Weather News: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మార్చి నెలలో ఎండలు దంచికొట్టాయి. అయితే గత రెండు, మూడు రోజుల నుంచి రాష్ట్రంలో పలు చోట్ల వర్షాలు పడుతున్నాయి. మార్చి నెలలో పలు చోట్ల 40 నుంచి 42 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అంటే ఏ రేంజ్ ఎండలు దంచికొట్టాయో అర్థం చేసుకోవచ్చు. గత మూడు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలు రాష్ట్ర ప్రజలు ఉక్కపోత నుంచి కాస్త ఉపశమనం పొందారు. ఇప్పటికే కాకినాడ, అనకాపల్లి, శ్రీకాకుళం, పల్నాడు, బాపట్ల, గుంటూరు తదితర ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసిందని వాతావరణ శాఖ కేంద్రం తెలిపింది. అత్యధికంగా కాకినాడ జిల్లా వేలంకలో 56.25 మిల్లీ మీటర్ల వాన పడినట్లు వివరించింది.
అయితే, సౌత్ అండమాన్ సమీపంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో మరోసారి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలో ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటాయని, కొన్ని జిల్లాల్లో అయితే ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడతాయని పేర్కొంది. అంతేగాక పలు చోట్ల పిడుగులు కూడా పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
ALSO READ: NABARD Jobs: నాబార్డ్‌లో ఉద్యోగాలు.. ఈ జాబ్ వస్తే రూ.50 లక్షల జీతం భయ్యా.. నేడే లాస్ట్ డేట్..!
ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండడంతో రాష్ట్రంలో మరో ఐదు రోజుల పాటు కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. అయితే కొన్ని ఎండలు కొట్టే అవకాశం ఉందని తెలిపారు. గరిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. రేపు కొన్ని ప్రాంతాల్లో పిడుగులు పడతాయని చెప్పారు. వర్షాలు పడే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
భారీ వర్షాలు పడే సమయంలో జనాలు జాగ్రత్తగా ఉండాలని.. సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని చెప్పారు. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడుతున్న సమయంలో రైతులు, ప్రజలు చెట్ల కింద ఉండొద్దని.. పిడుగులు పడే అవకాశం ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.