కాళీమాత. పౌరుషానికి ప్రతీక. దుర్మార్గులను చీల్చి చెండాడంలో ముందుంటుంది. దుష్టశిక్షణ, శిష్ట రక్షణ చేస్తుంది. అమ్మవారి పేరు వింటేనే, దుర్మార్గుల గుండెల్లో గుబులు పుడుతుంది. అలాంటి అమ్మవారి ఆలయం ముందు సింహాలు కాపలాగా పడుకున్న అరుదైన దృశ్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ ఈ అరుదైన ఘటన ఎక్కడ జరిగిందంటే..
కాళీ ఆలయం ముందు సింహాల కాపలా
తాజాగా కొంత మంది పర్యాటకులు రాత్రి సమయంలో గుజరాత్ లోని గిర్ అభయారణ్యం మీదుగా ప్రయాణం చేశారు. ఎదురుగా ఓ ఆలయం కనిపించడంతో సెల్ ఫోన్ లో షూట్ చేస్తూ వెళ్లారు. అక్కడ వారికో షాకింగ్ ఘటన ఎదురయ్యింది. అమ్మవారి ఆలయం ముందు రెండు సింహాలు కాపలాగా పడుకుని ఉన్నాయి. వారి వాహనాన్ని కూల్ గా చూస్తున్నట్లు కనిపించాయి. కాళీ అమ్మావారి ఆలయం ముందు సింహాలను చూసి సదరు ప్రయాణీకులు సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. నెటిజన్లు రకరాలుగా కామెంట్స్ పెడుతున్నారు. అమ్మవారు అంటే ఆ మాత్రం శక్తి ఉంటుంది మరి, అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియో చూడ్డానికి చాలా బాగుందని మరికొంత మంది అంటున్నారు.
గిర్ అభయారణ్యం గురించి..
గిర్ అభయారణ్యం. పెద్దగా పరిచయం అవసరం లేదు. గుజరాత్ లో ఉన్న ఈ వన్య ప్రాణుల సంరక్షణ కేంద్రం దేశంలోని అతిపెద్ద అభయారణ్యాలలో ఒకటి. మొత్తం సుమారు 1,412 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. ఇది జునాగఢ్ పట్టణానికి 65 కిలోమీటర్ల దూరంలో ఉంది. అంతేకాదు, గుజరాత్ లోని ప్రధాన పర్యాటక ప్రదేశాల్లో గిర్ నేషనల్ పార్క్ ఒకటిగా కొనసాగుతోంది. ఇక్కడ వన్యప్రాణులు పెద్ద సంఖ్యలో ఉంటాయి. ముఖ్యంగా సింహాలు, పులుల ఎక్కువగా ఉంటాయి. ఈ గిర్ నేషనల్ పార్క్ ఆసియాలోనే సింహాలకు ఏకైక సహజ ఆవాసంగా ప్రసిద్ధి చెందింది. దీంతో వాటిని చూడటానికి పర్యాటకులు ఇక్కడికి పెద్ద ఎత్తున వస్తుంటారు.
నిజానికి రాత్రి పూట ఇక్కడి నుంచి వెళ్లేందుకు వాహనదారులు భయపడుతుంటారు. కార్లు, పెద్ద వాహనదారులు వెళ్తుంటారు. కానీ, టూవీలర్స్ మీద వెళ్లరు. ఎందుకంటే, సింహాలు, పులులు, రోడ్లకు ఇరువైపులా పడుకుని కనిపిస్తాయి. అలాగే తాజాగా రెండు సింహాలు అమ్మవారి ఆలయం ముందు పడుకుని కనిపించాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందరినీ కూల్ గా ఆకట్టుకుంటుంది.
Read Also: కోల్ కతా మెట్రోలో ప్రయాణీకుడి చిల్లర వేషాలు, పట్టుకునేందుకు పోలీసుల యత్నం!