OTT Movie : ఓటిటి లోకి ఎన్నో రకాల సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి. అయితే వీటిలో కొన్ని సైకో సినిమాలు కూడా ఉంటాయి. ఈ సైకోలు కూడా చాలా రకాలుగా ఉంటారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీలో ఒక చెఫ్ సైకో గా మారుతాడు. తన హోటల్ కి వచ్చిన వాళ్లనే టార్గెట్ చేసి చంపుతాడు. ఈ మూవీ స్టోరీ ముందుకు వెళ్లే కొద్దీ టెన్షన్ తో పిచ్చెక్కిపోతారు. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే…
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో
ఈ బ్లాక్ కామెడీ హారర్ మూవీ పేరు ‘ది మెను’ (The Menu). 2022 లో వచ్చిన ఈ మూవీకి మార్క్ మైలోడ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో రాల్ఫ్ ఫియన్స్, అన్య టేలర్-జాయ్, నికోలస్ హౌల్ట్ వంటి నటులు ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ స్టోరీ ఒక ప్రత్యేకమైన రెస్టారెంట్‌లో జరుగుతుంది. ఇక్కడ ఒక షెఫ్ తన అతిథుల కోసం ఊహించని వంటలను సిద్ధం చేస్తుంటాడు. వంటలతో పాటు అక్కడ మరొ కోణం కూడా ఉంటుంది. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీలోకి వెళితే
టైలర్, మార్గోట్ అనే ఒక జంట, సముద్రంలోని ఒక ద్వీపంలోని హాథోర్న్ అనే ఒక రెస్టారెంట్‌కు వెళతారు. ఈ రెస్టారెంట్‌కు మంచి పేరు ఉంటుంది. ఈ రెస్టారెంట్‌ను ప్రఖ్యాత షెఫ్ జూలియన్ స్లోవిక్ నాడుపుతుంటాడు. ఈ రెస్టారెంట్ లో ఒక్కొక్కరికి చాలా ఖర్చు అవుతుంది. టైలర్ ఒక భోజన ప్రియుడు. ఈ హోటల్ లో డిన్నర్ కోసం చాలా ఆసక్తిగా ఉంటాడు. కానీ మార్గోట్ కు ఈ రెస్టారెంట్ పట్ల ఎక్కడో సందేహంగా ఉంటుంది. ఈ డిన్నర్‌కు ఇతర అతిథులు కూడా వస్తారు. వాళ్ళల్లో ధన్యవంతులే ఎక్కువగా ఉంటారు. షెఫ్ జూలియన్ అక్కడ కొత్త వంటకాలను అతిధులకు పరిచయం చేస్తాడు. కానీ అతని ప్రవర్తన, మాటలు క్రమంగా మారుతూ వస్తాయి. ఫుడ్ తింటున్నప్పుడు అక్కడ గందరగోళం జరుగుతుంది. ఒక జూనియర్ చెఫ్ కాల్చుకుని చనిపోతాడు. ఇది అక్కడికి వచ్చిన అతిథులను బాగా భయపెడుతుంది. ఒక వ్యక్తి అక్కడినుంచి బయటకు వెళ్లడానికి ప్రయత్నించినప్పుడు, రెస్టారెంట్ సిబ్బంది అతని ఒక వేలిని కత్తిరిస్తారు. స్టోరీ ముందుకు సాగుతున్న కొద్దీ, హింస ఎక్కువగానే మొదలు అవుతుంది.
షెఫ్ స్లోవిక్ తన అతిథులను చంపాలని ప్లాన్ చేసాడని బయటపడుతుంది. ఎందుకంటే అతను తన జీవితం లో ఆనందాన్ని కోల్పోతాడు. ఈ ధనవంతులైన, అహంకార మనుషులను ద్వేషించడం మొదలు పెడతాడు. ఆ తరువాత స్లోవిక్, అతిథులను లోపల ఉంచి రెస్టారెంట్‌ను తగలబెడతాడు. అక్కడికి వచ్చిన వాళ్ళందరినీ చంపేస్తాడు. కానీ మార్గోట్, స్లోవిక్‌ను ఒక సాధారణ చీజ్‌బర్గర్ చేయమని కొరిఉంటుంది. ఇది అతని సంతోషకరమైన పాత రోజులను గుర్తు చేస్తుంది. అందుకే ఆమెను ఏమీ చేయకుండా వదిలిపెడతాడు. ఆమె ఆ బర్గర్‌ను తీసుకుని బయటకు వెళ్లిపోతుంది. ద్వీపం మంటల్లో కాలిపోతుంటే బర్గర్‌ను తింటూ చూస్తుంది. చివరికి జూలియన్ స్లోవిక్ ఆ రెస్టారెంట్ కి వచ్చిన వాళ్ళను ఎందుకు చంపుతుంటాడు ? అనేది తెలియాలంటే, ఈ బ్లాక్ కామెడీ హారర్ ఈ మూవీని చూడాల్సిందే.