BigTV English

OTT Movie : తప్ప తాగి పబ్లిక్ టాయ్ లెట్ లో గుండె పగిలే పని… ఆ సీన్స్ కు గూస్ బంప్స్… కలలోనూ వెంటాడే కొరియన్ కథ

OTT Movie : తప్ప తాగి పబ్లిక్ టాయ్ లెట్ లో గుండె పగిలే పని… ఆ సీన్స్ కు గూస్ బంప్స్… కలలోనూ వెంటాడే కొరియన్ కథ

OTT Movie : ఇప్పటిదాకా రియల్ లైఫ్ లో ఎన్నో దారుణమైన క్రైమ్స్ చూశాం. అలాంటి వాటిని సినిమాలుగా తెరకెక్కించడం ఒక ఎత్తైతే, రియల్ స్టోరీస్ ను ఎమోషనల్ గా ప్రేక్షకులను కనెక్ట్ అయ్యేలా తీర్చిదిద్దడం మరో ఎత్తు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే కొరియన్ మూవీలో గుండె పగిలే ఒక యథార్థ సంఘటనను అద్భుతంగా తెరకెక్కించారు. ఈ మూవీని చూస్తే ఏడుపు ఆపుకోవడం కష్టమే. మరి ఈ హార్ట్ టచింగ్ మూవీ ఏ ఓటీటీలో ఉంది ? అనే విషయంపై ఓ లుక్కేద్దాం పదండి.


రెండు ఓటీటీలలో రియల్ స్టోరీ
ఈ దక్షిణ కొరియా సినిమా పేరు ‘Hope’. ఈ కొరియన్ మూవీ లీ జంగ్-హ్యాంగ్ దర్శకత్వంలో రూపొందింది. సోల్ యంగ్-హ్వా, లీ రియం ఇందులో మెయిన్ లీడ్స్ గా నటించగా, 2008లో జరిగిన నిజమైన ఘటన ఆధారంగా తెరకెక్కింది. 2013లో రిలీజ్ అయిన ఈ మూవీని లాటస్ ఫిల్మ్ కంపెనీ బ్యానర్‌లో జో జాంగ్-హూన్ నిర్మించారు. ఉమ్ జి-వాన్ (మి-హీ), కిమ్ సాంగ్-హో (గ్వాంగ్-సిక్), రా మి-రాన్ కీలక పాత్రలు పోషించారు. IMDbలో 8.2 రేటింగ్ దక్కించుకున్న ఈ మూవీ సెన్సిటివ్ యెట్ పవర్‌ఫుల్ డ్రామా అని చెప్పొచ్చు. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ (Netflix), అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగులో కూడా అందుబాటులో ఉంది.

కథలోకి వెళ్తే…
ఈ మూవీ 2008లో జరిగిన చో డో-సూన్ కేసు ఆధారంగా రూపొందింది. ఇది సో-వాన్ (లీ రియం) అనే ఒక ఎనిమిదేళ్ల బాలిక చుట్టూ తిరుగుతుంది. ఆమె పాఠశాలకు వెళ్తుండగా ఒక హింసాత్మక అఘాయిత్యానికి గురవుతుంది. ఫలితంగా ఆమె శారీరకంగా, మానసికంగా తీవ్రంగా గాయపడుతుంది. ఆమె తండ్రి డాంగ్-హూన్ (సోల్ యంగ్-హ్వా) ఫ్యాక్టరీ వర్కర్, తల్లి మి-హీ (ఉమ్ జి-వాన్) ఒక షాప్ ఓనర్. ఈ దారుణ ఘటన తర్వాత తమ కుమార్తెను రక్షించడానికి, ఆమెను సాధారణ జీవితానికి తిరిగి తీసుకురావడానికి వాళ్ళు పడే వేదన కంటతడి పెట్టిస్తుంది.


Read Also : భర్త నుంచి దూరంగా… స్టూడెంట్స్ ముందు అన్నీ తీసేసి… చిన్న పిల్లలు చూడకూడని మూవీ

సో-వాన్ ట్రామా కారణంగా మాట్లాడటం ఆపేస్తుంది. తన సొంత తండ్రినే చూసి భయపడుతుంది. డాంగ్-హూన్ తన కుమార్తె ట్రామాను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ, ఒక కార్టూన్ మాస్క్ ధరించి ఆమెతో సంభాషించడానికి ప్రయత్నిస్తాడు. మి-హీ కూడా కూతురికి సపోర్ట్ సిస్టమ్‌గా ఉంటుంది. అదే సమయంలో ఒక సైకాలజిస్ట్ (రా మి-రాన్) సో-వాన్‌కు ఆమె భయాలను అధిగమించడంలో సహాయపడుతుంది. మరి ఆ చిన్న పాప ఈ దారుణమైన ఘటన నుంచి ఎలా కోలుకుంది? కన్న తండ్రినే చూసి ఎందుకు భయపడుతోంది? కోర్టులో ఆమె పోరాటం ఎలా సాగింది? అన్నది తెరపై చూసి తెలుసుకోవాల్సిందే.

Related News

OTT Movie : 20 ఏళ్ల అబ్బాయితో 40 ఏళ్ల అమ్మాయి… నెవర్ బిఫోర్ మిస్టరీ గేమ్… చిన్న పిల్లలతో చూడకూడని మూవీ

OTT Movie : హైబ్రిడ్ అమ్మాయిని లైన్లో పెట్టే రైతు… కానీ కండిషన్స్ అప్లై… స్వచ్ఛమైన పల్లెటూరి ప్రేమకథ

OTT Movie : దెయ్యాలు మేనేజ్ చేసే హోటల్ ఇది… ఫ్యామిలీ ఎంట్రీతో ట్విస్టు… హిలేరియస్ హార్రర్ సిరీస్

OTT Movie : అన్న పాస్ట్ లవర్ తో తమ్ముడు… అండర్ వరల్డ్ తో శత్రుత్వం… ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్

AA22 OTT : బన్నీ – అట్లీ మూవీ ఓటీటీ డీల్… ఇండియాలోనే హైయెస్ట్ ధరకు సోల్డ్ అవుట్ ?

OTT Movie : చిన్న పిల్లలపై చెయ్యేస్తే ఈ సైకో చేతిలో మూడినట్టే… ఇలాంటి సైకోలు కూడా ఉంటారా భయ్యా

OTT Movie : అక్కా చెల్లెల్లు ఇద్దరూ ఒక్కడితోనే… లాస్ట్ కి కేక పెట్టించే కిర్రాక్ ట్విస్ట్

OTT Movie : ఊర్లో ఒక్కరిని కూడా వదలని దొర… పెళ్లి కాకుండానే అలాంటి పని… మైండ్ బెండయ్యే ట్విస్టులు

Big Stories

×