారీగా మారిపోతాయని పరశోధకులు చెబుతున్నారు. అసెంబ్లీలో ఓ ప్రశ్నకు సమాధానమిస్తూ.. గోపూర్-గాజీపూర్ మంకడ్చువామ్, సలైకానా, దిమిరిముండాతో సహా కియోంఝర్ జిల్లాలోని వివిధ ప్రాంతాలలో బంగారు నిక్షేపాలను గుర్తించడానికి అన్వేషణ కార్యకలాపాలు జోరుగా నిర్వహిస్తున్నట్లు మంత్రి తెలిపారు.

మయూర్‌భంజ్ జిల్లాలోని జాషిపూర్, సురియాగూడ, రువానాసి, ఇడెల్కుచా, మారేదిహి, సులేపట్ (ధుసురా కొండ), అలాగే బాదంపహార్ వంటి అనేక ప్రాంతాలలో బంగారు తవ్వకాల కోసం ప్రాథమిక అన్వేషణ జరుగుతోందని మంత్రి వివరించారు. అదనంగా మరికొన్ని జిల్లాల్లోని అనేక ప్రాంతాల్లో చెల్లాచెదురుగా బంగారం జాడలు ఉన్నట్లు ఇప్పటికే గుర్తించామని, ఈ ప్రాంతాలలో ఇంకా పూర్తిస్థాయి అన్వేషణ జరపలేదని మంత్రి తెలియజేశారు.


రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఏ బంగారు గనులను వేలం వేయలేదని తెలిపిన మంత్రి.. ఆయా గనుల ద్వారా రాష్ట్ర ఖజానాకు వేల కోట్ల సంపాదన వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. చారిత్రాత్మకంగా ప్రగతి వైపు వేసే అడుగులో భాగంగా.. ఒడిశా దేవ్‌ఘర్‌లోని తొలి బంగారు మైనింగ్ బ్లాక్‌ను వేలం వేయడానికి సన్నాహాలు చేస్తోంది. జీఎస్‌ఐ, ఒడిశా మైనింగ్ కార్పొరేషన్ కలిసి కియోంఝర్‌లో బంగారం వెలికితీత అవకాశాలను పరిశీలిస్తున్నాయి.  అలాగే.. మయూర్‌భంజ్, డియోగర్‌లలో మరిన్ని సర్వేలు జరుగుతున్నాయి, త్వరలో ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. కియోంఝర్‌లోని గోపూర్-గాజీపూర్ ప్రాంతంలోని బంగారు నిక్షేపాల పరిమాణాన్ని వేలం వేయడానికి ముందు ఇంకా.. అక్కడి నిల్వలపై అంచనా వేయలేదని అధికారులు తెలుపుతున్నారు. ఈ గనులతో రాష్ట్రంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు రావడంతో పాటుగా, పెద్ద ఎత్తున ఉద్యోగాల సృష్టి జరుగుతుందని, అవన్ని ఒడిశా ఆర్థిక వ్యవస్థను సమూలంగా మార్చేయగలవని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. 

Also Read : Indian Economy : భారత్ అభివృద్ధి అదుర్స్ – దశాబ్దంలో డబుల్ అయిన ఎకానమి

బంగారమే కాదు ఎలక్ట్రిక్ వెహికల్ (EV) బ్యాటరీలకు కీలకమైన లిథియం ఖనిజ సంపాదనలోనూ ఒడిశా ముందు వరుసలోనే ఉంది. ఇక్కడి నయాగఢ్ జిల్లాలో పెద్ద మొత్తంలో లిథియం నిల్వల్ని గుర్తించారు. మరిన్ని నిల్వలను గుర్తించేందుకు GSI అధునాతన AI, డ్రోన్ టెక్నాలజీని ఉపయోగించి అన్వేషణ ప్రయత్నాలను చేస్తోంది. కాగా.. రానున్న కాలంలో ఒడిశా భారత లిథియం సరఫరా గొలుసులో కీలక పాత్రధారిగా మారుతుంది అంటున్నారు. ఈ ఖనిజాన్ని విదేశాల నుంచి దిగుమతి చేసుకునే అవసరం తప్పుతుందని, దేశీయ పునరుత్పాదక ఇంధన లక్ష్యాలకు మద్దతు ఇస్తుందని అంటున్నారు.

Related News

Army rescue: మంచు పర్వతాల మధ్య.. పురిటి నొప్పులతో మహిళ! రంగంలోకి 56 మంది జవాన్స్.. ఆ తర్వాత?

FASTag Annual Pass: వాహనదారులకు శుభవార్త.. ఫాస్టాగ్ వార్షిక పాస్ కావాలా..? సింపుల్ ప్రాసెస్

Bengaluru: బెంగుళూరులో ప్రధాని.. వందే భారత్ రైళ్లు ప్రారంభం, ఆ తర్వాత రైలులో ముచ్చట్లు

Rakhi Fest: ఈ టీచర్ గ్రేట్.. 15వేల మంది మహిళలు రాఖీ కట్టారు.. ఫోటో వైరల్

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

Big Stories

×