Intinti Ramayanam Today Episode February 21 st : నిన్నటి ఎపిసోడ్ లో.. అవని ఇంటికి రాగానే సంతోషంగా స్వరాజ్యం దయాకర్ కి స్వీట్లు ఇవ్వాలని అనుకుంటుంది. అయితే అవని సంతోషాన్ని చూసి వాళ్ళు బాధపడతారు ఏమైంది ఎలా ఉన్నారు? ఒక స్వీట్ తింటే ఏం కాదులే అనే సన్నగాని నువ్వు మా కోసం స్వీట్ తీసుకొచ్చావ్ కానీ నీకు మేము చేదు వార్తలు చెప్పాల్సి వస్తుంది అని స్వరాజ్యం అంటుంది. ఏమైంది పిన్ని అంటే నీకు మీ ఆయన విడాకులు ఇవ్వాలని అనుకుంటున్నాడని అంటుంది. అది చూసి షాక్ అయినా అవని పరిగెత్తుకుంటూ వాళ్ళింటికి వెళ్తుంది. అటు శ్రీయా కోమలి ఇద్దరూ మీ ఆయన మా ఆయన ఎక్కడికి వెళ్లారని మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే అవని అక్కడికి వస్తుంది. నువ్వు ఎందుకు వచ్చావు మళ్ళీ అని కోమలి అంటుంది. ఇంట్లో కొన్ని విషయాలు గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. వాటి గురించి మాట్లాడాలి ఇంట్లో పెద్దవాళ్ళు అని పిలుస్తామని అడుగుతుంది. ఇక పార్వతీ భానుమతి కోమలి ముగ్గురు కలిసి విడాకుల మీద సంతకాలు పెట్టాలని బలవంతం చేస్తారు కానీ మాత్రం అసలు మాట వినకుండా విడాకులు ఇవ్వాలంటే నా కండిషన్స్ ఒప్పుకోవాలని కండిషన్స్ పెట్టి వెళ్తుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది..
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. స్వరాజ్యం దయాకర్ ఇద్దరు అవని గురించి బాధపడుతూ ఉంటారు. ఏమైంది ఇంకా అవన్నీ రాలేదు ఎప్పుడో అనగా వెళ్లింది అని స్వరాజ్యం టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడే అవని ఇంట్లోకి వస్తుంది. విడాకుల గురించి నీ వాళ్ళతో మాట్లాడవా అని స్వరాజ్యం అడుగుతుంది. కానీ వాళ్లకి దగ్గరగా ఉండాలని నేను అనుకుంటున్నాను కానీ వాళ్ళు నన్ను వదిలించుకోవాలని అనుకుంటున్నారు ఈ గొడవలు ఇవి ఎంత వరకు వెళ్తాయో ఎప్పుడూ ముగుస్తాయో తెలియట్లేదు పిన్ని అని అవని బాధపడుతూ ఉంటుంది. నేను ఎంత ఆ ఇంటిని కాపాడుకోవాలని చూస్తున్న సరే ఆ ఇంట్లో వాళ్ళు నాకు ఇలా చేయాలని అనుకుంటున్నారని అవని బాధపడుతుంది. ఇక తర్వాత అక్షయ్ విడాకులు నోటిఫికేషన్ పంపించినట్టు రాజేంద్రప్రసాద్ కు శ్రియ శ్రీకర్ కమల్ పల్లవిలు చెప్తారు. అది విని రాజేంద్రప్రసాద్ షాక్ అవుతాడు.. అక్షయ్ ఇలా చేస్తాడు నేను అసలు ఊహించలేదు అని రాజేంద్రప్రసాద్ బాధపడతాడు. అక్షయ్ ను పిలిచి ఆ విషయాన్ని అడగాలని అనుకుంటారు.
అక్షయ్ ని పిలిచి ఈ విషయం గురించి అడిగితే అక్షయ్ నేనెందుకు విడాకులు పంపిస్తాను నేను అసలు పంపించలేదు నాకు తెలియకుండా నీదంతా జరిగిపోయింది ఎవరు చేశారు అని అనుకుంటారు. అటు ఆరాధ్య అమ్మ నువ్వు నేను కలిసి ఉండాలని ఒక డ్రాయింగ్ వేసి అక్షయకిస్తుంది. ఇక విడాకులు ఇచ్చిన విషయం పెద్ద రచ్చ చేస్తారు. అక్షయ్ నాకు తెలియకుండా అసలు అవనికి ఎవరు విడాకులు పంపించారని ఆలోచిస్తూ ఉంటారు. దానికి రాజేంద్రప్రసాద్ పార్వతిని పిలిసి అడుగుతాడు.. అక్షయ్ జీవితం బాగుండాలని నేనే విడాకులు పంపించాను అని పార్వతి అంటుంది. నేను అవనిని వదిలిపెట్టాల అమ్మ నువ్వు చెప్పు అనేసి అక్షయ్ అంటాడు. ఇంట్లో పెద్ద రచ్చ జరుగుతుండగానే పోస్ట్మాన్ వచ్చి పల్లవిని పిలుస్తాడు. పల్లవి కొచ్చిన నోటీస్ చూసి షాక్ అవుతుంది. కమల్ పల్లవికి విడాకులు పంపిస్తాడు. అది కమల్ కు చెప్తుంది.
అవును నేనే విడాకులు పంపించాను. అన్నయ్య వదినకు విడాకులు పంపించడానికి నీ హస్తం ఉందని నాకు తెలుసు. అవని వదిన ఇంట్లోంచి వెళ్ళిపోతుంటే అందరూ బాధపడుతున్నారు కానీ నువ్వు మాత్రం మొహం లో ఏ బాధ లేకుండా నార్మల్గానే ఉన్నావు. నిన్న కూడా అవనీ వదిన వస్తే పెద్ద రచ్చ చేసావ్ దీనంతటినీ కలిపి చూస్తే అవనీ వదిన ఇంట్లోంచి వెళ్ళడానికి కారణం నువ్వే అని నాకు తెలుస్తుంది నేను తింగరోన్ని మరీ అంత మీరు అనుకున్నంత కాదు. కాస్త వెర్రి ఉంది అంతేకానీ మనుషులు ఎలాంటి వాళ్ళు తెలుసుకొనేనంత మూర్ఖునైతే కాదు అని కమల్ పల్లవికి పెద్ద క్లాసు ఇస్తాడు. ఇక పల్లవి పార్వతి దగ్గరికి వెళ్లి పెద్ద రచ్చ చేయాలని అనుకుంటుంది. అనుకున్నట్లుగానే కమల్ బావకి అంత తెలివి లేదు అత్తయ్య ఇదంతా అవని వదినే ఆడించి చేయిస్తుంది అని ఎక్కించి చెప్పేస్తుంది..
అటు అక్షయ్ అవని దగ్గరికి వెళ్లి నిజం చెప్పాలనుకుంటాడు. కానీ అవని మాత్రం తనకు విడాకులు పంపించిన విషయం తెలిసి కూడా నాతో మాట్లాడాలని అనుకుంటున్నాడు అని కావాలని మాట మార్చి జాబ్ గురించి మాట్లాడుతుంది. నేను నీకు విడాకులు పంపించలేదు అవని ఇంట్లో పరిస్థితులు బట్టి నీకు దూరంగా ఉన్నాను నిన్ను జీవితంలో ఎలా వదులుకుంటున్నాను అనుకుంటున్నావు అని అవనిత అంటాడు. నాకు తెలుసండి మీరు ఏంటో నాకు తెలుసు కాబట్టి నేను నమ్మలేదు నువ్వు వెళ్లినప్పటి నుంచి ఇంట్లో ఒకదాని తర్వాత ఒకటి సమస్య వచ్చి పడుతూనే ఉంది అని అక్షయ్ అనగానే అవని ఏమైంది ఇప్పుడు ఏం జరిగిందని అడుగుతుంది.. విడాకులు నోటీస్ పంపించడానికి పల్లవి హస్తము ఉందని కమల్ పల్లవికి విడాకులు పంపించాడు అనగానే అవని షాక్ అవుతుంది. కన్నయ్య ఎందుకిలా చేశాడు అని పల్లవి అంటుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో పల్లవి అవని దగ్గరకొచ్చి కమల్ విడాకులు పంపించడం గురించి మాట్లాడుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి..