BigTV English

Rushikonda Beach: రుషికొండ బీచ్‌కు షాక్.. బ్లూ ఫ్లాగ్‌ గుర్తింపు రద్దు వెనుక

Rushikonda Beach: రుషికొండ బీచ్‌కు షాక్.. బ్లూ ఫ్లాగ్‌ గుర్తింపు రద్దు వెనుక

Rushikonda Beach: విశాఖలోని రుషికొండ బీచ్‌ ‘బ్లూ ఫ్లాగ్‌’ గుర్తింపు కోల్పోయింది. ఈ బీచ్‌కు బ్లూ ఫ్లాగ్‌ గుర్తింపు ఉపసంహరణపై ప్రభుత్వం సీరియస్‌ అయ్యింది. వెంటనే పునరుద్ధరణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. అయితే ఈ వివాదంపై ఏపీ ప్రభుత్వం క్లారిఫికేషన్ ఇచ్చింది. బ్లూ ఫ్లాగ్‌ సర్టిఫికేషన్‌ను రద్దు చేయలేదని, తాత్కాలికంగా మాత్రమే ఉపసంహరించారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నమాట. సేఫ్టీ, ప్రోటోకాల్స్‌ అప్‌డేట్ చేయాలన్నది బ్లూ ఫ్లాగ్‌ ఫౌండేషన్‌ సూచన. రెండు రోజుల్లో ఆడిట్ తర్వాత గుర్తింపు పునరుద్ధరిస్తామన్నది ప్రభుత్వం మాట.


అసలేం జరిగింది?

రుషికొండ బీచ్‌ నిర్వహణ అధ్వానంగా ఉందంటూ వచ్చిన ఫిర్యాదులపై డెన్మార్క్‌కు చెందిన ఫౌండేషన్‌ ఫర్‌ ఎన్విరాన్‌మెంటల్‌ ఎడ్యుకేషన్‌-FEE సంస్థ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రుషికొండ బీచ్‌ నిర్వహణను సంస్థ గాలికొదిలేయడం దీనికి కారణంగా తెలుస్తోంది. పర్యాటక శాఖ అధికారుల మధ్య సమన్వయవ లోకపోవడంతో గుర్తింపు రద్దు జరిగినట్లు తెలుస్తోంది.


బ్లూ ఫ్లాగ్‌ గుర్తింపును తాత్కాలికంగా రద్దు చేస్తూ ఫిబ్రవరిలో జిల్లా కలెక్టర్‌కు మెయిల్‌ ద్వారా సమాచారం ఇచ్చింది. బీచ్‌లో గుర్తింపు ఉన్నప్పుడు ఎగురవేసే జెండాలను దించేయాలని సూచన చేసింది. దీన్ని నోటీసు బోర్డులో తెలియజేయాలని ప్రస్తావించింది. అయితే జిల్లా అధికారులు ఈ విషయాన్ని బయటకు రాకుండా జాగ్రత్త పడ్డారు. బ్లూ ఫ్లాగ్ జెండాలను కిందకు దించలేదు.

బ్లూ ఫ్లాగ్‌ గుర్తింపు రద్దుపై సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో ప్రభుత్వం ఫోకస్ చేసింది. దీనికి గల కారణాలను తెలియజేయాలని ప్రభుత్వం సీఎస్‌ని ఆదేశించింది. వెంటనే కలెక్టర్‌ ఆ వివరాలు పంపినట్లు తెలిసింది. బీచ్‌ నిర్వహణ బాధ్యతను ప్రైవేటు సంస్థకు అప్పగించారు అధికారులు. ఆ సంస్థ నిర్వహణ బాధ్యతను గాలికి వదిలేసింది.

ALSO READ: మహిళలకు చంద్రబాబు సర్కార్ గుడ్ న్యూస్

దీనికితోడు అక్కడ పని చేస్తున్న సిబ్బందికి జీతాలు ఇవ్వలేదు. ఈ నేపథ్ంలో బీచ్‌ అధ్వానంగా మారింది. ఈ విషయం తెలుసుకున్న వెంటనే బ్లూఫ్లాగ్‌ సర్టిఫికెట్‌ను తాత్కాలికంగా ఉపసంహరిస్తున్నట్లు ఎఫ్‌ఈఈ నుంచి ఫిబ్రవరి 13న కలెక్టర్‌కు సమాచారం వచ్చింది. వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టినట్టు చేపట్టారు అధికారులు.

బ్లూ ఫ్లాగ్‌ హిస్టరీ ఏంటి?

2020లో డెన్మార్క్‌కు చెందిన ఫౌండేషన్‌ ఫర్‌ ఎన్విరాన్‌మెంటల్‌ ఎడ్యుకేషన్‌- ఎఫ్‌ఈఈ సంస్థ రుషికొండ బీచ్ కు ‘బ్లూ ఫ్లాగ్‌’ గుర్తింపు ఇచ్చింది. ఏపీలో ఆ తరహా గుర్తింపు పొందిన ఏకైక బీచ్‌ రుషికొండ మాత్రమే. బ్లూ ఫ్లాగ్‌ గుర్తింపు ఇచ్చే క్రమంలో ఎఫ్‌ఈఈ కొన్ని నిబంధనలు సూచించింది. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా బీచ్‌ను నిర్వహించాలన్నది ప్రధాన పాయింట్.

భద్రత, పర్యావరణ నిర్వహణ, నీటి నాణ్యతను పక్కాగా పాటించాలన్నది మరో పాయింట్. బీచ్‌ను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుతూ, మౌలిక సదుపాయాలు కల్పించాలన్నది కీలకమైన పాయింట్. 2024-25కు సంబంధించి బ్లూఫ్లాగ్‌ గుర్తింపు కోసం జిల్లా యంత్రాంగం గత ఏడాది దరఖాస్తు చేసింది.

ఎఫ్‌ఈఈ సంస్థ రెన్యువల్‌ చేసింది. అయితే బీచ్‌లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని, కుక్కలు రావడం, సీసీ కెమెరాలు సరిగా పని చేయలేకపోవడం, సిబ్బంది లేకపోవడంతో వ్యర్థాలు ఎక్కడికక్కడ పేరుకుపోయాయి. మూత్రశాలలు సరిగా లేవు, దుస్తులు మార్చుకునే గదులు మరింత అధ్వానంగా మారాయి. దీనిపై ఎఫ్‌ఈఈకి ఫొటోలతో సహా ఫిర్యాదులు అందడంతో గుర్తింపును రద్దు చేసింది.

జోరుగా పనులు

ఫిబ్రవరి 13న మెయిల్‌ వచ్చిన వెంటనే జిల్లా కలెక్టరు హరేంధిరప్రసాద్‌ అలర్ట్ అయ్యారు. వెంటనే బీచ్‌ నిర్వహణ కమిటీ ఏర్పాటు చేశారు. ఎక్కడెక్కడ పనులు చేపట్టాలో వాటిని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారు. జీవీఎంసీ-వీఎంఆర్‌డీఏ-అటవీశాఖ ఆధ్వర్యంలో పూర్తి చేయాల్సి ఉంది. ప్రస్తుతానికి 70 శాతం పనులు పూర్తి అయ్యాయి. మరికొన్ని చివరి దశలో ఉన్నాయి.

ఈ వారంలో ఆ పనులన్నీ పూర్తిచేసి ఆ నివేదికను ఎఫ్‌ఈఈకు పంపనున్నారు. ఆ తర్వాత గుర్తింపు తిరిగి పొందనున్నారు. సాధారణ రోజుల్లో బీచ్‌కు దాదాపు 70 వేల మంది సందర్శకులు వస్తారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. వారాంతాల్లో అయితే లక్ష పైనే దాటుతుంది. దీనివల్ల ప్రతి నెలా వచ్చే ఆదాయం దాదాపు రూ.15 లక్షల వరకు ఉంటుందని చెబుతున్నారు.

Related News

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Big Stories

×