Raja Singh: అసదుద్దీన్ ఓవైసీకి ఎమ్మెల్యే రాజా సింగ్ గట్టి కౌంటర్ ఇచ్చారు. హిందూ కార్యక్రమాలకు ముస్లిం బౌన్సర్లన్ పెట్టుకోవాలని అడిగే హక్కు నీకు ఎక్కడిదని ఫైర్ అయ్యారు. ఏ కార్యక్రమానికి ఎవర్ని పెట్టుకోవాలో మాకు తెలుసని రాజాసింగ్ గాటుగా స్పందించారు. దాండియా కార్యక్రమానికి వచ్చిన ముస్లిం బౌన్సర్స్ లవ్ జిహాద్ పాల్పడుతున్నారని అన్నారు.
గత నాలుగు ఏండ్లుగా మేము దాండియా నిర్వాహకులకు అవగాహన కల్పిస్తున్నామని, ఇప్పుడు మేము సక్సెస్ అయ్యామని రాజాసింగ్ అన్నారు. దండియా నిర్వాహకులు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదని, మీకు మేము అండగా ఉంటామని అన్నారు. ఎవరైనా ముస్లిం బౌన్సర్‌ను పెట్టుకుంటే ఈవెంట్స్ ను అడ్డుకుంటాంమని ఎమ్మెల్యే రాజా సింగ్ అన్నారు.
ఎక్స్‌లో హిందు సంఘాలను తీవ్రవాద సంస్థలతో పోలుస్తూ ఒవైసీ ట్విట్ చుసారు. దీంతో తీవ్రవాద సంస్థల ఒత్తిడితో ఈవెంట్ నిర్వాహకులు తమను బహిష్కరిస్తున్నారని ముస్లిం బౌన్సర్లు చెపుతున్నారని, పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటే ఈ విషాన్ని అరికట్టవచ్చని ఒవైసీ అన్నారు. అంతకంటే ముఖ్యంగా ఈ దురాచారానికి వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలు మతాలకు అతీతంగా ఐక్యంగా నిలబడాలని అన్నారు.లేకపోతే, రాష్ట్ర ప్రగతి, అభివృద్ధి కూడా బలి అవుతుందని అన్నారు.
Also read: బీసీ రిజర్వేషన్ల వివాదంపై క్లారిటీ ఇచ్చిన మంత్రి అచ్చెన్నాయుడు.. ఎమన్నారంటే?