OTT Movie : నవ్వడం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం, నవ్వలేకపోవడం ఒక రోగం అన్నారు పెద్దలు. నవ్వు అనేది మనిషికి మాత్రమే ఉండే ఒక ఆరుదైన వరం. ఆ నవ్వు లేకపోతే మనిషి లైఫ్ ఎలా ఉంటుందో ఊహించుకోలేం. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీలో కూడా నవ్వుకు సంబంధించిన కంటెంట్ తో ప్రేక్షకులను అలరించింది. ఈ ఫాంటసీ థ్రిల్లర్ మూవీ పేరేమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో
ఈ హాలీవుడ్ ఫాంటసీ థ్రిల్లర్ మూవీ పేరు ‘ది లెజెండ్ ఆఫ్ టిమ్ థాలర్‘ (The Legend of Timm Thaler). అనాథ యువకుడైన టిమ్ థాలర్ తన చిరునవ్వును ఒక రహస్యమైన బారన్‌కు అమ్ముతాడు. ప్రతిగా, అతను అప్పటి నుండి అన్ని పందాలలో గెలిచి డబ్బులు కూడా సంపాదిస్తాడు. అయితే త్వరలోనే తన చిరునవ్వు లేకుండా అతను మరింత అసంతృప్తికి గురవుతున్నాడని తెలుసుకుంటాడు. అప్పుడు టిమ్ తన స్నేహితులతో కలిసి తన చిరునవ్వును తిరిగి పొందేందుకు ప్రయత్నిస్తాడు. ఈ ఫాంటసీ థ్రిల్లర్ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీ లోకి వెళితే
టిమ్ అనే కుర్రాడు ఎప్పుడూ నవ్వుతూనే ఉంటాడు. అతని నవ్వు చూసి పక్క వాళ్ళు కూడా నవ్వుతూ ఉంటారు. అంతలా అతని మొహం లో చిరునవ్వు ఎప్పుడూ ఉంటుంది. వీళ్లది పూర్ ఫ్యామిలీ కావడంతో, ఎలాగైనా డబ్బున్న వ్యక్తులుగా మారాలని అనుకుంటూ ఉంటారు. తండ్రితో కలసి గుర్రపు పందాలు కాస్తూ ఉంటాడు టిమ్. అయితే వీళ్ళు పందెంలో ఎప్పుడూ ఓడిపోతూనే ఉంటారు. ఒకరోజు టిమ్ తండ్రి అకస్మాత్తుగా చనిపోతాడు. తరువాత తండ్రి లేకపోవడంతో, టిమ్ ఒంటరిగా బాధపడుతూ ఉంటాడు. అతని దగ్గరికి ఒక స్ట్రేంజర్ వచ్చి ఒక అగ్రిమెంట్ చేయించుకుంటాడు. అదేమంటే అతని చిరునవ్వును తనకు ఇస్తే, బెట్ వేసే ప్రతి పందెం నువ్వు గెలుస్తావని చెప్తాడు. టిమ్ దీనికి ఒప్పుకొని అగ్రిమెంట్ మీద సైన్ కూడా చేస్తాడు. అంతటితో టిమ్ తన నవ్వుని కోల్పోతాడు.
అయితే ఆడిన ప్రతి పందెం టిమ్ గెలుస్తూ ఉంటాడు. కొద్ది రోజులలోనే బాగా డబ్బులు సంపాదించి ధనవంతుడు అవుతాడు. నవ్వును మాత్రం వెనక్కి తెచ్చుకోలేక పోతాడు టిమ్. తన నవ్వును వెనక్కి తెచ్చుకోవడానికి, టిమ్ కి తన ప్రియురాలు ఒక ఉపాయం చెబుతుంది. చివరికి టిమ్ తన నవ్వుని తిరిగి తెచ్చుకుంటాడా? ప్రియురాలు టిమ్ కు చెప్పిన ఉపాయం ఏమిటి? ఇంతకీ అగ్రిమెంట్ రాయించుకున్న వ్యక్తి ఎవరు? ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఓటిటి ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతున్న ‘ది లెజెండ్ ఆఫ్ టిమ్ థాలర్’ (The Legend of Timm Thaler) అనే ఈ మూవీని మిస్ కాకుండా చూడండి.