Delhi Protest: ఢిల్లీలో హైటెన్షన్ నెలకొంది. ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ జంతర్‌మంతర్ వద్ద ఇండియా కూటమి నేతలు చేపట్టిన నిరసన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. దీంతో ఈ ప్రదర్శనను పోలీసులు అడ్డుకుని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరితో పాటుగా పలువురు విపక్ష ఎంపీలను సైతం బలవంతంగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Also read: తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు సీఎం రేవంత్ బిగ్ గిఫ్ట్?
ప్రియాంక గాంధీ..
ఈ నిసనలో కేంద్రం, పోలీసుల తీరుపై విపక్ష నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతియుతంగా చేస్తున్న నిరసనను పోలీసులు అడ్డుకోడం దారుణం అని అన్నారు. ఈ నిరసన కార్యక్రమంలొ కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ (CEC) జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ, కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ వాద్రా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నడిరోడ్డుపై పడుకుని నిరసన తెలిపారు. దీంతో పోలీసులు ఆమే వద్దకు చేరుకుని అదుపులకి తీసుకునే ప్రయత్నం చేశారు. దీంతో ప్రింయాంక గాంధీ చుట్టూ ఉన్న కాంగ్రెస్ నాయకులు అందరూ కలిసి నిరసన వ్యక్తం చేశారు.
జంతర్ మంతర్ వైపు..
సర్ ప్రక్రియ రద్దు చేయాలనే డిమాండ్‌తో ఇండియా కూటమి ఢిల్లీలోచేపట్టిన ఆందోళనలు రణరంగాన్ని తలపించాయి. జనపథ్ లోని సాగర్ రత్న రెస్టారెంట్‌లో ఖర్గే అధ్యక్షతన లంచ్ మీటింగ్ తరువాత.. రాహుల్, ప్రియాంక నేతృత్వంలో స్ట్రీట్ ప్రొటెస్ట్‌ను లాంచ్ చేశారు. పర్మిషన్ లేదంటూ పోలీసులు అడ్డుకోవడం వాగ్వాదం వెరిసి హైటెన్షన్ క్రియేటైంది. 300 మంది ఎంపీలు, భారీగా తరలి వచ్చిన నేతలు, కార్యకర్తలతో జంతర్ మంతర్ వైపు వెళ్లేందుకు ప్రయత్నించారు. కానీ పోలీసులు వాళ్లను అడ్డుకున్నారు, నిరసనగా కాంగ్రెస్ ఎంపీలు బస్సులపై ఎక్కి నినాదాలు చేశారు. పోలీసుల వైఖరిని ఖండిస్తూ ప్రియాంక గాంధీ రోడ్డుపైనే కూర్చొని నిరసన తెలిపారు.
ఈసీ వర్గాలు క్లారిటీ..
సర్ ప్రక్రియలో అవకతవకలు ప్రజల అభ్యంతరాలపై ఈసీకి ఎందుకు వివరణ ఇవ్వదని ప్రశ్నించారు రాహుల్. క్లారిటీ ఇవ్వడానికి తాము సిద్దం కానీ, అధికారికంగా ఎవరూ తమ అపాయింట్ మెంట్ కోరలేదని ఈసీ వర్గాలు పేర్కొన్నాయి. ఇక అనుమతిలేకుండా ఆకాశవాణీ భవన్ లోకి ప్రవేశించారని రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీపై కూడా కేసు నమోదైంది. అదుపులోకి తీసుకున్న 17మందికి ఢిల్లీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఎవరికైనా శాంతియుతంగా నిరసన తెలిపే హక్కువుంటుంది. కానీ పోలీసుల విధి నిర్వహణను అడ్డుకోవడం సరికాదని వ్యాఖ్యానించింది కోర్టు.
దద్దరిల్లిన ఢిల్లీ..
ఢిల్లీ కోర్టు 17 మందికి బెయిల్ మంజూరు చేసింది. శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు ఉందని.. అయితే పోలీసులపై హింసకు పాల్పడటం అంగీకారయోగ్యం కాదని కోర్టు పేర్కొంది. డే1 మాదిరే డే2 కూడా ఇండియా కూటమి ఆందోళనలు, నిరసనలతో ఢిల్లీ దద్దరిల్లింది. ఖర్గే, రాహుల్, ప్రియాంక సహా ఇండియా కూటమి నేతలు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాల్సిందే.. సర్ ప్రక్రియను రద్దు చేయాల్సిందే.. అంతవరకు వెనక్కి తగ్గేదేలేదన్నారు ఇండియా కూటమి నేతలు డిమాండ్ చేశారు.
Tags

Share