E-Paper
Advertisement

డ్రాగన్‌ను కొట్టడానికి కుర్రాడి క్రేజీ జర్నీ… విజువల్స్ పీక్స్ అసలు… ఎపిక్ ఫాంటసీ అడ్వెంచర్ సినిమా

డ్రాగన్‌ను కొట్టడానికి కుర్రాడి క్రేజీ జర్నీ… విజువల్స్ పీక్స్ అసలు… ఎపిక్ ఫాంటసీ అడ్వెంచర్ సినిమా
Advertisement

Epic Fantasy Adventure Thriller OTT : ఒక ప్రశాంతమైన హాబిట్ జీవితం ఒక్క రాత్రిలో పూర్తిగా మారిపోతుంది. ఇంట్లోకి ఓ మాంత్రికుడు వచ్చి, తనతో పాటు పదమూడు మంది డ్వార్ఫ్‌ లను తీసుకొస్తాడు. వారి లక్ష్యం సాధారణ సాహసం కాదు… డ్రాగన్ ఆక్రమించిన తమ రాజ్యాన్ని, అపారమైన బంగారాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవడం. మొదట ఈ అడ్వెంచర్‌ కు వెళ్లాలని ఇష్టపడని బిల్బో బాగిన్స్ చివరకు ఆ ప్రమాదకరమైన ప్రయాణంలో కీలక వ్యక్తిగా మారే ఎపిక్ ఫాంటసీ అడ్వెంచర్ ‘ది హాబిట్ యాన్ అన్‌ఎక్స్‌పెక్టెడ్ జర్నీ’ (The Hobbit: An Unexpected Journey). విజువల్స్ పీక్స్ లో ఉండే ఈ సినిమాను ఎక్కడ చూడవచ్చు ? అనే వివరాలపై ఒక లుక్కేద్దాం పదండి.

కథలోకి వెళ్తే…

షైర్‌ లో ప్రశాంతమైన జీవితాన్ని గడిపే బిల్బో బాగిన్స్ కు బయట ప్రపంచంలోని సాహసాలంటే పెద్దగా ఆసక్తి ఉండదు. తన ఇల్లు, తన సౌకర్యవంతమైన జీవితం… అంతే అతనికి కావాల్సింది. కానీ గాండాల్ఫ్ ది గ్రే అతని జీవితంలోకి వచ్చిన తర్వాత పరిస్థితి మారిపోతుంది. గాండాల్ఫ్‌ తో పాటు థోరిన్ ఓకెన్‌షీల్డ్ నాయకత్వంలోని పదమూడు మంది డ్వార్ఫ్‌ లు బిల్బో ఇంటికి వస్తారు. వారి పూర్వీకుల రాజ్యం ఎరెబోర్ ను స్మాగ్ అనే భారీ డ్రాగన్ ఆక్రమించి, మొత్తం బంగారాన్ని తన ఆధీనంలోకి తీసుకుంటాడు. అందుకే తమ రాజ్యాన్ని తిరిగి పొందేందుకు థోరిన్ ప్రయాణం మొదలుపెడతాడు.

Advertisement

బిల్బోను వాళ్లు తమ వెంట తీసుకెళ్లాలని నిర్ణయిస్తారు. మొదట ఇష్టపడకపోయినా బిల్బో చివరకు వారితో బయలుదేరుతాడు. అక్కడి నుంచి అతని ముందున్న ప్రపంచం పూర్తిగా మారిపోతుంది. గోబ్లిన్లు, ఓర్క్స్, ట్రోల్స్, వైల్డ్ వోల్వ్స్, జెయింట్ స్పైడర్స్ వంటి ప్రమాదాలు ఒక్కొక్కటిగా ఎదురవుతాయి. ఈ ప్రయాణంలో బిల్బో గోలమ్ ను కలుస్తాడు. భూగర్భంలోని ఓ సరస్సు దగ్గర గోలమ్‌ తో రిడిల్ గేమ్ ఆడాల్సి వస్తుంది. అక్కడే బిల్బోకు ఓ చిన్న బంగారు ఉంగరం దొరుకుతుంది. అది సాధారణ ఉంగరం కాదని అతనికి అప్పటికి తెలియదు.

మరోవైపు థోరిన్‌ పై పాత శత్రువు అజోగ్ కూడా పగతో ఉంటాడు. డ్వార్ఫ్‌ లను వెంటాడుతున్న అతని సైన్యం కారణంగా ప్రయాణం మరింత ప్రమాదకరంగా మారుతుంది. ఓ దశలో బిల్బో ధైర్యం చూపించి థోరిన్ ప్రాణాలను కాపాడే స్థాయికి ఎదుగుతాడు. చివరకు వారి లక్ష్యం అయిన లోన్లీ మౌంటెన్ కనిపిస్తుంది. అక్కడే బంగారంతో పాటు స్మాగ్ కూడా ఉంది. బిల్బో, థోరిన్, గాండాల్ఫ్‌ ల ప్రయాణం ఇక్కడితో ముగియదు. అసలు ప్రమాదం మాత్రం ఇప్పుడే ఎదురవుతుంది.

Advertisement

బిల్బో నిజంగా స్మాగ్ ఉన్న రాజ్యానికి చేరుకోగలడా ? గోలమ్ దగ్గర దొరికిన ఉంగరం ఏమిటి ? థోరిన్ తన పూర్వీకుల రాజ్యాన్ని తిరిగి పొందగలడా ? ఈ ప్రయాణం మిడిల్ ఎర్త్ భవిష్యత్తును ఎలా మార్చబోతోందో తెలియాలంటే ‘ది హాబిట్ యాన్ అన్‌ఎక్స్‌పెక్టెడ్ జర్నీ’ని చూడొచ్చు.

Also Read : భూమిని తుడిచిపెట్టే వైరస్… 2035 నుంచి పాస్ట్‌లోకి వెళ్లిన ఖైదీ… అల్టిమేట్ టైమ్ ట్రావెల్ సై-ఫై సిరీస్

ఓటీటీలో ఎక్కడ చూడొచ్చు?

2012లో విడుదలైన ‘ది హాబిట్ యాన్ అన్‌ఎక్స్‌పెక్టెడ్ జర్నీ’ అద్భుతమైన మూవీ. ఈ ఫాంటసీ అడ్వెంచర్ కి పీటర్ జాక్సన్ దర్శకత్వం వహించారు. మార్టిన్ ఫ్రీమన్, ఇయాన్ మెకెల్లెన్, రిచర్డ్ ఆర్మిటేజ్ తదితరులు ఇందులో నటించారు. Amazon Prime Videoలో అందుబాటులో ఉంది. కానీ ఈ ఎపిక్ అడ్వెంచర్ తెలుగులో లేదు.

Related News

బాబోయ్ 23 ఏళ్లకు ఒకసారి వచ్చే దెయ్యం మళ్లీ వచ్చింది… రాత్రిపూట ఒంటరిగా చూడకూడని సినిమా

అయ్యబాబోయ్ ఆ అద్దంలో డెవిల్ ఉందంట… సీక్రెట్ టెస్ట్ చేయబోతే మైండ్ బ్లాకయ్యే సీన్స్… వైరల్ అవుతున్న హారర్ మూవీ

భూమిని తుడిచిపెట్టే వైరస్… 2035 నుంచి పాస్ట్‌లోకి వెళ్లిన ఖైదీ… అల్టిమేట్ టైమ్ ట్రావెల్ సై-ఫై సిరీస్

ట్రిప్పుకెళ్లిన ఫ్యామిలీని తగులుకునే నలుగురు సైకోలు… విచిత్రమైన కండిషన్… నెక్స్ట్ లెవెల్ మైండ్-బెండింగ్ హారర్ థ్రిల్లర్

ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ లాక్ చేసుకున్న ‘ఎపిక్’.. ఎక్కడ చూడొచ్చంటే?

పిన్ ను తాకితే ఫ్యూచర్ వరల్డ్ లోకి… పాప సాహసం చూస్తే సైలెంట్ గా ఉండలేరు… క్రేజీ సైన్స్ ఫిక్షన్ మూవీ

12 ఏళ్ల బాలుడి చేతికి దివ్య ఖడ్గం… స్కూల్ బ్యాచ్‌తో కలిసి దెయ్యాల సైన్యంతో వార్… వీళ్ళ అడ్వెంచర్ అదుర్స్

Big Stories

Advertisement
×