OTT Movie : అందమైన మౌంటైన్ విజువల్స్ తో, ఒక హాలీవుడ్ సర్వైవల్ థ్రిల్లర్ సినిమా ఆడియన్స్ ని ఆకట్టుకుంటోంది. మౌంటైన్ క్లైంబింగ్ సీన్స్ కి ప్రశంసలు కూడా వచ్చాయి. ఇందులో ఇద్దరమ్మాయిలు మౌంటైన్ క్లైంబింగ్ కు వెళ్ళినప్పుడు, నలుగురు అబ్బాయిల చేతిలో దారుణంగా హంట్ అవుతారు. ఈ సన్నివేశాలు ప్రేక్షకులను టెన్షన్ లో పడేస్తుంటాయి. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.
‘The Ledge’ 2022లో విడుదలైన యాక్షన్-థ్రిల్లర్ చిత్రం. దీనిని హోవార్డ్ J. ఫోర్డ్ డైరెక్ట్ చేశారు. ఇందులో బ్రిటనీ ఆష్‌వర్త్ (కెల్లీ), బెన్ లాంబ్ (జోష్), లూయిస్ బోయర్ (నాథన్), నాథన్ వెల్ష్ (రేనాల్డ్స్), అనైస్ పరెల్లో (సోఫీ) ప్రధాన పాత్రల్లో నటించారు. 1 గంట 26 నిమిషాలు రన్‌టైమ్ ఉన్న ఈ సినిమా IMDb రేటింగ్: 5.2/10 రేటింగ్ పొందింది. ఈ చిత్రం 2022 ఫిబ్రవరి 18న థియేట్రికల్ రిలీజ్ అయింది. ఆ తర్వాత అమెజాన్ ప్రైమ్ వీడియో, హులు, నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.
ఈ కథ ఇటలీలోని డోలమైట్స్‌లోని మౌంట్ అంటెలావో వద్ద జరుగుతుంది. ఇక్కడ కెల్లీ, సోఫీ అనే ఇద్దరు స్నేహితులు ఒక క్లైంబింగ్ ఎక్స్‌పెడిషన్‌కు వెళ్తారు. కెల్లీ ప్రియుడు ఒక సంవత్సరం క్రితం అదే పర్వతంపై మరణించిన జ్ఞాపకార్థంగా వీళ్ళు ఈ ట్రిప్ కు ప్లాన్ చేస్తారు. వాళ్లు అక్కడ ఒక క్యాబిన్ రెడీ చేసుకుంటుండగా, జోష్ జాక్, రేనాల్డ్స్, టేలర్ అనే అమెరికన్ స్నేహితులు వస్తారు. వాళ్ళు క్యాంప్‌ఫైర్ వద్ద సమయం గడపాలని అనుకుంటారు.
జోష్ చూడటానికి కొంచెం డిఫరెంట్ గా కనిపిస్తాడు. అతని ఫ్రెండ్స్ అతనితో గతంలో ఒక క్రూరమైన క్రైమ్‌లో ఇన్వాల్వ్ అయిన కారణంగా ఇప్పటికీ అతనితో ఉంటారు. రాత్రి క్యాంప్‌ఫైర్ వద్ద అందరూ కలిసి డ్రింక్ చేస్తారు. కానీ సోఫీ జోష్‌తో ఫ్లర్ట్ చేస్తూ ఎక్కువగా తాగుతుంది. కెల్లీ క్యాబిన్‌కు వెళ్లిపోయిన తర్వాత, సోఫీపై జోష్ అఘాయిత్యానికి ప్రయత్నిస్తాడు. సోఫీ తప్పించుకోవడానికి ఒక చిన్న రాక్‌ఫేస్ ఎక్కుతుంది. కానీ జోష్ ఆమెను అనుసరించి, ఆమెను గాయపరిచి, ఆ తర్వాత రాయితో కొట్టి చంపేస్తాడు. కెల్లీ ఈ ఘటనను వీడియో కెమెరాలో రికార్డ్ చేస్తుంది. కానీ ఆమె చేసిన సౌండ్ వల్ల జోష్ గ్రూప్ ఆమెను గమనిస్తుంది. ఆమె కెమెరాను తీసుకోవడానికి, ఆమెను చంపడానికి వాళ్లు కెల్లీని వెంబడిస్తారు.
కెల్లీ తన క్లైంబింగ్ స్కిల్స్ ఉపయోగించి పర్వతం ఎక్కడం ప్రారంభిస్తుంది. ఆమె క్లైంబింగ్ లో అనుభవం ఉండటంతో వాళ్లు ఆమెను రాక్‌ఫేస్‌పై పట్టుకోలేక పోతారు. కానీ జోష్ గ్రూప్ ఒక ఈజీ టూరిస్ట్ ట్రయిల్ ద్వారా టాప్‌కు చేరుకుని, కెల్లీని ఒక ఓవర్‌హ్యాంగింగ్ లెడ్జ్ కింద ట్రాప్ చేస్తారు. ఆమె కొండ చివర ఒక గృహలో ఉంటుంది. ఇక్కడ నుండి కథ స్టాగ్నేట్ అవుతుంది. కెల్లీ లెడ్జ్ కింద ఉండగా, జోష్, అతని ఫ్రెండ్స్ ఆమెను బ్యాగ్‌తో కొట్టడం, రాళ్లు విసరడం, ఆమె పోర్టలెడ్జ్‌పై మూత్రం విసరడం లాంటి క్రూరమైన ప్రయత్నాలు చేస్తారు.
ఇంతలో జోష్ తన సొంత ఫ్రెండ్స్‌ను కూడా చంపడం మొదలు పెడతాడు. ఆమెను పట్టుకోవడానికి నాథన్‌ను క్లిఫ్ నుండి తోసేస్తాడు. రేనాల్డ్స్‌ను గన్ తో కాల్చేస్తాడు. చివరికి జోష్ కెల్లీ వద్దకు రోప్‌తో దిగుతాడు. కెమెరాను అడుగుతాడు. కెల్లీ అతనికి కెమెరా ఇస్తుంది. కానీ మెమరీ కార్డ్ తీసేసి ఒక రాక్ క్రాక్‌లో దాచుతుంది. జోష్ ఆ కార్డ్ తీయడానికి ట్రై చేస్తే, ఒక స్నేక్ అతన్ని కాటేస్తుంది. ఇక జోష్ పరిస్థితి ఏమవుతుంది ? చివరికి కెల్లీ కొండపైకి చేరుకుంటుందా ? ఈ కథ ఎండింగ్ ఎలా ఉంటుంది ? అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే ఈ సినిమాను మిస్ కాకుండా చూడండి.
Read Also : ఇల్లీగల్ గా పోలీసయ్యే క్రిమినల్… గిలిగింతలు పెట్టే ట్విస్టులు… ఓటీటీలోకి తమిళ సిరీస్ ఎంట్రీ