E-Paper
Advertisement

హనీమూన్ అంటేనే ఆమడ దూరం పారిపోయేలా చేసే తమిళ మూవీ… క్లైమాక్స్ ట్విస్ట్ డోంట్ మిస్

హనీమూన్ అంటేనే ఆమడ దూరం పారిపోయేలా చేసే తమిళ మూవీ… క్లైమాక్స్ ట్విస్ట్ డోంట్ మిస్
Advertisement

Romantic Crime Thriller : కొత్త జంట ఎన్నో ఆశలతో పెళ్లి బంధంలో అడుగు పెడుతుంది. అలాగే హనీమూన్ తో ఆ బంధాన్ని మరింత మధురంగా మార్చుకోవాలి అనుకుంటుంది. కానీ ఆ హనీమూనే పీడకలగా మారితే ? రూమ్ లో ప్రైవేట్ గా జరిగిన రొమాన్స్ ఆన్లైన్ లో ప్రత్యక్షమైతే ? నిజానికి ఇలాంటి రియల్ లైఫ్ క్రైమ్ స్టోరీస్ ఎన్నో వార్తలలో రోజూ చూస్తూనే ఉంటాము. కానీ అచ్చం ఇలాంటి స్టోరీతో తెరకెక్కిన తమిళ మూవీ ఈరోజు మన మూవీ సజెషన్. ఈ రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ డ్రామా పేరు “సత్తేంద్రు మారుదు వానిలై” (Sattendru Maarudhu Vaanilai – 2026). బాబు విజయ్ దర్శకత్వంలో, జై, మీనాక్షి గోవిందరాజన్, యోగి బాబు ప్రధాన పాత్రల్లో ఈ చిత్రం రూపొందింది. మరి ఈ మూవీ తెలుగులో అందుబాటులో ఉందా ? ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే…

ఓ మామూలు యువకుడి జీవితం ఆకస్మికంగా రాజకీయ కుట్రలు, డార్క్ వెబ్ నేరాలు, ప్రేమ, ప్రాణాపాయాల మధ్య చిక్కుకుపోవడం చుట్టూ కథ తిరుగుతుంది. సినిమాలో మన హీరో ఎటువంటి బాధ్యతలు లేని అనాథ. రాజకీయ నాయకుడి కూతురు అయిన హీరోయిన్ తో ప్రేమలో పడతాడు. అయితే ఆమెకు తండ్రి డబ్బు, పదవి కోసం ఓ ముసలి రాజకీయ నాయకుడికి ఇచ్చి రెండవ పెళ్లి చేయాలని చూస్తాడు. దీంతో ఆ అమ్మాయి ఇంటి నుండి పారిపోయి హీరో దగ్గరకు వస్తుంది. ఇద్దరూ ఎలాంటి ఆలోచన లేకుండా, హఠాత్తుగా పెళ్లి చేసుకుంటారు.

Advertisement

మొదట్లో ఇదంతా సరదా అడ్వెంచర్‌లా అనిపిస్తుంది. కానీ ఆ తరువాతే మొదలవుతుంది సమస్యల సుడిగుండం. పెళ్లయిన వెంటనే వీళ్ళ జీవితం ఊహించని టర్న్ తీసుకుంటుంది. ఒకవైపు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు, మరోవైపు అమ్మాయి తండ్రి వల్ల రాజకీయ శత్రువులు, ఈర్ష్యపడే ప్రత్యర్థులు వీరిని వేటాడటం షురూ చేస్తారు. ఈ జంట తమ ప్రాణాలను కాపాడుకోవడానికి ఒక రిసార్ట్‌ లో తల దాచుకుంటుంది. ఇక్కడే సినిమాలోని మెయిన్ ట్విస్ట్ వస్తుంది. ఆ రిసార్ట్‌లో డేంజరస్ విలన్ డార్క్ వెబ్ కోసం, తమ రిసార్ట్ లో దిగే కపుల్ ప్రైవేట్ వీడియోలను దొంగతనంగా రికార్డ్ చేస్తూ ఉంటాడు.

ఆ విలన్ కన్ను ఈ కొత్త జంటపై పడుతుంది. అప్పటికే పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టుగా ఉంటుంది హీరో హీరోయిన్ పరిస్థితి. ఇప్పుడు విలన్ ఆ ప్రైవేట్ వీడియోతో వీళ్ళ జీవితాలతో ఆడుకుంటాడు. అటు పొలిటికల్ శత్రువులు, ఇటు డార్క్ వెబ్ మాఫియా నుంచి ఈ కొత్త జంట ఎలా తప్పించుకున్నారు ? తమ ప్రాణాలను ఎలా కాపాడుకున్నారు ? తమ ప్రేమను ఎలా నిలబెట్టుకున్నారు ? క్లైమాక్స్ ట్విస్ట్ ఏంటి ? అన్నది తెలియాలంటే ఈ మూవీని చూడాల్సిందే.

తెలుగులో స్ట్రీమింగ్

Advertisement

జై హీరోగా, మీనాక్షి గోవిందరాజన్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో యోగి బాబు కామెడీ టైమింగ్‌ బాగుంటుంది. ‘సత్తేంద్రు మారుదు వానిలై’ ప్రస్తుతం Amazon Prime Videoలో తెలుగు, తమిళ భాషల్లో అందుబాటులో ఉంది. ఈ సినిమా ఆహా (aha) ఓటిటి ఫ్లాట్‌ఫామ్‌లో కూడా రెండు భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.

Read Also : నేరస్థులను లేపేసే అమాయకపు సైకో… కామెడీతో పాటు క్రైమ్ ఉన్న కొరియన్ సిరీస్

Related News

రూ. 8500 కోట్ల సెన్సేషనల్ మూవీ ‘టాయ్ స్టోరీ 5’ ఓటీటీలోకి… కానీ చిన్న ట్విస్ట్

30 ఏళ్ల క్రితం మాయమైన పడవ రిటర్న్… దానితో పాటు వచ్చే టైమ్ ట్రావెల్ మిస్టరీ… చివరికి ఊహించని ట్విస్ట్

రూ. 1185 కోట్ల కలెక్షన్స్… తెలుగులో స్ట్రీమింగ్ అవుతున్న రాబిన్ హుడ్ చివరి కథ

కూతురి స్విమ్మింగ్ కోచ్ పై తల్లికి అలాంటి కోరిక… చివరికి ఏం జరిగిందో చూస్తే బుర్రపాడు

30 ఏళ్లుగా దాచుకున్న రహస్యం… పెళ్లిలో అన్నదమ్ముల అరాచకం… ఈ సైకలాజికల్ థ్రిల్లర్ చూస్తే మైండ్ బ్లాంక్

గోడ వెనుక దొరికిన వింత వస్తువు తెచ్చిన అనర్థం… భర్త కళ్లు పచ్చగా… శరీరం నుంచి నల్లటి ద్రవం… భార్య ఏం చేసిందంటే ?

తల్లిదండ్రుల ప్రేమకథ వెనుక ఎయిడ్స్ విషాదం… ఈ అమ్మాయి తెలుసుకున్న నిజం కదిలిస్తుంది మావా

అమ్మకు క్యాన్సర్… కూతురికి ఆటిజం… కానీ ఈ అమ్మాయి చేసిన పని చూస్తే గర్వపడతారు భయ్యా

Big Stories

Advertisement
×