దక్షిణ మధ్య రైల్వే(SCR) హైదరాబాద్- బెంగళూరు యశ్వంత్ పూర్ వందే భారత్ ఎక్స్ ప్రెస్ సర్వీసులను శుక్రవారం నిలిపివేయాలని తీసుకున్న నిర్ణయం పట్ల ప్రయాణీకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రెండు టెక్ నగరాల మధ్య నడిచే ఈ రైలుకు శుక్రవారం నాడు మంచి డిమాండ్ ఉంటుంది. ఆ రోజు ఎక్కువ మంది బెంగళూరు, హైదరాబాద్ మధ్య రాకపోకలు కొనసాగిస్తారు. గతంలో ఈ రైలుకు బుధవారం విరామం ఉండగా, ఇప్పుడు ఆ విరామాన్ని శుక్రవారానికి మార్చారు. ఈ నిర్ణయం పట్ల ప్రయాణీకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
నిజానికి హైదరాబాద్- బెంగళూరు యశ్వంత్ పూర్ రైలు ప్రారంభం నుంచి మంచి ఆక్యుపెన్సీ ఉండేది. ఒకానొక సమయంలో 150 శాతం ఆక్యుపెన్సీ ఉండేది. 8 కోచ్ లతో ప్రారంభం అయిన ఈ రైలు ఇప్పుడు 16 కోచ్ లకు పెంచారు. ప్రస్తుతం, ఇది 85 శాతం ఆక్యుపెన్సీతో నడుస్తుంది. హైదరాబాద్- బెంగళూరు మధ్య వారాంతపు ప్రయాణం కోసం చాలా మంది ప్రయాణీకులు రైలుపై ఆధారపడుతున్నారు. శనివారం, ఆదివారం కలిసి వస్తుందని.. కొంతమంది శుక్రవారమే బయల్దేరుతారు. ఇప్పుడు సౌత్ సెంట్రల్ రైల్వే తీసుకున్న నిర్ణయంతో చాలా మందికి ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో చాలా మంది ప్రయాణీకులు రైల్వే తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
హైదరాబాద్- బెంగళూరు యశ్వంత్ పూర్ రైలును శుక్రవారం రద్దు చేయడం పట్ల ప్రయాణీకుల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది. “కొంతమంది రైల్వే వ్యక్తులు ప్రైవేట్ బస్సు వాళ్లతో కలిసి ప్రయాణీకులను దోపిడీ చేయాలని నిర్ణయించారు. లేకపోతే శుక్రవారం నాడు బెంగళూరు- హైదరాబాద్ వందేభారత్ రైలును నడపకూడని నిర్ణయిస్తారా?” అంటూ ఓ ప్రయాణీకుడు నిప్పుడు చెరిగాడు. “ఈ రైలు వారాంతాల్లో ఇంటికి చేరుకోవడానికి మరింత సౌకర్యవంతంగా ఉండేది. కానీ, ఇప్పుడు నేను బస్సులలో వెళ్ళవలసి వస్తుంది. శుక్రవారం సర్వీసులు తిరిగి ప్రారంభిస్తే చాలా మంది ఉపయోగకరంగా ఉంటుంది” అని బిపిఓ ఉద్యోగి రాజీవ్ రాజ్ కుమార్ అన్నారు. అటు “నేను మార్నింగ్ షిఫ్ట్ ముగించుకుని, శుక్రవారం హైదరాబాద్ చేరుకుని వీకెండ్ లో మా ఫ్యామిలీతో గడిపేది. కానీ ఇప్పుడు బస్సు తప్ప మరో మార్గం లేదు” అని సునీతా యాదవ్ అనే టెక్ ఉద్యోగి ఆవేదన వ్యక్తం చేసింది.
అటు వీకెండ్స్ డో హైదరాబాద్- బెంగళూరు మధ్య తెలంగాణ ఆర్టీసీ 40 బస్సులను నడుపుతుంది. కానీ, శుక్రవారం నుంచి బస్సులకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో డైనమిక్ ఛార్జీలను అందుబాటులోకి తీసుకొస్తుందని టూరిస్ట్ బస్సు యజమానుల సంఘం నాయకుడు మహమ్మద్ సలీమ్ వెల్లడించారు. అటు ప్రయాణీకుల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతున్న నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే ఈ సర్వీసు విరామాన్నిశుక్రవారం నుంచి మళ్లీ బుధవారానికి మార్చాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
Read Also: ఏంటీ.. మన బుల్లెట్ ట్రైన్‌కు అడ్వన్స్ బుకింగ్ ఉండదా? మరి రైలు ఎక్కేది ఎలా?