E-Paper
Advertisement

సీఈసీ వైఖరిపై దుమారం..! సర్‌ విధానంతో కేంద్రం బద్నాం..! ఓ వైపు ఢిల్లీ దద్దరిల్లుతుంటే కీర్తిబావుటాలేలా..?

సీఈసీ వైఖరిపై దుమారం..! సర్‌ విధానంతో కేంద్రం బద్నాం..! ఓ వైపు ఢిల్లీ దద్దరిల్లుతుంటే కీర్తిబావుటాలేలా..?
Advertisement

ప్రజాదరణ తగ్గుతూ వస్తోంది. సొంత బలం కాకుండా.. మిత్రపక్షాల సాయం అనివార్యమవుతున్నది. ఒంటరిగా నిలబడి సొంత నిర్ణయాలు తీసుకునే రోజులు పోయి.. అందరి మనసులోని మాటను గౌరవించి.. ఎవరినీ నొప్పించక.. తానొవ్వక అనే విధంగానే తయారయ్యింది ప్రస్తుత ఎన్డీయే పరిస్థితి.

మూలిగే నక్కమీద తాటికాయ పడ్డ చందంగా.. ఎస్‌ఐఆర్‌ వివాదంతో కేంద్రం పూర్తిగా బద్నామయ్యింది. కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌ జ్ఞానేశ్‌ కుమార్‌ ఏకపక్ష నిర్ణయాలు, బీజేపీకి మేలు చేసే విధంగా ఉన్న లోపాయికారి విధానాలు రచ్చకెక్కడంతో.. మొత్తం కేంద్ర ఎన్నికల సంఘం విశ్వసనీయతపైనే నమ్మకం లేకుండా అయిపోయింది. దేశ సమాజానికి ఈ మెసేజ్‌ బలంగా వెళ్లిపోయింది.

Advertisement

తమకు కావాల్సిన ఓట్లను ఉంచేసి.. మిగిలిన ఓట్లను కొల్లగొట్టే చర్యే జ్ఞానేశ్‌ చేస్తూ వస్తున్న సర్‌ విధానమని తేటతెల్లమయ్యేలా బట్టబయలైంది. ఈ నేపథ్యంలో ఓవైపు ప్రతిపక్ష ఇండి కూటమి ఓవైపు. కాక్రోచు పార్టీ జెన్‌జీలు మరోవైపు.. కేంద్రాన్ని టార్గెట్‌ చేస్తూ ఆందోళనలు చేస్తూ వస్తున్నాయి. తక్షణ చర్య కింద సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ రాజీనామాను కోరడంతో పాటు, నష్ట నివారణ కోసం మొత్తం సర్‌ విధానాన్ని ఎత్తివేయాలనే ఏకైక డిమాండ్‌తో ముందుకు సాగుతున్నాయి ఈ రెండు శక్తులు.

తాజాగా కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ .. ఢిల్లీలో చేపట్టిన ర్యాలీ, ఆందోళన దేశ వ్యాప్త చర్చకు వచ్చింది. రాహుల్‌ వీరోచిత పోరాటంగా దీన్ని అభివర్ణించారు. ప్రియాంకా గాంధీ తోడు రాగా.. రాహుల్‌ కేంద్రంపై తీవ్రస్థాయిలో ఒత్తిడి పెంచారు ఈ ఆందోళన ద్వారా… చివరగా రాహుల్‌ను బలవంతంగా అరెస్టు చేసిన విధానంపైనా చర్చ జరిగింది. ఇంతలా పోరాటం పతాకస్థాయికి చేరుకున్న వేళ.. దేశం మొత్తం ఇదే అంశంపై చర్చించుకుంటున్న సందర్భంలో.. కేంద్రం వైఖరి మాత్రం నిమ్మకు నీరెత్తినట్టుగా.. నీరో చక్రవర్తి పిడేలు వాయించిన చందంగానే ఉన్నదనే విమర్శలు వెల్లువెత్తాయి.

Advertisement

కేంద్ర కేబినెట్ భేటీ కావడం.. మోడీని ఆకాశానికెత్తడం..ఇప్పటి దాకా 25 ఏండ్ల పాలన అద్భుతహా.. అని కీర్తిబావుటాలెగరేయడం.. ఓ రకంగా రాజకీయంగా వికారాన్నే పుట్టించాయనే విమర్శలు వెల్లువెత్తాయి. ఇక ఇది చాలదంటూ… మోడీనే మరో 15 ఏళ్లు ఉండాలని వారంతా ముక్తకంఠంతో కోరస్‌ ఇవ్వడం కూడా మరీ ఎబ్బెట్టుగా.. అనిపించాయంటున్నారు.

ఇదంతా ఎన్డీయే వ్యూహంలో భాగమే అనుకున్నా.. మరో సందర్భంలోనైతే దీన్ని జనం కనీసం పరిగణలోకైనా తీసుకునేవారేమో. కానీ ఓవైపు దేశం మొత్తం ఢిల్లీ వైపు చూస్తున్న వేళ..ఎన్నికల సంఘంపై పూర్తిగా అనుమానపు నీడలు అమలుకున్న తరుణంలోనే.. మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించడాన్ని పిరికి చర్యగానే చూడాల్సి వస్తుందంటున్నారు. ఇది అహంకార పూరిత చర్యగా కూడా భావిస్తున్నారు మరికొంత మంది. ఓ వైపు ప్రజా వ్యతిరేకత పెరుగుతున్న తరుణంలో.. ఢిల్లీ కేంద్రంగా ఆందోళనలు అట్టుడుకుతుంటే.. వాటిని బీజేపీ ఆటలో అరటిపండులా లైట్‌గా తీసుకోవడం అనే చర్య భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించేదిగానే ఉంటుందంటున్నారు.

Tags

Related News

గులాబీ ముల్లు.. కొణతం దిలీప్‌..! ఆయన చేతిలో బడానేత కీలుబొమ్మ.. దుందుడుకు మనస్తత్వానికి, పక్కదారి పట్టించే సలహాలు..!

యువనేత మరో కోణం.. నకిలీ బతుకుల ఫేక్ అకౌంట్లకు కేరాఫ్ అడ్రస్.. సోషల్ మీడియా చీకటి రాజ్యానికి తనో రారాజు…!

2022 ఆగస్టులో కొత్త పింఛన్లు పెంచిన కేసీఆర్.. సుధీర్ఘ కాలం తరువాత ఈ దసరాకు రేవంత్‌ సర్కార్‌..! 2.50లక్షల కొత్త ఫించన్లు..

తెలంగాణ కాంగ్రెస్‌లో నామినేటెడ్ పదవుల రచ్చ.. 15 నుండి 18 మందికి మళ్లీ ఛాన్స్?

వికారాబాద్ జిల్లాలో గుప్తనిధుల వేట.. మట్టి తవ్వుతుండగా ఊహించని ట్విస్ట్!

తెలంగాణ ప్రజలకు షాకింగ్ న్యూస్.. నవంబర్ నుంచి పెరగనున్న కరెంట్ బిల్లులు!

ఏడాది సస్పెన్షన్‌ వేటు పడనుందా? ఎథిక్స్‌ కమిటీ నివేదిక ఏం కోరనుంది..? పాడికి వివరణ ఇచ్చేందుకు రేపే చివరి చాన్స్‌….!

Big Stories

Advertisement
×