E-Paper
Advertisement

ముగ్గురమ్మాయిలతో బలవంతంగా అలాంటి పనులు… ఓటీటీలోకి వచ్చేస్తున్న వివాదల సోషల్ థ్రిల్లర్

ముగ్గురమ్మాయిలతో బలవంతంగా అలాంటి పనులు… ఓటీటీలోకి వచ్చేస్తున్న వివాదల సోషల్ థ్రిల్లర్
Advertisement

The Kerala Story 2 OTT : ఓటీటీలోకి ఎన్నో వివాదాలతో సంచలనం సృష్టించిన ‘ది కేరళ స్టోరీ 2’ వచ్చేస్తోంది. ఈ సినిమా ఫిబ్రవరి 27న థియేటర్లలో మిక్స్‌డ్ టాక్ తో నడిచింది. పార్ట్ వన్ మూవీ అంత విజయం అందుకోక పోయినా, సినిమాను మాత్రం ఓటీటీలో చూసేందుకు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నారు ప్రేక్షకులు. ఇది ముందుగా అనుకున్నట్లు మే 8 న ఇది రిలీజ్ అవ్వాల్సి ఉంది. మేకర్స్ అనౌన్స్ చేయడం కూడా జరిగింది. అయితే ఇప్పుడు డేట్ మార్చి ఒక వారం ముందుగానే ఓటీటీలోకి తీసుకొస్తున్నారు. ఇది తెలుగుతో పాటు మొత్తం ఐదు భాషల్లో అందుబాటులోకి వస్తోంది. ఈ సినిమా విడుదలకు ముందే కేరళలో పెద్ద ఎత్తున నిరసనలు జరిగాయి. మత విద్వేషాలను ప్రేరేపించేలా ఉందంటూ పలువురు కోర్టుకు కూడా వెళ్లారు. దీంతో సినిమా విడుదలపై కేరళ హైకోర్టు స్టే విధించింది. ఆ తరువాత వాదనలు విన్న కోర్ట్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో, ఇది థియేటర్లలోకి వచ్చింది. ఇప్పుడు ఓటీటీ ఆడియన్స్ ను కూడా పలకరించబోతోంది. దీనిని ఎక్కడ చూడచ్చు ? దీని కథ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే…

ఎక్కడ చూడచ్చు అంటే 

ఆదా శర్మ ప్రధాన పాత్రలో నటించిన ‘ది కేరళ స్టోరీ’ గతేడాది సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది దానికి సీక్వెల్ గా వచ్చిన సినిమానే ‘ది కేరళ స్టోరీ 2’ (The Kerala Story 2). జీ5లో ఈ సినిమా స్ట్రీమింగ్ కి వస్తోంది. ఇప్పటికే మే 8 నుంచి రాబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కానీ ఎందుకనో వారం రోజులు ముందుగానే, అంటే మే 1 నుంచి ఇది ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఇందులో ఆదా శర్మతో పాటు, ఉల్కా గుప్తా, అదితి భాటియా, ఐశ్వర్య ఓజా ప్రధాన పాత్రల్లో నటించారు. అయితే ఫస్ట్ పార్ట్ రూ. 300 కోట్లకు పైగా వసూలు చేయగా, సీక్వెల్ ‘ది కేరళ స్టోరీ’ 2 మాత్రం కలెక్షన్స్‌ లో నిరాశపరిచింది. కేవలం 60 కోట్ల కలెక్షన్స్‌తోనే సరిపెట్టుకుంది. దీన్ని హిందీతో పాటు తెలుగు, కన్నడ, మలయాళం, తమిళం భాషల్లోనూ ఏంచెక్కా చూసేయచ్చు.

స్టోరీ ఏమిటంటే  

Advertisement

సురేఖ (ఉల్కా గుప్త), దివ్య (అదితి భాటియా), నేహా (ఐశ్వర్యా ఓజా) అనే ముగ్గురు హిందూ యువతుల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఒక్కొక్కరు ఒక్కో ప్రొఫెషన్ లో కలలు కంటూ ఉంటారు. కేరళ అమ్మాయి అయిన సురేఖ, జర్నలిస్ట్ సలీమ్ (సుమిత్ గహ్లావత్)తో సహ జీవనం చేస్తుంది. ఆమె సివిల్స్ కి కూడా ప్రిపేర్ అవుతుంటుంది. మరో వైపు దివ్య సోషల్ ఇన్‌ఫ్లుయెన్సర్‌గా ఉంటే, అదే సమయంలో ఆమె రషీద్ (యుక్తమ్)తో ప్రేమలో పడుతుంది. ఇంకో పక్క నేహా స్పోర్ట్స్ లో తన కల జావెలిన్ త్రో ఒలంపిక్స్ వెళ్లాలనుకుంటుంది. అయితే ఆమె కూడా మరో వ్యక్తి మాయలో పడిపోతుంది. పేరెంట్స్ ఎంత చెప్పినా వినకుండా వాళ్ళు ఆ అబ్బాయిలతో వెళ్లిపోతారు. ఆ తరువాత అసలు కథ ఉంటుంది. మత మార్పిడితో మొదలయ్యే వీళ్ళ జీవితాలు, శారీరకంగా కూడా చెప్పుకోలేనంత నరకం అనుభవిస్తారు. పక్కా ప్లాన్ తో మోసాగించారని తెలిసి వీళ్ళు విలవిల లాడిపోతారు. చివరకు వీళ్ళు ఆ నరకం నుంచి బయట పడ్డారా ? వీళ్ళ జీవితాలు ఏమయ్యాయి ? అనే విషయాలను ఈ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.

Read Also : గతం వెతుకుతూ గత్తర లేపే జోంబీ డిటెక్టివ్… కామెడీతో కేక పెట్టించే ఇన్వెస్టిగేషన్

Tags

Related News

మనుషుల్ని చీమల్లా మార్చే వైరస్… వణుకు పుట్టించే కొరియన్‌ జాంబీ థ్రిల్లర్‌

సింగిల్‌ లైఫ్‌ ఎంజాయ్‌ చేద్దామనుకుంటే… ప్రేమ, పెళ్లి గోలతో కొత్త చిక్కులు… ఓటీటీలోకి రొమాంటిక్‌ కామెడీ

సామాన్యులపై జరిగే దోపిడీని కళ్లకు కట్టిన క్రైమ్‌ థ్రిల్లర్‌… పోలీస్ వ్యవస్థ బాగోతం బట్టబయలు

న్యాయంపై నమ్మకం పోయిన లాయర్‌… ఓ అనుమానాస్పద మరణంతో మారిన కథ… క్రైమ్‌ థ్రిల్లర్‌ స్ట్రీమింగ్

చిన్న వయసులోనే పెద్ద టార్గెట్‌… హాకీ కోసం ఇంత కష్టమా భయ్యా… ఓటీటీలోకి ఇంట్రెస్టింగ్ స్పోర్ట్స్‌ డాక్యుమెంటరీ

చిన్న స్థాయి నుంచి మ్యూజిక్‌ సెన్సేషన్‌గా… కోట్లాది హృదయాలను గెలిచిన సింగర్ స్టోరీ

జైలు నుంచి వచ్చి మాఫియా సామ్రాజ్యాన్ని నిర్మించే డాన్‌… నాలుగో సీజన్‌ రచ్చ రచ్చ

కొత్త ఇంట్లో అడుగుపెట్టిన ఫ్యామిలీ… గోడల వెనుక దాగిన భయంకరమైన రహస్యం… వెన్నులో వణుకు పుట్టించే హారర్‌ థ్రిల్లర్‌

Big Stories

Advertisement
×