BigTV English
Advertisement

OTT Movie : దేవత అనుకుంటే దెయ్యం పట్టి పీడిస్తోంది ఏంట్రా సామీ… ఒళ్లు గగుర్పొడిచే హర్రర్ సీన్స్

OTT Movie : దేవత అనుకుంటే దెయ్యం పట్టి పీడిస్తోంది ఏంట్రా సామీ… ఒళ్లు గగుర్పొడిచే హర్రర్ సీన్స్

OTT Movie : దయ్యాల సినిమాలు చూడాలంటే కాస్త గుండె ధైర్యం కావాల్సిందే. వీటిలో వచ్చే కొన్ని సీన్స్ చూస్తే గుండె ఆగిపోయినట్టుగా అనిపిస్తుంది. అంతలా భయపెట్టే సన్నివేశాలు కొన్ని సినిమాలలో ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమాలో భయంకరమైన సన్నివేశాలు చాలానే ఉంటాయి. దేవతలకు దయ్యాలకు పోటీ జరుగుతున్నట్టుగా ఉంటుంది. ఈ మూవీ పేరు ఏమిటి ?ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే


అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో

ఈ థాయ్ సూపర్ నాచురల్ హారర్ మూవీ పేరు’ది మీడియం’ (The Medium). 2021లో విడుదలైన ఈ హారర్ మూవీకి బంజాంగ్ పిసంతనకున్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా థాయ్‌లాండ్‌లోని ఈసాన్ ప్రాంతంలో జరిగే ఒక షామన్ వారసత్వ స్టోరీ గురించి చెబుతుంది. ఈ మూవీ మాక్ డాక్యుమెంటరీ శైలిలో తెరకెక్కింది. ఇది వాస్తవ డాక్యుమెంటరీలా కనిపిస్తుంది కానీ కల్పిత కథ ఆధారంగా దీనిని రూపొందించారు. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతుంది.


స్టోరీలోకి వెళితే

ఒక డాక్యుమెంటరీ బృందం థాయ్‌లాండ్‌లోని ఈసాన్ ప్రాంతంలో నిమ్ అనే షామన్‌ను ఇంటర్వ్యూ చేయడానికి వెళ్తారు. నిమ్ తనను తాను బాయాన్ అనే స్థానిక దేవత ఆవహించిన వ్యక్తిగా ప్రపంచానికి పరిచయం చేసుకుంటుంది. ఈ దేవత ఆమె కుటుంబంలోని మహిళలకు తరతరాలుగా వస్తోందని, తన సోదరి నోయ్ దీనికి వ్యతిరేకంగా ఉన్నందున తర్వాత నెనే ఈ బాధ్యత తీసుకున్నానని నిమ్ వివరిస్తుంది. నోయ్ క్రైస్తవ మతంలోకి మారడంతో ఈ ఆధ్యాత్మిక వారసత్వం నిమ్‌కు వస్తుంది. ఈ కథ ప్రధానంగా నోయ్ కూతురు మింక్‌ చుట్టూ తిరుగుతుంది. మింక్ ఇప్పుడు అసాధారణంగా ప్రవర్తించడం మొదలుపెడుతుంది. ఆమెలో ఎక్కువ మనుషులు వ్యక్తిత్వాలు కనిపిస్తాయి. ఒక చిన్న పిల్లవాడు, వృద్ధుడు, తాగుబోతు, వేశ్య వంటి గొంతులు ఆమె గొంతులో వినిపిస్తాయి. ఆమెకు కలలు కూడా భయంకరంగా వస్తాయి. శారీరక బాధలు కూడా ఎదురవుతాయి. మొదట్లో ఇది బాయాన్ దేవత ఆవహించడం వల్లనే అనుకుంటారు, కానీ క్రమంగా ఇది దేవత కాదని, ఒక భయంకరమైన చీకటి శక్తి ఆమెను ఆవహించినట్లు తెలుస్తుంది. డాక్యుమెంటరీ బృందం ఈ సంఘటనలను రికార్డ్ చేస్తూ ఉంటుంది.

క్రమంగా సమయం గడిచేకొద్ది మింక్ ప్రవర్తన విపరీతంగా మారుతుంది. ఆమె కుటుంబంలో కొన్ని దారుణమైన సంఘటనలు జరిగినఉంటాయి. ముఖ్యంగా ఆమె తాత ఒక ఫ్యాక్టరీ యజమానిగా ఉన్నప్పుడు,అక్కడ జరిగిన ఒక ఆత్మహత్య ఈ పరిస్తితికి కారణమని వెల్లడవుతుంది. ఈ దుష్టశక్తి మింక్‌ను పూర్తిగా ఆవహించడంతో, కుటుంబం ఆమెను రక్షించడానికి షామన్ ఆచారాలను నిర్వహిస్తుంది. కానీ పరిస్థితి చేయి దాటిపోతుంది. ఈ దుష్టశక్తి మింక్‌ను మాత్రమే కాకుండా మొత్తం కుటుంబాన్ని నాశనం చేసే స్థాయికి చేరుకుంటుంది. షామన్ ఆచారాలు కూడా విఫలమవుతాయి. డాక్యుమెంటరీ బృందం కూడా ఈ భయానక సంఘటనల్లో చిక్కుకుంటుంది.చివరికి ఆ దుష్టశక్తి నుంచి వీళ్ళంతా బయటపడతారా ? లేక దాని చేతిలో బలి అవుతారా ? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే,ఈ మూవీని మిస్ కాకుండా చూడండి. ఇది భయపెట్టే దృశ్యాలతో హారర్ సినిమాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించింది.

Related News

OTT Movie : మంత్రముగ్ధులను చేసే కథ… మెంటలెక్కించే క్లైమాక్స్.. ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్‌లో మిస్ అవ్వకుండా చూడాల్సిన థ్రిల్లర్లు

OTT Movie : బీహార్ రాజకీయాలు ఎంత బ్రూటల్‌గా ఉంటాయో తెలుసుకోవాలా ? అయితే ఈ వెబ్ సిరీస్‌లపై లుక్కేయండి

Dude OTT: ‘డ్యూడ్’ ఓటీటీ డేట్ లాక్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

OTT Movies: 3 రోజుల వ్యవధిలో 4 చిత్రాలు స్ట్రీమింగ్..ముందు ఏది చూడాలి?

OTT Movie : న్యూయార్క్ నగర మేయర్‌గా ఇండియన్ ఫిలిం మేకర్ తనయుడు… మీరా నాయర్ సినిమాలు ఏ ఓటీటీలో ఉన్నాయంటే ?

OTT Movie : పెళ్ళికి రెడీ అవుతూ ప్రియుడితో… మీరా నాయర్ ఫ్యాన్స్ మిస్ అవ్వకుండా చూడాల్సిన ప్రేమ కావ్యం

OTT Movie : అద్దెకొచ్చిన వాళ్ళతో ఆ పాడు పని… గ్రిప్పింగ్ థ్రిల్లర్, ఊహించని టర్నులు ఉన్న సైకలాజికల్ థ్రిల్లర్

OTT Movie : పక్కింటోళ్ల రొమాన్స్‌ను పనులు పక్కన పెట్టి చూసే సైకో… థ్రిల్లింగ్ సీరియల్ కిల్లర్ స్టోరీ

Big Stories

×