E-Paper
Advertisement

ల్యాప్‌టాప్ క్లీన్ చేస్తున్నారా? ఈ తప్పులు చేస్తే వేల రూపాయలు నష్టపోతారు!

ల్యాప్‌టాప్ క్లీన్ చేస్తున్నారా? ఈ తప్పులు చేస్తే వేల రూపాయలు నష్టపోతారు!
Advertisement

laptop keyboard cleaning mistakes:ప్రస్తుత కాలంలో ల్యాప్‌టాప్ అనేది అందరి జీవితంలో ఒక భాగమైపోయింది. ఆఫీస్ వర్క్, ఆన్‌లైన్ క్లాసులు లేదా ఎంటర్‌టైన్‌మెంట్.. ఇలా ప్రతి దానికీ ల్యాప్‌టాప్‌ను గంటల తరబడి వాడుతుంటాం. ఈ క్రమంలో దీని కీబోర్డ్ మధ్యలో దుమ్ము, ధూళి, కొన్ని సార్లు ఫుడ్ కు సంబంధించిన అవశేషాలు పేరుకుపోతాయి. దీన్ని క్లీన్ చేయాలని చాలా మంది తొందరపడి కొన్ని ప్రమాదకరమైన పనులు చేస్తుంటారు. దీని వల్ల కీబోర్డ్ దెబ్బతిని సర్వీస్ సెంటర్‌కు వెళ్లాల్సి వస్తుంది. అలా జరగకుండా ఉండాలంటే.. క్లీన్ చేసేటప్పుడు ఎలాంటి తప్పులు చేయకూడదో తెలుసుకుందాం.

1. లిక్విడ్ లేదా వాటర్ స్ప్రే చేయడం:

చాలా మంది జిడ్డు వదలాలని కీబోర్డ్ మీద నేరుగా నీళ్లు లేదా విండో క్లీనర్లను స్ప్రే చేస్తుంటారు. ఇది చాలా పెద్ద తప్పు. ల్యాప్‌ టాప్ కీబోర్డ్ లోపలి భాగం ఎలక్ట్రానిక్ సర్క్యూట్లతో కూడుకుని ఉంటుంది. లోపలికి నీరు వెళితే మదర్‌ బోర్డ్ లేదా కీబోర్డ్ షార్ట్ సర్క్యూట్ అయిపోతుంది. ఇలాంటి సమయలో దీనిని రిపేర్ చేయించాలంటే రూ.3,000 నుంచి రూ.8,000 వరకు ఖర్చు కావొచ్చు.

2. ల్యాప్‌టాప్‌ ఆన్ చేసి క్లీన్ చేయడం:

Advertisement

ల్యాప్‌టాప్ రన్నింగ్‌లో ఉన్నప్పుడు కీబోర్డ్‌ను తుడవడం లేదా బ్రష్‌తో రుద్దడం వంటివి మాత్ర అస్సలు చేయకూడదు. పొరపాటున ఏదైనా కీ ప్రెస్ అయ్యి ముఖ్యమైన ఫైల్స్ డిలీట్ అవ్వొచ్చు లేదా సిస్టమ్ క్రాష్ అయ్యే ఛాన్స్ ఉంది. క్లీన్ చేసే ముందు ఎప్పుడూ ల్యాప్‌ టాప్‌ను పూర్తిగా షట్ డౌన్ చేసి, పవర్ కేబుల్ తొలగించాలి.

3.హెయిర్ డ్రైయర్ వాడటం :

కీబోర్డ్ మధ్యలో ఉన్న దుమ్మును బయటకు నెట్టడానికి హెయిర్ డ్రైయర్‌ను వేడి గాలితో అస్సలు వాడకూడదు. ఈ వేడికి కీబోర్డ్ ప్లాస్టిక్ కీస్ కరిగిపోయే.. ప్రమాదం ఉంది. ఒకవేళ వాడాల్సి వస్తే.. కూల్ ఎయిర్ మోడ్ లేదా కంప్రెస్డ్ ఎయిర్ క్యాన్లను మాత్రమే ఉపయోగించాలి.

4.షార్ప్ ఆబ్జెక్ట్స్ లేదా సూదులు :

Advertisement

కీస్ మధ్యలో ఉన్న ఇరుకైన చోట్ల చెత్తను తీయడానికి సూదులు, సేఫ్టీ పిన్లు లేదా కత్తులు వాడటం చాలా డేంజర్. దీని వల్ల కీస్ కింద ఉండే రబ్బర్ ప్యాడ్లు చిరిగిపోవడం లేదా కీబోర్డ్ ప్యానెల్ స్క్రాచ్ అవ్వడం జరుగుతుంది.

Also Read: జిమ్,ఆఫీసులకు బెస్ట్.. టాప్ 5 పోర్టబుల్ బ్లెండర్లు ఇవే!

క్లీనింగ్ కోసం వాడాల్సినవి:

క్లీనింగ్ జెల్స్ / మైక్రోఫైబర్ క్లాత్: మార్కెట్‌లో లభించే మైక్రోఫైబర్ క్లాత్‌ను కొద్దిగా ఐసోప్రొఫైల్ ఆల్కహాల్‌తో తడిపి (అది కూడా క్లాత్ తడి ఉండకూడదు, కేవలం తేమ మాత్రమే ఉండాలి) మెల్లగా తుడవాలి. దీని ధర మార్కెట్‌లో సుమారు రూ.200 నుంచి రూ.400 వరకు ఉంటుంది.

కీబోర్డ్ జెల్ / క్లీనింగ్ పుట్టీ: దుమ్మును ఈజీగా పీల్చుకునే క్లీనింగ్ జెల్ ధర సుమారు రూ 150-రూ. 300 మధ్య లభిస్తుంది. ఇది కీబోర్డ్‌ను సేఫ్‌గా క్లీన్ చేస్తుంది.

ఒక చిన్న అజాగ్రత్త ల్యాప్‌ టాప్‌ను శాశ్వతంగా పాడు చేస్తుంది. కాబట్టి ల్యాప్‌టా ప్ కీబోర్డ్‌ను శుభ్రం చేసేటప్పుడు ఈ పొరపాట్లను నివారించి, సరైన పద్ధతులను పాటిస్తే.. మీ ల్యాప్‌టాప్ ఎక్కువ కాలం పాడవకుండా ఉంటుంది. వేల రూపాయల రిపేర్ ఖర్చు కూడా మిగులుతుంది.

Related News

డార్క్ మోడ్‌లో ఫోన్ వాడితే ఛార్జింగ్ సేవ్ అవుతుందా? తెలిస్తే షాక్ అవుతారు

ఫోన్ స్విచ్ ఆఫ్ ఉన్నా వాట్సాప్ మెసేజ్ వెళ్తుంది! వాట్సాప్ నుంచి మరో కిర్రాక్ అప్‌డేట్!

రూ.వెయ్యిలోపు బెస్ట్ ఇయర్‌బడ్స్! సేల్‌లో సగం ధరకే..

BSNL నుంచి మరో చౌకైన ప్లాన్.. రూ. 202 కే 32 రోజుల వ్యాలిడిటీ.. అదిరిపోయే బెనిఫిట్స్ మామ!

సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు ఎగిరి గంతేసే న్యూస్! ఇక నుంచి కోడింగ్,ఫైనాన్స్ పనులు చిటికెలో!

ఏఐ బాట్స్ డేంజర్ జోన్..శాస్త్రవేత్తల పరిశోధనలో షాకింగ్ నిజాలు!

జియో ఫైబర్ బంపర్ ఆఫర్..ఏడాది రీఛార్జ్‌పై 4 నెలలు ఫ్రీ ఇంటర్నెట్!

ఇదేందయ్యా ఇదీ..సేల్‌లో చిమ్నీల రేట్లు ఇంత తక్కువగా ఉన్నాయ్!

Big Stories

Advertisement
×