Chiranjeevi: టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా విశ్వంభర. యువి క్రియేషన్స్ పతాకంపై ఈ సినిమా నిర్మిస్తున్నారు. వశిష్ట దర్శకత్వంలో ఈ సినిమా రానుంది. సోషియో ఫాంటసీ యాక్షన్ డ్రామగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు ఎం ఎం కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. తాజాగా విడుదలైన రామారావు పాటకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. ఈ సినిమా నుంచి ఎటువంటి అప్డేట్ వచ్చినా నిమిషాల్లో వైరల్ అవుతుంది. సినిమా గురించి తెలుసుకోవడానికి అభిమానులు ఆత్రుత ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ సినిమా గురించి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటికి వచ్చింది దాని గురించి ఇప్పుడు చూద్దాం..
ఆ ఒక్క దానికే అంత ఖర్చు …
మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమా తర్వాత చేస్తున్న సినిమా కావడంతో అభిమానులలో భారీ అంచనాలే ఉన్నాయి. టాలీవుడ్ లోనే ఫాంటసీ సినిమాలు అనేకం వచ్చాయి. తాజాగా ఈ సినిమా గురించి ఇంట్రెస్టింగ్ విషయం ఒకటి బయటకు వచ్చింది. ఈ సినిమా ఆధ్యాధునిక విజువల్ ఎఫెక్ట్ కోసం, సిజిఐ కోసం, భారీ బడ్జెట్ ను కేటాయిస్తున్నట్లు తెలుస్తోంది. దాదాపు సిజిఐల కోసం 75 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. భారీ బడ్జెట్ చిత్రంగా విశ్వంభరా రానుంది సినిమాలో ఎక్కువగా విజువల్ ఎఫెక్ట్స్ ఉంటాయని తెలుస్తోంది. సినిమా దాదాపు vfx పై ఆధారపడి ఉంది. ఈ చిత్రంలో ఒక సన్నివేశం కోసం 12 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు సమాచారం. అత్యధిక టెక్నాలజీలతో అంతర్జాతీయ స్థాయి నాణ్యతతో రూపొందిస్తున్నారు. ఈ సినిమా చిరంజీవి హనుమంతుడి భక్తుడిగా నటిస్తున్నట్లు సమాచారం. తెలుగు సినిమాలో విజువల్ ఎఫెక్ట్, సిజిఐ ఖర్చులలో బాహుబలి ఆ తర్వాత RRR వంటి చిత్రాలు మొదటి స్థానాల్లో నిలవగా ఇప్పుడు సోషియో ఫాంటసీ చిత్రంగా వస్తున్న విశ్వంభరా వాటి కన్నా ముందు స్థానంలో నిలబడేలా ఉంది. ఈ సినిమా సిజిఐ ఖర్చులే ఇంత భారీ మొత్తంలో ఉంటే, సినిమా పూర్తయ్యేసరికి బడ్జెట్ 200 కోట్లు దాటిన ఆశ్చర్య పడక్కర్లేదు. ఈ సినిమాకు పెట్టే సీజీఐ ఖర్చులతో నాలుగు చిన్న సినిమాలను రూపొందించచ్చని, నిపుణుల అభిప్రాయపడుతున్నారు.
సినిమా మొత్తం దానిమీదే ఆధారం ..
మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర సినిమా టీజర్ ఇప్పటికే రిలీజ్ అయ్యి ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన లభించింది. దానికి కారణం టీజర్ లో చూపిన విజువల్ ఎఫెక్ట్స్ అంత పెద్దగా ఆకర్షించకపోవడం అన్నది సమాచారం. ఏది ఏమైనా విజువల్ ఎఫెక్ట్స్ తో వచ్చే సినిమాలు ఆకట్టుకుంటాయి అన్నది మాత్రం నిజం. బింబిసారా ఫేమ్ వశిష్ట ఈ సినిమాను ఒక ఊహాత్మక లోకంలోకి తీసుకువెళ్లే విధంగా రూపొందిస్తున్నారు. బింబిసారా సినిమాతో సూపర్ సక్సెస్ ని అందుకున్న వశిష్ట ఈ సినిమా ప్రకటించినప్పటి నుండి అభిమానుల్లో అంచనాలు పెరిగిపోయాయి. ఈ సినిమాలో హీరోయిన్ గా త్రిష నటిస్తుంది. కునాల్ కపూర్, మీనాక్షి చౌదరి, అసికా రంగనాథన్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమా తరువాత రానుండడంతో, సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. వాల్తేరు సినిమా ఆధ్యాంతం కామెడీ మూవీగా రూపొందించారు. ఈ సినిమా ఫాంటసీ ఆధారంగా రూపొందుతుండంతో భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మించడంతో అభిమానులు సినిమా రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నారు. అన్నీ కుదిరితే ఈ సినిమాని మేలో రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.
Priyadarshi: నాకు చిన్న సినిమాలు వద్దు.. ఇన్ హీరో షాకింగ్ స్టేట్మెంట్..