BigTV English

Ambati Rambabu: అంబటి సైలెన్స్.. డోస్ గట్టిగానే పడిందా?

Ambati Rambabu: అంబటి సైలెన్స్.. డోస్ గట్టిగానే పడిందా?

హరిహర వీరమల్లు రిలీజ్ సందర్భంగా ఆ సినిమా విజయవంతం కావాలంటూ పవన్ కల్యాణ్ ని, నాగబాబుని ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేసి కలకలం రేపారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. కనక వర్షం కురవాలంటూ ఆయన వెటకారం చేసినా.. వైసీపీ అధిష్టానం మాత్రం ఆ ట్వీట్ ని సీరియస్ గా తీసుకున్నట్టుంది. అంబటి ఏ ట్వీట్ వేసినా వెంటనే సాక్షి మీడియా హైలైట్ చేస్తుంది. కానీ హరిహర వీరమల్లు విషయంలో అంబటి నుంచి వచ్చిన పాజిటివ్ రియాక్షన్ ని కావాలనే పక్కనపెట్టారు. అంబటికి జగన్ తలంటారని సోషల్ మీడియా టాక్. అందుకే సినిమా రిలీజ్ తర్వాత రాంబాబు మౌనం వహించారని తెలుస్తోంది.


చేతులు కాలాక..
పవన్ కల్యాణ్ సినిమా హరిహర వీరమల్లుపై సాక్షి విపరీతమైన నెటిగివ్ ప్రచారం చేస్తోంది. సినిమా రిలీజ్ కి ముందే ఈ ప్రచారం మొదలైంది. విడుదల తర్వాత మరింత పెరిగింది. ఈ సినిమాని బాయ్ కాట్ చేయాలని కూడా వైసీపీ బ్యాచ్ సోషల్ మీడియాలో పోస్టింగ్ లు పెడుతోంది. అయితే పార్టీ లైన్ కి విరుద్ధంగా అంబటి ట్వీట్ వేయడం ఆశ్చర్యంగా ఉంది. పాలన పక్కనపెట్టి పవన్ కల్యాణ్ సినిమా షూటింగ్ లకు హాజరయ్యారంటూ ఓవైపు రోజా వంటి నేతలు విమర్శలు చేస్తుంటే, ఆ సినిమా హిట్ కావాలంటూ అంబటి రాంబాబు ట్వీట్ వేయడంతో పార్టీ శ్రేణులు ఆశ్చర్యపోయాయి. అయితే కాపు సామాజిక వర్గాన్ని సంతోషపెట్టేలా అంబటి ఈ ట్వీట్ వేసినట్టు తెలుస్తోంది. తన సామాజిక వర్గంలో పట్టు నిలుపోకాడనికే పవన్ సినిమా విజయాన్ని కాంక్షిస్తూ అంబటి ట్వీట్ వేశారంటున్నారు. ఆ ట్వీట్ తర్వాత అంబటికి అధిష్టానం తలంటిందని ప్రచారం జరిగింది. అందుకే దాన్ని కవర్ చేస్తూ వెంటనే మరో వీడియో పోస్ట్ చేశారు అంబటి. వైసీపీ వాహనంపై ఎక్కి కొంతమంది యువకులు చిందులు వేస్తున్న వీడియోని పోస్ట్ చేస్తూ అంబటి రాంబాబు పవన్ ని ప్రశ్నించారు. అలాంటి ప్రవర్తనను పవన్ సమర్థిస్తారా అని అడిగారు.

సైలెన్స్..
సినిమా రిలీజ్ కి ముందు ట్వీట్ వేసి బెస్టాఫ్ లక్ చెప్పిన అంబటి, విడుదల తర్వాత కూడా ఆ జోష్ కొనసాగిస్తారేమోనని కొందరు ఎదురు చూశారు. కానీ అప్పటికే పార్టీ నుంచి ఒత్తిడి రావడంతో అంబటి సైలెంట్ అయ్యారు. పవన్ సినిమా చూశానని కానీ, చూడలేదని కానీ, బాగుందని కానీ, బాగోలేదని కానీ ఆయన ఒక్క ట్వీట్ కూడా వేయలేదు. అంటే సినిమా ట్వీట్ అంబటిని బాగానే ఇబ్బంది పెట్టినట్టు తెలుస్తోంది. అందుకే అంబటి తెరపైకి రాలేదు, కనీసం సోషల్ మీడియాలో కూడా పోస్టింగ్ లు పెట్టలేదు. మరోవైపు సాక్షి మీడియా కూడా అంబటి వ్యవహారాన్ని పూర్తిగా పక్కనపెట్టింది. జనసైనికులు వైసీపీ నేతల వాహనాలను ధ్వంసం చేయడంపై ఆయన వేసిన ట్వీట్ ని కూడా సాక్షి హైలైట్ చేయకపోవడం విశేషం. మరి ఆయన ఎన్నిరోజులు మౌన వ్రతాన్ని పాటిస్తారో చూడాలి. పవన్ పై ఈసారి ఎలాంటి ట్వీట్ వేస్తారనేది ఆసక్తికరంగా మారింది.

Related News

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

Big Stories

×