E-Paper
Advertisement

చదువు చెప్పిన టీచర్ పై క్రష్… పదేళ్ళ తరువాత ఆ స్టూడెంట్ చేసిన పనికి బుర్రపాడు

చదువు చెప్పిన టీచర్ పై క్రష్… పదేళ్ళ తరువాత ఆ స్టూడెంట్ చేసిన పనికి బుర్రపాడు
Advertisement

Korean Melodrama: స్కూల్ టైమ్ లో టీచర్ పై క్రష్… ఆ స్కూల్ నుంచి వెళ్ళిపోయిన పదేళ్ళ తరువాత మళ్లీ రీఎంట్రీ… టీచర్ ను దక్కించుకోవడానికి ఆ కుర్రాడు చేసే పనిని చూడాల్సిందే భయ్యా. మనసును హత్తుకునే ఈ కొరియన్ మెలోడ్రామా సిరీస్ పేరే ‘ది మిడ్‌నైట్ రొమాన్స్ ఇన్ హాగ్వాన్’ (The Midnight Romance in Hagwon). ఈ మెచ్యూర్ రొమాంటిక్ డ్రామా 2024లోనే విడుదలైంది. మరి వి హా-జూన్, జంగ్ రియో-వాన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ 16 ఎపిసోడ్ల కొరియన్ సిరీస్ ను ఏ ఓటీటీలో చూడవచ్చు ? తెలుగులో అందుబాటులో ఉందా ? అనే వివరాలను వివరంగా తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే…

సియోల్‌ లోని ధనిక ప్రాంతం గంగ్నమ్‌. అక్కడి డేచి-డాంగ్‌లో ఉన్న ప్రముఖ హాగ్వాన్‌లో కథ సాగుతుంది. సియో హ్యే-జిన్ గత 14 ఏళ్లుగా అక్కడ స్టార్ కొరియన్ లాంగ్వేజ్ టీచర్‌ గా పని చేస్తుంది. ఆమె విద్యార్థులను టాప్ యూనివర్సిటీల్లోకి చేర్చడంలో చాలా పాపులర్. కఠినమైన డిసిప్లిన్, అంకితభావం, అనుభవం ఆమెను హాగ్వాన్ ప్రపంచంలో ఒక ఐకాన్‌గా మారుస్తాయి. ఒకరోజు హ్యే-జిన్ జీవితంలో ఊహించని మలుపు వస్తుంది.

Advertisement

ఆమె పాత విద్యార్థి లీ జున్-హో హఠాత్తుగా ఆ అకాడమీలోనే రూకీ ఇన్‌స్ట్రక్టర్‌గా జాయిన్ అవుతాడు. 10 ఏళ్ల క్రితం హ్యే-జిన్ వద్ద చదువుకున్న జున్-హో, ఒక పెద్ద కార్పొరేట్ ఉద్యోగాన్ని వదిలేసి టీచింగ్ ఫీల్డ్‌కు వచ్చాడు. ఈ నిర్ణయం హ్యే-జిన్‌ను తీవ్ర ఆశ్చర్యంలో ముంచేస్తుంది. జున్-హో కేవలం కెరీర్ మార్పు కోసం మాత్రమే రాలేదు. గత 10 ఏళ్లుగా తన మాజీ టీచర్ హ్యే-జిన్‌పై అతనికి ఉన్న అనురాగం, క్రష్ అతన్ని అక్కడికి తీసుకొచ్చింది.

మొదట్లో హ్యే-జిన్ అతన్ని తన పాత విద్యార్థిగానే చూసి దూరం పెట్టడానికి ప్రయత్నిస్తుంది. కానీ రాత్రి పూట అకాడమీలో కలిసి క్లాసులు ప్లాన్ చేయడం, విద్యార్థుల సమస్యలు చర్చించడం, ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవడం ద్వారా వారి మధ్య సాన్నిహిత్యం పెరుగుతుంది. జున్-హో మెచ్యూర్డ్ ఆలోచనలు, హ్యే-జిన్‌పై అతని నిశ్శబ్ద ప్రేమ, ఆమెను గౌరవించే విధానం క్రమంగా ఆమె గుండెను కరిగిస్తాయి. ఇలా వారిద్దరి మధ్య సీక్రెట్ ఆఫీస్ రొమాన్స్ మొదలవుతుంది.

Advertisement

ఇక్కడే కథ మలుపు తిరుగుతుంది. సిరీస్ కేవలం రొమాన్స్‌కు పరిమితం కాకుండా, కొరియా ప్రైవేట్ ఎడ్యుకేషన్ వ్యవస్థలోని తీవ్రమైన పోటీ, రాజకీయాలు, టీచర్ల మధ్య గాసిప్స్, కుట్రలను కూడా బయట పెడుతుంది. హ్యే-జిన్ పాపులారిటీని చూసి అసూయపడిన ప్రత్యర్థి డైరెక్టర్ చోయ్ హ్యోంగ్-సన్ ఆమెను దించేయడానికి కుట్రలు పన్నుతుంది. మరి ఆ కుట్రలు ఏంటి ? వాటన్నింటి నుంచి హీరోయిన్ ఎలా బయట పడింది ? చివరికి హీరో హీరోయిన్ ఒక్కటయ్యారా లేదా ? అన్నది ఈ సిరీస్ స్టోరీ.

రెండు ఓటీటీలలో

కాగా ‘ది మిడ్‌నైట్ రొమాన్స్ ఇన్ హాగ్వాన్’ Netflix, Amazon Prime Video ఓటీటీలలో అందుబాటులో ఉంది. అయితే ఈ సిరీస్ తెలుగులో అందుబాటులో లేదు.

Read Also : హనీమూన్ అంటేనే ఆమడ దూరం పారిపోయేలా చేసే తమిళ మూవీ… క్లైమాక్స్ ట్విస్ట్ డోంట్ మిస్

Tags

Related News

నేరస్థుల గుండెల్లో వణుకు పుట్టించే స్పెషల్ టీమ్… కంటెంట్ నెక్స్ట్ లెవెల్ భయ్యా… డెడ్లీ క్రైమ్స్ తో సీజన్ 9 స్ట్రీమింగ్ షురూ

పాపులర్ SNL షో వెనుక ఉన్న మాస్టర్‌మైండ్ కథ… ఇండస్ట్రీ సీక్రెట్స్ బయటపెట్టిన నెట్‌ఫ్లిక్స్ కొత్త డాక్యుమెంటరీ

కులం పిచ్చితో ప్రేమికుల ప్రాణాలు తీసే రాక్షసత్వం… హార్డ్ హిట్టింగ్ మూవీ

తీరప్రాంతాన్ని వణికించే మిస్టరీ క్రియేచర్… ఊరిని కాపాడుకోవడానికి మత్స్యకారుడి పోరాటం… గూస్‌బంప్స్ తెప్పిస్తున్న సర్వైవల్ థ్రిల్లర్

యూనికార్న్ ఐలాండ్‌లో ఊహించని విపత్తులు… ఆ వింత రహస్యం ఏంటి ? నెట్‌ఫ్లిక్స్‌లో కొత్త మ్యాజికల్ అడ్వెంచర్

అవుట్‌వర్ల్డ్ క్రూర చక్రవర్తిపై తిరుగుబాటు… హాలీవుడ్ హీరో ఎంట్రీతో నెక్స్ట్ లెవెల్ వార్… తెలుగులోనే స్ట్రీమింగ్

విలన్ గా సుహాస్ 150 కోట్ల మాస్ ర్యాంపేజ్… తెలుగులో స్ట్రీమింగ్ కి వచ్చేసిన ‘మందాడి’

కొట్టేసిన 300 కోట్ల బంగారాన్ని తన్నుకుపోయే ఖిలాడి… ఓన్ ఫ్రెండే మోసం చేస్తే రివేంజ్ ఇలాగే ఉంటది… ఓటీటీలో తెలుగులోనే

Big Stories

Advertisement
×