OTT Movie : మూవీ లవర్స్ ని ఎంటర్టైన్ చేయడానికి ఓటిటి ప్లాట్ ఫామ్ లో, యూత్ ఫుల్ ఎంటర్టైనర్ సినిమాలు చాలానే ఉన్నాయి. అయితే కొన్ని సినిమాలు డిఫరెంట్ కంటెంట్ తో వచ్చి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయి. తండ్రి, కొడుకు, ప్రియురాలు వీళ్ళ ముగ్గురి మధ్య నడిచే, ట్రయాంగిల్ లవ్ స్టోరీతో వచ్చిన ఒక రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీ ఓటిటి ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీ పేరేమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసుకుందాం పదండి.
అమెజాన్ ప్రైమ్ వీడియొ (Amazon Prime Video) లో
చూస్తూ డిస్ట్రర్బ్ అయ్యే ఈ ఎంటర్టైనర్ మూవీ పేరు ‘ది మిస్ట్రెస్స్ ‘ (The Mistress). ఈ మూవీలో తండ్రికి, కొడుకుకి మధ్య హీరోయిన్ తనకే తెలియకుండా రిలేషన్ నడుపుతుంది. చివరికి ఈమె లైఫ్ ఎటువెళ్తుందో స్టోరీలోకి వెళ్ళి తెలుసుకుందాం. ఈ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియొ (Amazon Prime Video) లో స్ట్రీమింగ్ అవుతుంది.
వివరాల్లోకి వెళితే
సారా ఒక మిడిల్ క్లాస్ అమ్మాయి. ఈమెకు కుటుంబ పరంగా చాలా బాధ్యతలు ఉంటాయి. ఈ క్రమంలో డబ్బున్న టోరిస్ అనే వ్యక్తి సారాకి అండగా ఉంటాడు. అందుకు ఆమె వారంలో ఒక రోజు అతనితో గడుపుతూ ఉంటుంది. వీళ్ళిద్దరి రిలేషన్ మంచిగానే సాగుతూ ఉంటుంది. టోరస్, తన భార్యతో విడిగా ఉంటాడు. టోరస్ భార్య కూడా వేరొకరితో రిలేషన్ లో ఉంటుంది. టోరస్ కి ఎరిక్ అనే ఒక కొడుకు ఉంటాడు. అతను కూడా తండ్రికి దూరంగా ఉంటాడు. సారాని ఒకసారి ఎరిక్ అనుకోకుండా కలుస్తాడు. ఆమె అందానికి మైమరిచిపోయి లవ్ చేయడం మొదలు పెడతాడు. అయితే సారా అతన్ని అవాయిడ్ చేస్తూ వస్తుంది. మనసులో మాత్రం అతనంటే ఇష్టంగానే ఉంటుంది. ఆ తర్వాత కొద్ది రోజులకు సారా తన తండ్రితోనే ఎఫైర్ నడుపుతోందని తెలుసుకుంటాడు ఎరిక్. అయినా ఆమె మంచితనం గురించి తెలుసుకొని, ప్రేమించడం మొదలుపెడతాడు. సారా కూడా అతన్ని ప్రేమిస్తుంది. సారా ఇంటికి కూడా వెళ్ళి సరదాగా గడుపుతాడు ఎరిక్.
ఒకరోజు ఎరిక్ ఎవరో సారాకి తెలిసిపోవడంతో, సారా ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఈ విషయం ఎందుకు దాచావని ఎరిక్ తో కోప్పడుతుంది. మరోవైపు సారా తన కొడుకుని లవ్ చేస్తుందని టోరిస్ తెలుసుకుంటాడు. ఈ క్రమంలో తండ్రి కొడుకుల మధ్య గొడవ జరుగుతుంది. తండ్రి గుండె నొప్పితో హాస్పిటల్ లో జాయిన్ అవుతాడు. టోరస్ బ్రతకడం కస్టమని డాక్టర్ చెప్పడంతో, కంపెనీ బాధ్యతలు కొడుకుని తీసుకోమంటాడు. చివరికి సారా ఎవరి వైపు ఉంటుంది? ఎరిక్ ని లవ్ చేస్తుందా? టోరస్ తో రిలేషన్ లో ఉంటుందా? ఈ విషయాలను తెలుసుకోవాలనుకుంటే ఓటిటి ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియొ (Amazon Prime Video) లో స్ట్రీమింగ్ అవుతున్న ‘ది మిస్ట్రెస్స్ ‘ (The Mistress) మూవీని మిస్ కాకుండా చూడండి.