Sci Fi Action Thriller OTT : ఒక ఫ్యూచరిస్టిక్ కాలనీ… అక్కడ ఉండే వాళ్లందరికీ బయట ప్రపంచం మొత్తం నాశనమైపోయిందని చెబుతారు. అందుకే వాళ్లలో కొంతమందిని మాత్రమే ప్రపంచంలో మిగిలిన సేఫ్ ప్లేస్ అయిన ‘ది ఐలాండ్’కు పంపిస్తుంటారు. ఆ అవకాశం కోసం అందరూ ఎదురు చూస్తుంటారు. కానీ అక్కడి ఓ వ్యక్తికి మాత్రం కొన్ని విషయాలు పదేపదే అనుమానం కలిగిస్తుంటాయి. చివరకు అతడికి తెలిసిన నిజం ఏంటంటే… తాను అనుకుంటున్న జీవితం అసలు నిజమే కాదని. అప్పటి నుంచి మొదలయ్యే పరుగు చూస్తే మైండ్ బ్లాక్ అవుతుంది. ఇదే కాన్సెప్ట్‌తో వచ్చిన సూపర్ సై-ఫై యాక్షన్ మూవీ ‘The Island’. మరి ఈ సినిమాను ఏ ఓటీటీలో చూడవచ్చు ? అన్న వివరాలను తెలుసుకుందాం పదండి.
2019 సంవత్సరం. లింకన్ సిక్స్ ఎకో అనే వ్యక్తి ఒక హైటెక్, కంట్రోల్డ్ కాలనీలో జీవిస్తుంటాడు. అక్కడి వాళ్లందరికీ ఒకటే నమ్మకం. భూమి మొత్తం కాలుష్యంతో నాశనం అయిపోయిందని అనుకుంటారు. అలాగే తాము మాత్రమే సురక్షితమైన ప్రాంతంలో ఉన్నామని చెబుతారు. బయట ప్రపంచంలో ఇంకా మనుషులు జీవిస్తున్నారా లేదా అన్నది కూడా వాళ్లకు తెలియదు.
అక్కడ ఉండే ప్రతి ఒక్కరి జీవితానికి కొన్ని కఠినమైన నియమాలు ఉంటాయి. ఎక్కడికి వెళ్లాలి, ఏం తినాలి, ఎవరితో మాట్లాడాలి… అన్నీ సిస్టమ్ నిర్ణయిస్తుంది. అయితే అక్కడ ఉన్న వాళ్లలో కొంతమందిని లాటరీ ద్వారా ‘ది ఐలాండ్’కు పంపిస్తుంటారు. అదే ప్రపంచంలో మిగిలిన చివరి స్వచ్ఛమైన ప్రదేశమని వాళ్లకు చెబుతారు. లింకన్ కు కూడా ఆ లాటరీలో తన పేరు రావాలని ఉంటుంది.
కానీ రోజులు గడిచే కొద్దీ లింకన్ కు అక్కడి వ్యవస్థపై అనుమానాలు మొదలవుతాయి. తాను చూస్తున్న కొన్ని విషయాలు వాళ్లకు చెప్పే కథతో అసలు మ్యాచ్ కావు. చివరకు తనకు తెలిసిన నిజం అతడిని షాక్ కు గురి చేస్తుంది. అసలు ఆ కాలనీలో ఉన్న వాళ్లు ఎవరు ? ‘ది ఐలాండ్’కు నిజంగా ఎవరు వెళ్తున్నారు ? అక్కడి నుంచి బయటపడాలని లింకన్ ప్రయత్నిస్తే ఏం జరుగుతుంది ? ఈ ప్రశ్నలకు సమాధానం కావాలంటే సినిమా చూడాల్సిందే.
ముఖ్యంగా రెండో భాగంలో వచ్చే ఛేజింగ్, యాక్షన్ సీన్స్ సినిమాకు మంచి స్పీడ్ ఇస్తాయి. ఒకసారి నిజం బయటపడిన తర్వాత లింకన్ తనతో పాటు ఉన్న మరో యువతిని తీసుకుని తప్పించుకునే ప్రయత్నం చేయడం, వాళ్లను వెంబడించే వాళ్లతో జరిగే పోరాటాలు ఆసక్తికరంగా ఉంటాయి. సినిమా మొత్తం ఫ్యూచరిస్టిక్ ప్రపంచం, క్లోనింగ్, మానవ జీవితాన్ని వస్తువులా చూసే వ్యవస్థ చుట్టూ తిరుగుతుంది.
‘ది ఐలాండ్’ మూవీ 2005లో విడుదలైన సై-ఫై యాక్షన్ థ్రిల్లర్. దీనికి Michael Bay దర్శకత్వం వహించారు. ఇందులో Ewan McGregor లింకన్ సిక్స్ ఎకోగా, Scarlett Johansson జోర్డాన్ టూ డెల్టాగా, Djimon Hounsou ఆల్బర్ట్ లారెంట్‌గా, Sean Bean మెరిక్‌గా నటించారు. ప్రస్తుతం ఇండియాలో ఈ మూవీ Netflixలో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీలో తెలుగులోనూ అందుబాటులో ఉంది.