Chandra Mohan :
సినీ ఇండస్ట్రీలో అవకాశాలు రావడం కష్టం.. వచ్చిన అవకాశాలు నిలబడటం కష్టమే.. అయితే ఇండస్ట్రీలో స్టార్ ఇమేజ్ ను అందుకున్న నటీనటులు తమ కుటుంబంలో వాళ్లను ఇండస్ట్రీలోకి తీసుకొస్తున్నారు.. ఇప్పటికే ఎంతో మంది స్టార్స్ తమ వారసులను ఇండస్ట్రీకి పరిచయం చేశారు. అందులో కొందరు సక్సెస్ అవ్వగా.. మరి కొంతమంది సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్నారు.. కానీ టాలీవుడ్ హీరో, నటుడు అయిన చంద్రమోహన్ తన వారసులను పరిచయం చెయ్యలేదు. దానికి పెద్ద కారణమే ఉందట.. బాగా చదివించి ప్రయోజకులను చేసి పెళ్లిల్లు చేశారు. అయితే ఆయన ఎందుకు ఫ్యామిలీని చూపించలేదో తెలుసుకుందాం..
సినీ ఇండస్ట్రీలో చంద్రమోహన్ పేరు తెలియని వాళ్ళు ఉండరు. ఒకప్పుడు హీరోగా వరుస సినిమాలు చేశాడు. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో వందల సినిమాల్లో నటించి తెలుగు ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నాడు.. ఈయన సినిమాలకు మార్కెట్ ఉంది. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఎన్నో అద్భుతమైన పాత్రలు చేశారు. ఆయన తన కెరీర్ మొదట్లో పలు సినిమాల్లో హీరోగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ టైంలో ఆయనతో ఏ హీరోయిన్ నటించిన స్టార్ హీరోయిన్ అవుతారని సెంటిమెంట్ కూడా ఉండేది. అందుకే హీరోయిన్లు ఆయనతో సినిమాలు చెయ్యడానికి ముందుకు వచ్చేవాళ్ళు.. అయితే ఈయన తన ఫ్యామిలీ నుంచి ఒక్కరిని కూడా ఇండస్ట్రీకి పరిచయం చెయ్యలేదు. అందుకు కారణం కూడా ఉందట..
ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న ఈయన ఈ ప్రశ్న పై స్పందించారు. తనకు ఇద్దరు అమ్మాయిలు ఉన్నారని ఇద్దరు బాగుంటారని.. చిన్నమ్మాయి చాలా బాగుంటుందన్నారు. వాళ్ళని చిన్నప్పుడు ఓ హీరోయిన్ చూసి పిల్లలు చాలా బాగున్నారు.. చైల్డ్ ఆర్టిస్ట్ గా పరిచయం చేద్దామని అడిగినట్లు తెలిపారు.. కానీ సినిమాలు ఇష్టం లేని ఆయన దానికి ఒప్పుకోలేదట.. మనం షూటింగ్ లో ఎంత కష్ట పడుతున్నామో చూస్తున్నాం మన పిల్లలు కూడా ఎందుకు కష్ట పడాలి..? వాళ్ళు ఏదైనా ఉద్యోగాలు చేస్తే బాగుంటారు. ఇలా అందరితో మాటలు పడటం ఇష్టం లేదని తెగేసి చెప్పాడు..
ఆయన ఫ్యామిలీ విషయానికొస్తే.. భార్యా పిల్లలను ఎప్పుడైనా షూటింగ్ తీసుకువెళ్లినా వాళ్లు తనను గుర్తుపట్టే వాళ్ళు కాదని చెప్పారు. సినిమా ప్రభావం వాళ్ళపై పడకుండా ఇద్దరినీ పెంచాలని అనుకున్నట్టు తెలిపారు. అలాగే పెంచామని ప్రస్తుతం ఇద్దరు బాగా చదివి గోల్డ్ మెడల్స్ సాధించారని తెలిపారు. ఇద్దరు మంచి ఉద్యోగాల్లో స్థిరపడ్డారని ఆయన అన్నారు. అందుకనే ఆయన ఫ్యామిలీలో ఎవరూ సినిమాల్లోకి రాలేదని అన్నారు. ఇలానే అప్పటిలోని హీరోలు చాలా మంది ఆచించారు. అందుకే తమ తరువాత వారసులను ఇండస్ట్రీలోకి తీసుకురాలేదు. శోభన బాబు లాగే అందరు ఆలోచించి పిల్లలు భవిష్యత్ సినిమాల్లో ఉండకూడదని భావిస్తున్నారు. కానీ ఇప్పుడు హీరోలు తమ వారసులను ఇండస్ట్రీలోకి తీసుకొని వస్తున్నారు.. సినిమాలు హిట్ అవ్వకపోయిన కూడా క్రేజ్ ను అందుకుంటున్నారు. కొందరు హీరోలు అమ్మాయిలను హీరోయిన్లు గా లాంచ్ చేస్తే మరి కొందరు మాత్రం కొడుకుల లాంచ్ చేస్తున్నారు..