OTT Movie : ఓటిటి ప్లాట్ ఫామ్ లోకి బెంగాల్ నుంచి, మంచి కంటెంట్ ఉన్న స్టోరీలు స్ట్రీమింగ్ కి వస్తున్నాయి. భారీ బడ్జెట్లో కాకపోయినా, తీసే విధానం చక్కగా ఉంటుంది. సామాన్య ప్రేక్షకులకు అర్థమయ్యే రీతిలో వస్తున్న ఈ సినిమాలు, ప్రేక్షకులను బాగానే అలరిస్తున్నాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీలో పెళ్లి చూపులకు వచ్చిన వ్యక్తికి, ఒక చిన్న స్టోరీ చెప్పి బుద్ధి వచ్చేలా చేస్తుంది ఒక అమ్మాయి. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…
జి ఫైవ్ (Zee5) లో
ఈ బెంగాల్ మూవీ పేరు ‘ది లవ్లీ మిసెస్ ముఖర్జీ‘ (The lovely Mrs Mukherjee). ఈ మూవీకి ఇంద్రనీల్ దర్శకత్వం వహించాడు. ఒక మేకప్ ఆర్టిస్ట్ తన కాబోయే వరుడిని కలవడానికి అయిష్టంగానే వెళ్తుంది. అతని స్వభావాన్ని గ్రహించిన ఆమె, శ్రీమతి ముఖర్జీ కథను చెప్పి అతనికి గుణపాఠం చెప్పాలనుకుంటుంది. ఈ మూవీ జి ఫైవ్ (Zee5) లో స్ట్రీమింగ్ అవుతుంది.
స్టోరీ లోకి వెళితే
మౌరి ఫిల్మ్ ఇండస్ట్రీలో మేకప్ ఆర్టిస్ట్ గా పనిచేస్తుంది. పెళ్లి వయసు దాటిపోతుండటంతో, తల్లి ఒక సంబంధం తీసుకువస్తుంది. మౌరితో గట్టిగా మాట్లాడి పెళ్లికొడుకుని కలవమని చెప్తుంది. అయితే మౌరి తను చేసే ప్రొఫెషన్ ను, పెళ్లి తర్వాత కూడా కంటిన్యూ చేయాలనుకుంటుంది. ఈ విషయం మీద అతనితో మాట్లాడాలని ఒక కాఫీ షాప్ కి వస్తుంది. అక్కడికి వచ్చిన పెళ్ళికొడుకుకి, పెళ్లైన అమ్మాయి ఇంట్లోనే ఉండాలనే మనస్తత్వం కలవాడు అయిఉంటాడు. అది తెలుసుకొని మౌరి అతనికి ఒక స్టోరీ చెప్పడం మొదలు పెడుతుంది. కాళిదాస్ నోబెల్ ప్రైజ్ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. అతడు రవీంద్రనాథ్ ఠాగూర్ లా ఒక గ్రంథాన్ని రాయాలనుకుంటాడు. ఈ క్రమంలోనే ఒక కావ్యాన్ని రాస్తూ ఉంటాడు. అయితే అతని తల్లి చనిపోవడంతో, పెళ్లి మీద ఇంట్రెస్ట్ లేకపోయినా వండి పెట్టడానికి ఒక మనిషి కావాలి కాబట్టి, పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. అలా మీను అనే మహిళని పెళ్లి చేసుకుంటాడు. ఈమె సంగీత పాటలు చెప్పి ఇంటిని పోషిస్తూ ఉంటుంది. పెదింటి అమ్మాయి కావడంతో ఎదురు కట్నంగా 5 లక్షలు ఇచ్చి మరీ పెళ్లి చేసుకుంటాడు. అత్తగారింటికి వచ్చిన మీనుకి, భర్త దగ్గర ఆ ముచ్చట తీర కుండానే ఉంటుంది. ఆ విషయంలో కాళిదాసుకి ఇంట్రెస్ట్ ఉండదు. ఒకరోజు కాళిదాసుకి క్యాన్సర్ ఉందని తెలుస్తుంది. ఆ కావ్యాన్ని రాయడానికి ఇంకా రెండు సంవత్సరాలు సమయం పడుతుంది. మూడు నెలలలోనే చనిపోతాడని డాక్టర్లు చెబుతారు.
అయితే ఏ ఐ ద్వారా అతని మైండ్ ని కాపీ చేసి, ఆ గ్రంధాన్ని రాయచ్చు అంటూ కాళిదాస్ ఫ్రెండ్ అయిన ఒక సైంటిస్ట్ చెబుతాడు. అలా భార్యకి, తన ఫ్రెండ్ కి తన ఆస్తి మీద హక్కులు ఇస్తూ, ఆ ప్రయోగానికి ఒప్పుకుంటాడు. కాళిదాస్ చనిపోయిన తర్వాత, అచ్చు కాళిదాసులా మాట్లాడుతున్న కంప్యూటర్ ని కాళిదాస్ ఫ్రెండ్ తయ్యారు చేస్తాడు. మీను దానిని ఇంటికి తీసుకువెళుతుంది. అప్పుడు ఆ కంప్యూటర్ మీనుతో ఇదివరకులా మాట్లాడుతుంది. ఇంతలోనే మీను దగ్గరికి, ఒకప్పుడు కాళిదాస్ కి అసిస్టెంట్ గా పని చేసిన వ్యక్తి వస్తాడు. కాళిదాస్ కంప్యూటర్ బొమ్మ ముందరే, వీళ్ళిద్దరూ ఏకాంతంగా గడుపుతారు. అప్పుడు కాళిదాస్ అసిస్టెంట్, కంప్యూటర్ కి సారీ చెప్తాడు. అతనికి కావ్యం తప్పించి, భార్య అవసరం లేదు అని, సారీ కూడా చెప్పనవసరం లేదని అంటుంది మీను. ఈ స్టోరీ మౌరి, రాజ్ కు చెప్తుంది. అయితే రాజ్ మరో మారు మాట్లాడకుండా అక్కడినుంచి వెళ్ళిపోతాడు. డైరెక్ట్ గా చెప్పలేక, నీతో జీవితం పంచుకుంటే ఇలానే ఉంటుందని, ఇన్ డైరెక్ట్ గా చెప్తుంది మౌరి. ఈ మూవీని మీరు కూడా చూడాలనుకుంటే, జి ఫైవ్ (Zee5) లో స్ట్రీమింగ్ అవుతుంది.